
తమిళ దర్శకనటుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌కు చిక్కులు తప్పడం లేదు. గతంలో నటి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఆయన్ను అరెస్టు చేయడానికి కసరత్తులు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. నామ్ తమిళర్ కట్చికన్వీనర్ సీమాన్ దూకుడు, వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలకాలంగా ఆయన ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను టార్గెట్ చేసి చేస్తున్న వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీని వీడి బయటకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతూవస్తున్నది. తానెవ్వరికి భయపడను,తగ్గేది లేదంటూ ముందుకు సాగే సీమాన్‌కు గతాన్ని గుర్తుచేసేదిశగా పోలీసులు వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు.

గతంలోసీమాన్‌పై అనేక కేసులు, కారాగారవాస జీవితాలు ఉన్నాయి. దీనిని ప్రస్తుతం పునావృతం చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు నిదర్శనం 2011లో సీమాన్ తనను లైంగిక దాడి చేసినట్టు, ఏడు సార్లకు పైగా అబార్షన్లు చేసినట్టు నటి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు ప్రస్తుతం అస్త్రంగా చేసుకున్నారు. గతంలో విజయలక్ష్మి ఫిర్యాదు ఇవ్వగానే అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కొన్ని నెలల్లోనే ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే, పోలీసులు కేసు మాత్రం నమోదు చేసి ఉంచారు. దీనిని రద్దు చేయాలని కోరుతూ సీమాన్ కోర్టు మెట్లు ఎక్కగా, తాజాగా అదే ఆయన పాలిట శాపంగా మారింది. విజయలక్ష్మి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సీమాన్ పొందారని, మానసిక ఒత్తిడి, బెదిరింపుల కారణంగా ఆమె ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
దీంతో నటి ఫిర్యాదులో పేర్కొన్న లైంగిక దాడి అంశాన్ని కోర్టు పరిగణించింది. సీమాన్‌పై లైంగిక ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఇందులో నటి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. 2023 వరకు ఇద్దరి మధ్య ఏదో ఒకరకంగా సంబంధం ఉందని, కావున ఆయనపై లైంగిక వేధింపుల కేసు రద్దు చేయడం కుదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సీమాన్ పిటషన్‌ను తోసి పుచ్చిన కోర్టు ఈ వ్యవహారంలో 12 వారాలలో విచారణ ముగించే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
దీనిని అస్త్రంగా చేసుకున్న పోలీసులు ఈ కేసులో సీమాన్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. ముందుగా బెంగళూరులో ఉన్న నటి విజయలక్ష్మి వద్ద వాంగ్ములంను సేకరించి ఉండటం విశేషం. సీమాన్‌ను విచారణ పేరిట పిలిపించి కటకటాలలలోకి నెట్టే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కోర్టు సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సీమాన్‌కు సమన్లు జారీ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. విచారణకు రాగానే అరస్టు చేసి కటకటాలోకి నెట్టడమే కాకుండా, ఈ వ్యవహారంలో చార్జ్ సీట్‌ను సైతంకోర్టుకు సమర్పించే దిశగాపోలీసులు వ్యూహాలకు పదును పెట్టి ఉండడం గమనార్హం.
హనుమాన్ జంక్షన్‌లో నటించిన విజయలక్ష్మి
1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment