seeman
-
ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్
ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది. సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ. ఇదే నా చివరి వీడియో ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by The Whistle (@thewhistletv) -
29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో మద్రాస్ హైకోర్టు నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి విజయలక్ష్మి 2011లో నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్న్పై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!) సీమాన్, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు దాఖలైంది. అనంతరం సీమాన్ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా వేశారు. సీమాన్ సూపర్.. ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. -
ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్!
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?) అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సీమాన్ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీమాన్ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు సీమాన్ సూపర్.. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. (ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) -
పెళ్లి పేరుతో శారీరకంగా!.. డైరెక్టర్‌పై స్టార్ హీరోయిన్ ఫిర్యాదు!
1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చేశారు. మద్రాసులో జన్మించిన విజయలక్ష్మి కర్ణాటకలోని బెంగుళూరులో చదువుకుంది. తన కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఆత్మాహత్యాయత్నం 2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఊహించని సంఘటనలతో అతనితో నిశ్చితార్థం బ్రేకప్ అయింది. ఆ తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మోసం తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని సీమాన్ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేశారు. -
న్యాయం చేయండంటూ జడ్జి ముందు ఏడ్చేసిన నటి
తిరువళ్లూరు: నామ్ తమిళర్ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు చేసిన సినీనటి విజయలక్ష్మి తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. దీంతో పాటు ఆధారాలను న్యాయమూర్తికి సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ తన సహచర నటి విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆందోళన చేపట్టిన నటి దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేసన్‌లో సీమాన్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉండటంతో పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తానూ, సీమాన్ సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు. పోలీస్ స్టేషన్లో 6 గంటలు విచారణ ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్ ఉమయాల్, అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్, సీఐలు మహ్మద్బర్గతుల్లా, రాజ్యలక్ష్మి.. విజయలక్ష్మిని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆరు గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు. ఆధారాలు సమర్పించిన నటి గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని న్యాయమూర్తి కోరగా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తనకు సీమాన్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కంటతడిపెట్టారు. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం బందోబస్తు నడుమ విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు. చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే -
ప్రేమ పేరుతో మోసం.. ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగట్లే: నటి ఆవేదన
తమిళ నటి, తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాలో నటించిన విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. మోసం చేయడమే కాకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను వేడుకుంది. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతూ.. 'నేను సీమన్పై గతంలోనూ ఫిర్యాదు చేశాను. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అంతకుముందున్న ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదు' అని పేర్కొంది. సహజీవనం.. ముఖం చాటేసిన సీమన్ కాగా విజయలక్ష్మి.. సీమన్పై గతంలోనూ ఈ ఆరోపణలు చేసింది. 2007-2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేశాడంది. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ సీమన్ సెటిల్మెంట్కు రావడంతో కేసు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యాయత్నం అయితే విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో 2020లో విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో సీమన్, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియో పోస్ట్ చేసి మరీ సూసైడ్‌కు యత్నించింది. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడింది. చదవండి: ఆమె మోజులో హీరో.. అతడినే గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. అప్పుడు డిప్రెషన్లో.. ఇప్పుడు నడవలేని స్థితిలో.. వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే.. -
వివాదంలో సీమాన్.. 300 మంది పార్టీ నాయకులపై కేసులు
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళనాడు కోసం ప్రత్యేక జెండా ఎగుర వేయడంతో ఆయపై కేసు నమోదు చేశారు. సీమాన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయనపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ప్రత్యేక తమిళనాడు నినాదంతో జెండాను సిద్ధం చేయించారు. సోమవారం సేలంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు కోసం ప్రత్యేక జెండా అని ప్రకటించడంతో పాటు ఎగుర వేశారు. ఈ చర్యను అధికారులు తీవ్రంగా పరిగణించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమాన్‌పై మంగళవారం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమానికి హాజరైన నలుగురు మహిళలు సహా 300 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు. చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్) -
ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు జీకే మూప్పనార్ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది. మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు. ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది. పంచముఖ పోటీ తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్ నీది మయ్యం (కమల్‌హాసన్), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్), నామ్ తమిళర్ కట్చి (సీమాన్) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్‌హాసన్, టీటీవీ దినకరన్‌లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 2016లో పార్టీ స్థాపించిన సీమాన్ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్‌కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
రాజీవ్ గాంధీ హత్య సరైనదే: సీమాన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం తమిళనాడులో మరోసారి దుమారం లేపింది. శాంతి ఒప్పందం పేరిట శ్రీలంకతో రాజీవ్‌గాంధీ రాయబారం నడిపినందుకు తామే మట్టుబెట్టామని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అధినేత సీమాన్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎల్టీటీఈ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్ తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వర్గాన్ని హతమార్చిన రాజీవ్‌గాంధీని తమిళ భూమిలోనే మట్టుబెట్టామన్నారు. చెన్నైలోని సీమాన్ ఇల్లు, ఎన్ఎంకే కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం రావడంతో, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీమాన్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంకలో జరుగుతున్న ఎల్టీటీఈ పోరు నేపథ్యంలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు. ఎల్టీటీఈ పోరుకు తమిళనాడులోని అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి. వాటిల్లో ఎన్టీకే కూడా ఒకటని చెప్పవచ్చు. ఎల్టీటీఈకి బహిరంగ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్ తన పార్టీ పతాకంలో సైతం పులుల బొమ్మకు చోటిచ్చి తన సంఘీభావాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రం నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరీ రాష్ట్రం కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీచేస్తున్నారు. -
సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమిళ ప్రముఖ పార్టీ ‘నామ్ తమిళర్ కట్చి’ ప్రశంసల వర్షం కురిపించింది. తనపై నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజల పట్ల చిత్తశుద్ధితో పచిచేస్తున్నారని కొనియాడింది. కొన్నేళ్లుగా తమిళనాట తెలుగు వారిపై మండిపడుతున్న నామ్ తమిళర్ కట్చి అద్యక్షుడు సీమాన్.. వేలూరులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు అమలు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. సభలో ప్రసంగిస్తున్న నామ్ తమిళర్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్ దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, వితంతువులకు పింఛన్లు ప్రకటించటం.. ఎన్నుకున్న ప్రజల పట్ల సీఎం జగన్ ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. తమ రాష్ట్రం, తెలుగు జాతి సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉండటం హర్షనీయం అన్నారు. ఎప్పుడూ తెలుగువారిపై మండిపడే సీమాన్ ఏపీ సిఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించటంపై తమిళ రాజకీయాల్లో చర్చగా మారింది. -
రజనీ కన్నా కమల్ బెటర్!
పాఠ్యపుస్తకాల్లో రజనీకాంత్ జీవితానికి సంబంధించిన అంశాలను చేర్చడంపై సినీ దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ విమర్శలు గుప్పించారు. శనివారం ఉదయం నెల్లై జిల్లా పాలైయకోటైట జ్యోతిపురంలో నామ్ తమిళర్ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ నటుడు రజనీకాంత్‌కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం ఐదవ తరగతి పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడాన్ని సీమాన్ తీవ్రంగా విమర్శించారు. సినీరంగంలో విజయాలు సాధించిన వారి గురించి పాఠ్య పుస్తకాల్లో పొందుపరచడం సరైన చర్య కాదన్నారు. అలా చూస్తే రజనీకాంత్ కంటే కమల్‌హాసనే ఎంతో సాధించారని పేర్కొన్నారు. అయినా కళారంగంలో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఖ్యాతిగాంచిన సుందరపిళ్లై కూడా శ్రమతో విజయం సాధించిన వారేనని అన్నారు. అలాంటిది రజనీకాంత్‌ను పాఠ్య పుస్తకాల్లో కీర్తించడం ఆక్షేపించదగ్గ విషయంగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న నడిగర్‌సంఘం ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అధ్యక్షపదవికి దర్శకనటుడు కే.భాగ్యరాజ్ పోటీ చేయడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోయారని అన్నారు. సర్కార్ చిత్ర సమస్య విషయంలో దర్శకుడు కే.భాగ్యరాజ్ సరైన విదంగా స్పందించారని సీమాన్ ప్రశంసించారు. కే.భాగ్యరాజ్ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
‘రజనీ ఆలోచనలు ప్రమాదకరం’
తమిళ సినిమా : రజనీకాంత్ ప్రమాదకరమైన ఆలోచనపరుడని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం జరుగుతున్న తమిళుల పోరాటం సినీ రంగంలోనూ సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్‌పై పలువురు సినీ ప్రముఖులు మాటల దాడి చేస్తున్నారు. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం సినీ దర్శకుడు కే.భారతీరాజా నేతృత్వంలో తమిళగ కళై ఇళక్కియ పన్బాటు పేరవై అనే సంఘాన్ని నెలకొల్సి పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఆందోళన కార్యక్రమంలో ఒక పోలీస్ దాడికి గురయ్యారు. ఈ సంఘటనపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై దర్శకుడు భారతీరాజా వర్గం మండిపడుతోంది. ఇదే విషయంపై నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ కావేరి మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం తాము శాంతియుత పోరాటం చేస్తున్నామన్నా రు. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ను బాధించటం బాధాకరమేనన్నారు. అయితే ఈ అంశంపై నటుడు రజనీకాంత్ ఇది హింసకు పరాకాష్ట అని పేర్కొనే ముందు పోరాటంలో ఏం జరిగిందన్నది తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పోరాటంలో పాల్గొన్న దర్శకుడు భారతీరాజా, గీతరచయిత వైరముత్తు వంటి వారు ఆయన స్నేహితులేనని, వారిని అడిగి తెలుచుకోవచ్చుగా అని ప్రశ్నించారు. జల్లికట్టు పోరాటంలో జరిగిన దాడి గురించి రజనీ స్పందించలేదని, ఒక పోలీసు ఎత్తిపడేయడంతో మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఆయన స్పందించలేదన్నారు. అలాంటిది కావేరి మేనేజ్మెంట్ బోర్డు కోసం జరుగుతున్న పోరాటంతో గాయాలపాలైన పోలీస్ విషయంలో హింసకు పరాకాష్ట అని పేర్కొన్న రజనీకాంత్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇటీవల అత్యాచారం కారణంగా బలైన చిన్నారి ఆసిఫా ఉదంతంపై కూడా రజనీ స్పందించలేదన్నారు. అలాంటి రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలన్నది తమ లక్ష్యమని సీమాన్ పేర్కొన్నారు. -
రేపు కుండబద్దలు కొడతా: అగ్రహీరో
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు. తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్ నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్‌హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు. కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్‌ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతో ఆదివారం భేటీ అయ్యారు. -
తమిళనాడులో మరో కూటమి
సాక్షి, చెన్నై: తమిళనాడులో మరో రాజకీయ కూటమి ఏర్పాటైంది. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మదురై విమానాశ్రయంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని, రాష్ట్ర సంక్షేమం కోసం తాము కలిసి పోరాడతామని వారు తెలిపారు. అంశాలవారీగా పోరు కొనసాగిస్తామని ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన శరత్‌కుమార్, సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది. రజనీ-కమల్‌కు వ్యతిరేకంగా వీరు గళం విన్పిస్తున్నారు. మరోవైపు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ కూడా రజనీ-కమల్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. -
రాష్ట్రానికి ఐదు రాజధానులు
ప్రగతి నినాదంతో పుస్తకంగా విడుదల విద్య, వైద్య,విద్యుత్‌కు పెద్ద పీట రాజీవ్ నిందితుల విడుదల చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రగతి నినాదంతో 314 పేజీలతో పుస్తకం రూపంలో మేనిఫెస్టోలో వివరాలను పొందు పరిచారు. విద్య, వైద్య, విద్యుత్‌కు పెద్ద పీట వేయడంతో పాటుగా, రాజీవ్ హత్య కేసు నిందితుల్ని తక్షణం విడుదల చేస్తామని ప్రకటించారు. సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి, ఈలం తమిళులకు మద్దతుగా సాగిన ఉద్యమంతో అందరి దృష్టిలో వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల రాజుగా సీమాన్ ముద్ర వేసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పలు మార్లు జైలుకు వెళ్లొచ్చిన సీమాన్ ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా నామ్ తమిళర్ ఇయక్కం ప్రకటించారు. తదుపరి నామ్ తమిళర్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చేశారు. ఈలం తమిళులకు, తమిళానికి వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల భరతం పట్టే విధంగా ప్రచారాల్లో ముందుకు సాగుతూ వచ్చిన సీమాన్ రానున్న ఎన్నికల్లో తన సత్తాను చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి కంటే, ముందుగా ఒకే సమయంలో ఒకే వేదికగా కడలూరు నుంచి గత నెల 234 నియోజకవర్గాల బరిలో నిలబడే అభ్యర్థుల్ని ప్రకటించారు. అలాగే, హిజ్రాలకు సైతం సీటును ఇచ్చి అందరి దృష్టిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన ఎన్నికల మేనిఫెస్టోను సీమాన్ ప్రకటించారు. మేనిఫెస్టో: తన ఎన్నికల మేని ఫెస్టోను పుస్తకం రూపంలో సీమాన్ ప్రకటించారు. 314 పేజీల్లో రాష్ట్ర ప్రగతి, తమిళ సంక్షేమం లక్ష్యంగా పథకాలను పొందు పరిచారు. ఉచితాలకు దూరంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ప్రజా సౌలభ్యం కోసం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐదు రాజధానుల్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. చెన్నై ప్రధాన కేంద్రంగా, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారిలను అనుబంధ రాజధానులుగా ప్రకటించి, అన్ని రకాల సేవల్ని ఆయా రాజధానుల్లోనే ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధికారిక ముద్రగా మహాకవి తిరువళ్లువర్ చిత్రాన్ని, చెరన్, చోళ, పాండ్యరాజుల పాలనను మేళవిస్తూ, చేప, పులి, ధనస్సు, బాణంలతో కూడిన తమిళనాడు ప్రభుత్వ జెండాను రెపరెపలాడేలా చేస్తామని వివరించారు. సాగుకు పెద్ద పీట, జాలరన్నకు భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఈలం తమిళులకు స్వేచ్ఛాయుత జీవనం, తదితర అంశాల్ని పొందు పరచడంతో పాటుగా, మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో నిందితులుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారందర్నీ తమ అధికారాన్ని ప్రయోగించి విడుదల చేస్తామని ప్రకటిస్తూ, సరికొత్త అంశాల్ని క్రోడీకరిస్తూ మేని ఫెస్టోను సీమాన్ రూపొందించి ఉండటం విశేషం. ఇక , ప్రజా కూటమిలోని డీఎండీకే చేరిక గురించి ప్రశ్నిం చగా, ముందే ఎందుకు ప్రకటించ లేదో అని వ్యాఖ్యానించారు. నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకునే ధైర్యం విజయకాం త్‌కు లేదు అని, నాన్చుడుతో ఒంటరి అని, ఇప్పుడు కూటమి అని అభాసుపాలు అయ్యారని ఎద్దేవా చేశారు. -
సీమాన్ నీ ప్రాంతం ఏది!
అఖిల భారత తెలుగు సమాఖ్య సూటి ప్రశ్న దేశద్రోహిగా మిగిలిపోతావ్ : సీఎంకే రెడ్డి హెచ్చరిక అధిక ప్రసంగం మానుకో : సీమాన్‌కు తెలుగు ప్రముఖుల సూచన కొరుక్కుపేట: మలయాళీ అయిన సీమాన్ సినీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమిళజాతికి తానేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారని, తమిళులకు, తమిళభాషకు ఆయన చేసింది ఏమీలేదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీ.ఎం.కే.రెడ్డి ఎద్దేవా చేశారు. తమిళనాట తెలుగు, తమిళులు సోదరభావంతో మెలుగుతుండగా విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా సీమాన్ తేనిలో వ్యవహరించిన తీరు పూర్తిగా ఖండించదగినదని అన్నారు. ఇటీవల తేనిలో మామన్నార్ తిరుమలై నాయకర్ను నామ్ తమిళర్ కచ్చి నాయకులు సీమాన్ అసభ్యకరంగా దూషించడాన్ని ఖండిస్తూ సోమవారం అఖిల భారత తెలుగు సమాఖ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సీఎంకే.రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా తెలుగు, తమిళులు కలసిపోయామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగు నాయకులు ఎనలేని సేవ చేశారని గుర్తుచేశారు. పలువురు ముఖ్యమంత్రులతో పాటు కృష్ణదేవరాయులు, వీరపాండి కట్టబొమ్మన్ , ఒండి వీరన్, చెన్నై తొలి మేయర్ సర్ పిట్టీ త్యాగరాయ శెట్టి ఇలా ఎందరో తెలుగువారు సేవలు అందించారని గుర్తు చేశారు. తేని జిల్లా అభివృద్ధిలో తిరుమలై నాయకర్ సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని తెలిపారు. ఇలాంటి వారిపై గూండాచట్టం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల రాజకీయ నేతగా వ్యవహరించాల్సిందిపోయి తెలుగు తమిళుల మధ్య చిచ్చుపెట్టేలా సీమాన్ మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున హెచ్చరించారు. సీమాన్ వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆయనపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీమాన్ నీ ప్రాంతం ఏదని సీఎంకే రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు విషయంలో నోటి దురుసును ప్రదర్శించారని, దీన్ని తీవ్రంగా ఖండించడంతో వెనక్కి తగ్గారని, మళ్లీ అదే దూకుడుతో ప్రస్తుతం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్స్ చిరంజీవి, గొల్లపల్లి ఇశ్రాయేలు, ప్రధాన కార్యదర్శి ఆర్.నందగోపాల్, ట్రెజరర్ శంకరన్, యూత్ వింగ్ ప్రెసిడెంట్ సురేష్, లీగల్ వింగ్ సెక్రటరీ ఆనంద్, హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ అళగువేల్, స్టేట్ సెక్రటరీ కరుణానిధి పాల్గొన్నారు. -
సీమాన్ సేన రెడీ!
ప్రప్రథమంగా అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు నామ్ తమిళర్ కట్చి సిద్ధమయింది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు పది నెలలకు ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చెన్నై: శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా సినీ దర్శకుడు సీమాన్ నామ్ తమిళర్ ఇయక్కంను గతంలో ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ ఆదర్శంగా, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ, ఈ ఇయక్కం ద్వారా బహిరంగ సభల్లో ఆయన చేసే ప్రసంగం వివాదానికి దారితీస్తూ వచ్చింది. కేసుల మోత సైతం మోగాయి. అయినా, తగ్గని సీమాన్ తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల తన ఇయక్కంను రాజకీయ పార్టీగా ప్రకటించారు. నామ్ తమిళర్ కట్చి పేరిట కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. ప్రధానంగా తమిళ ఈలం లక్ష్యంగా, తమిళుల అభ్యున్నతి నినాదంతో ముందుకు సాగుతున్న సీమాన్ మరో అడుగు ముం దుకు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో పొత్తు తమకు అవసరం లేదని, తమిళులతోనే తమ మద్దతు అంటూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రప్రథమంగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలకు పైగా సమయం ఉన్నా, దాంతో తమకు పని లేదంటూ, ఇప్పుడే తమ అభ్యర్థుల తొలి చిట్టాను ప్రకటించేశారు. సీమాన్ సేన రెడీ కొద్ది రోజులుగా సీమాన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. తమిళాభిమానుల మద్దతు కూడగట్టుకునే విధంగా అక్కడక్కడ బిహ రంగ సభల్ని నిర్వహిస్తూ సంచనల, వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం గూడువాంజేరిలో జరిగిన సభలో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటిస్తూ, తొలి విడతగా తొమ్మిది మందితో అభ్యర్థుల చిట్టాను విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా న్యాయవాదులు ఉండటం గమనార్హం. ఆ మేరకు నాగుర్కోయిల్- కాకలై కుట్టుదళం, శివగంగై - ఎలిల్ కుమార్, తిరువాడనై - రాజీవ్ గాంధీ అలియాస్ అరివు సెల్వం, షోళింగనల్లూరు - రాజన్, తిరుపత్తూరు - సినీ నిర్మాత కోట్టై కుమార్, మైలం- డాక్టర్ విజయలక్ష్మి, అంబత్తూరు - అన్భు తెన్నరసన్, గౌండం పాళయం - సినీ దర్శకుడు కార్వణ్ణన్, కుంభకోణం - మణి సెంథిల్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఒంటరిగా సిద్ధం అయ్యామని, పట్టున్న చోట్ల మాత్రమే తమ పోటీ ఉంటుందంటూనే, తమిళుల కోసం ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు వెళ్తున్నామని సీమాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కారాగారాల్లో పదిఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న వాళ్లను క్రమ శిక్షణను పరిగణలోకి తీసుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పరిష్కారం కోసం జూలై పదిన మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై, పుళల్ కారాగారాల ముందు ఆందోళనలు చేపట్టనున్నామని ప్రకటించారు. అలాగే, శ్రీలంక నుంచి వస్తున్న ఈలం తమిళుల్ని విచారణ పేరిట వేదించ వద్దని, ప్రత్యేక శిబిరాల్లో ఉన్న వాళ్లకు స్వేచ్ఛ కలిగించాలని డిమాండ్ చేశారు. -
వడివేలును బెదిరిస్తే తీవ్ర పరిణామాలు : సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. -
విలీనం.. అన్యాయం...
బూర్గంపాడు,న్యూస్‌లైన్: తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడం పట్ల స్థానికులు కలవరం చెందుతున్నారు. వందల ఏళ్లుగా తెలంగాణలో మమేకమైన బూర్గం పాడు ఇక ఆంధ్రప్రాంతానికి వెళుతుందనే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. గోదావరినదిపై బ్రిడ్జి నిర్మించకముందు తెలంగాణ- ఆంధ్రాప్రాంతాల రాకపోకలకు కూడలైన బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం పరిశీలిస్తే.... భద్రాద్రి రామాలయం నిర్మాణసమయంలో కూడా అన్నిరకాల వస్తురవాణా బూర్గంపాడు నుంచే జరిగేదని చరిత్రచెబుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చిన వస్తువులు, సరుకులు ఇక్కడే దిగుమతి అయ్యేవి. భద్రాచలం వచ్చే భక్తులు ఇక్కడే సేదతీరేవారు. బూర్గంపాడు నుంచి కాలిదారిన, ఎడ్లబండ్లపై గోదావరి నీటివరకు వెళ్లి, అక్కడ్నుంచి పడవలలో భద్రాచలం చేరేవారు. నిజాం నవాబుల కాలంలో కంచర్ల గోపన్న(రామదాసు) పాల్వంచ పరగణాకు తహశీల్దార్‌గా ఉండి ఈ ప్రాంత ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తులతోనే రామాలయం నిర్మించారని స్థానికులు అంటున్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచి బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి నిర్మాణ అనంతరం బూర్గంపాడు మీదుగా సారపాక నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గం వేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా బూర్గంపాడుకు జిల్లాలో విశిష్టస్థానం ఉంది. నిజాం నవాబుల నాటి భవనాలు నేటికీ ఇక్కడ ఉన్నాయి. తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, పోస్ట్ఆఫీస్లు వీటిలోనే కొనసాగుతున్నాయి. ఇంకా విశేషమేమంటే ఆకాలంలో ఇక్కడ చెలామణిలో ఉన్న నాణేలు ఆంధ్రలో చెల్లుబాటయ్యేవి కావు. పూర్వం నుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమాలలో ఇక్కడి నాయకులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ పాలన వ్యవహారం ఉర్దూలోనే కొనసాగింది. బూర్గంపాడుకు సంబంధించిన అన్నివిభాగాల పాత రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. ఎంతో తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడటం దారుణమని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలలో లేని బూర్గంపాడును ఇప్పుడు ఏ ప్రాతిపదికన సీమాంధ్రలో కలిపారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బంద్‌కు పిలుపు: బూర్గంపాడును సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ గురువారం అన్నిరాజకీయపార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిని తెలంగాణలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలను ఉధృతం చేసేందుకు ఐక్యకార్యచరణను రూపొందిస్తున్నారు.