
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు.
తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్
నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్‌హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు.
కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్‌ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతో ఆదివారం భేటీ అయ్యారు.