సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళనాడు కోసం ప్రత్యేక జెండా ఎగుర వేయడంతో ఆయపై కేసు నమోదు చేశారు. సీమాన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయనపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ప్రత్యేక తమిళనాడు నినాదంతో జెండాను సిద్ధం చేయించారు.
సోమవారం సేలంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు కోసం ప్రత్యేక జెండా అని ప్రకటించడంతో పాటు ఎగుర వేశారు. ఈ చర్యను అధికారులు తీవ్రంగా పరిగణించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమాన్‌పై మంగళవారం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమానికి హాజరైన నలుగురు మహిళలు సహా 300 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారు.
చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్)
Comments
Please login to add a commentAdd a comment