తమిళ నటి, తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాలో నటించిన విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. మోసం చేయడమే కాకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను వేడుకుంది. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతూ.. 'నేను సీమన్‌పై గతంలోనూ ఫిర్యాదు చేశాను. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అంతకుముందున్న ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదు' అని పేర్కొంది.
సహజీవనం.. ముఖం చాటేసిన సీమన్
కాగా విజయలక్ష్మి.. సీమన్‌పై గతంలోనూ ఈ ఆరోపణలు చేసింది. 2007-2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేశాడంది. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ సీమన్ సెటిల్‌మెంట్‌కు రావడంతో కేసు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆత్మహత్యాయత్నం
అయితే విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో 2020లో విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో సీమన్, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియో పోస్ట్ చేసి మరీ సూసైడ్‌కు యత్నించింది. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడింది.
చదవండి: ఆమె మోజులో హీరో.. అతడినే గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. అప్పుడు డిప్రెషన్‌లో.. ఇప్పుడు నడవలేని స్థితిలో..
వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే..
Comments
Please login to add a commentAdd a comment