కోలీవుడ్ నటుడు, డీఎండీ వ్యవస్థాపకుడు విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కొద్దిమంది సమక్షంలో విజయకాంత్ అంత్యక్రియలు జరిగాయి.కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో విజయకాంత్ క్రియాశీలక రాజకీయాలకు విరామం ఇచ్చారు. ఇంతలో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాడు. పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు వాలంటీర్లను కలవడం మాత్రమే అలవాటు చేసుకున్నారు. వీటన్నింటికీ మించి కొన్ని వారాల క్రితం మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన పదేపదే ఆసుపత్రిలో చేరడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
కుమారుడి పెళ్లికి బ్రేక్
విజయకాంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయప్రభాకరన్, షణ్ముఘపాండియన్... చిన్న కుమారుడు షణ్ముఘ పాండియన్ తన తండ్రి అడుగుజాడల్లో తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారాడు. పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. అతను తన తండ్రి విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) యొక్క వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాడు. డిసెంబర్ 2019లో, విజయప్రభాకరన్ కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనాతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అనారోగ్య కారణాలతో నిశ్చితార్థ వేడుకకు విజయకాంత్ రాలేకపోయారు.
నిశ్చితార్థం జరిగి నాలుగేళ్లు కానీ..
అయితే ఈ జంట నిశ్చితార్థం జరిగి ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి విషయంలో పలు ఊహాగానాలు సినీ పరిశ్రమతో పాటు విజయకాంత్ అభిమానుల్లో జోరందుకున్నాయి. కానీ విజయకాంత్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం, వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి వల్ల వారి వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఆశించారట కానీ ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ఆ పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారు మోదీ.
దీంతో 2022లో కూడా ఆ పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మోదీ నుంచి ప్రకటన వచ్చినా.. విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షణించడం వైద్యం కోసం అమెరికా వెళ్లడం వంటి కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఎక్కువగా కోరుకున్నారట. రేపొద్దన్న ఆ పెళ్లికి మోదీ రావచ్చు... కానీ ఆ వేడుకలను చూసేందుకు విజయకాంత్ గారు లేరు. కుమారుడి పెళ్లి చూడకుండానే విజయకాంత్ వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment