ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది?
సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు
తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్‌గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది.
సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు
ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ.
ఇదే నా చివరి వీడియో
ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment