Captain Vijayakanth
-
నాలుగేళ్లుగా విజయకాంత్ కుమారుడి పెళ్లికి బ్రేకులు.. ప్రధాని మోదీ కోసమేనా?
కోలీవుడ్ నటుడు, డీఎండీ వ్యవస్థాపకుడు విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కొద్దిమంది సమక్షంలో విజయకాంత్ అంత్యక్రియలు జరిగాయి.కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో విజయకాంత్ క్రియాశీలక రాజకీయాలకు విరామం ఇచ్చారు. ఇంతలో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాడు. పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు వాలంటీర్లను కలవడం మాత్రమే అలవాటు చేసుకున్నారు. వీటన్నింటికీ మించి కొన్ని వారాల క్రితం మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన పదేపదే ఆసుపత్రిలో చేరడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కుమారుడి పెళ్లికి బ్రేక్ విజయకాంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయప్రభాకరన్, షణ్ముఘపాండియన్... చిన్న కుమారుడు షణ్ముఘ పాండియన్ తన తండ్రి అడుగుజాడల్లో తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారాడు. పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. అతను తన తండ్రి విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) యొక్క వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాడు. డిసెంబర్ 2019లో, విజయప్రభాకరన్ కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనాతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అనారోగ్య కారణాలతో నిశ్చితార్థ వేడుకకు విజయకాంత్ రాలేకపోయారు. నిశ్చితార్థం జరిగి నాలుగేళ్లు కానీ.. అయితే ఈ జంట నిశ్చితార్థం జరిగి ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి విషయంలో పలు ఊహాగానాలు సినీ పరిశ్రమతో పాటు విజయకాంత్ అభిమానుల్లో జోరందుకున్నాయి. కానీ విజయకాంత్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం, వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి వల్ల వారి వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఆశించారట కానీ ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ఆ పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారు మోదీ. దీంతో 2022లో కూడా ఆ పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మోదీ నుంచి ప్రకటన వచ్చినా.. విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షణించడం వైద్యం కోసం అమెరికా వెళ్లడం వంటి కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఎక్కువగా కోరుకున్నారట. రేపొద్దన్న ఆ పెళ్లికి మోదీ రావచ్చు... కానీ ఆ వేడుకలను చూసేందుకు విజయకాంత్ గారు లేరు. కుమారుడి పెళ్లి చూడకుండానే విజయకాంత్ వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది. -
ఒక్క సీటుతో కింగ్‌మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
Captain Vijayakanth: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు
ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(70) మరణంతో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌కాంత్.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. (చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) ఆయన తండ్రి ఒక రైస్ మిల్లు యజమాని. కొడుకుని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగస్థుడిగా చూడాలని ఆయన కోరిక. కానీ విజయకాంత్‌కు మాత్రం చిన్నపుడు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. తరచూ స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్తుండేవాడు. ఎంజీఆర్ సినిమాలను ఎక్కువగా చూసి ఆయనలా తాను కూడా పెద్ద హీరో కావాలనుకున్నాడట. (చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!) అందుకే మధురై నుంచి చెన్నైకి తన మకాంని మార్చాడు. సినిమా అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే తన శరీరం నల్లగా ఉండడంతో.. దర్శకనిర్మాతలు తనను రిజెక్ట్ చేసేవారట. ఈ విషయాన్ని విజయకాంతే పలు సందర్భాల్లో చెప్పాడు. ‘నా శరీర రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వెనుకడుకు వేయకుండా నిలబడ్డా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేడు ఈ స్థాయికి చేరాను’అని ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ అన్నారు. విజయ్‌రాజ్ నుంచి విజయకాంత్‌గా విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. ఇండస్ట్రీ ఎంట్రీతోనే తన పేరును మార్చుకున్నాడు. అయితే ఈ పేరు మార్పు తన మొదటి సినిమా డైరెక్టర్దేనట. విజయ్ తొలి సినిమా ‘ఇనిక్కమ్ ఇళమై’(1979). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఏంఏ కాజాకు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి అనే పేరు నచ్చలేదట. ఆ సమయంలో రజనీకంత్ హవా బాగా నడుస్తుండడంతో ఆయన పేరులోని నుంచి కాంత్ అనే పదాన్ని తీసి విజయ్ రాజ్‌కు యాడ్ చేశాడట. అలా విజయ్‌రాజ్ పేరును విజయకాంత్‌గా మార్చాడు. ఒకే ఏడాది 18 సినిమాలు.. 27 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్.. కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తొలిసినిమా ఇనిక్కుమ్ ఇలమై (1979). అందులో ఆయన విలన్ పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, సత్తం ఓరు ఇరుత్తర్లై’ చిత్రాలతో సక్సెస్ బాట పడ్డాడు. 2015 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించాడు. మూడు షిఫ్ట్‌ల్లో పని చేస్తూ ఏడాదికి ఐదారు సినిమాలను రిలీజ్ చేసేశాడు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలై రికార్డును సృష్టించాయి. ఎస్. ఏ. చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. -
Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ ఫ్యామిలీని చూశారా? (ఫోటోలు)
-
డీఎండీకేలో జోష్ నింపిన కెప్టెన్
సాక్షి, చైన్నె: సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ శుక్రవారం 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత ఆయన జనంలోకి వచ్చారు. ఆయన్ను చూడగానే డీఎండీకే నాయకులు సంతోషంతో మునిగిపోయారు. విజయకాంత్ సినీ, రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్ తన భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్‌ను చూడలేకపోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఆయన జన్మదిన వేడుక అవకాశం కల్పించింది. తన బర్త్‌డే సందర్భంగా ఇంటి నుంచి విజయకాంత్ బయటకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో కేడర్ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆనందోత్సాహం కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో విజయకాంత్ వచ్చారు. వీల్ చైర్ మీద నుంచే ఆయన కేడర్ ముందుకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున డీఎండీకే శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. విజయకాంత్‌ను చూడగానే కరుప్పు ఎంజీఆర్ అన్న నినాదాలు మార్మోగాయి. ఆయనతో ఫొటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎగబడ్డారు. డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌తో పాటుగా ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. విజయకాంత్ తనయుడు విజయ్ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ వచ్చిన వారందర్నీ ఆహ్వానించారు. విజయకాంత్‌తో అందరూ ఫొటోలు దిగేందుకు వీలు కల్పించారు. అలాగే, తన బర్త్‌డే కేక్ కట్ చేసిన విజయకాంత్ తన వారసుడు షణ్ముగ పాండియన్ నటించనున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. విజయకాంత్‌కు సీఎం స్టాలిన్, విశ్వనటుడు కమల్‌తో పాటు పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
సంగీత ప్రపంచంలోకి కెప్టెన్ విజయ్‌కాంత్ వారసుడు!
తమిళ సినీ రంగంలో ప్రముఖ నటుడిగా, రాజకీయ నేతగా రాణించిన డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్. ఈయన్ని సినీ పరిశ్రమకు చెందినవారు కెప్టెన్ అని పిలుస్తుంటారు. విజయకాంత్ పెద్ద కొడుకు విజయ ప్రభాకరన్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాంటిది తాజాగా ఆయన సంగీత రంగంలో హద్దులను మార్చడానికి వీజేపీ, ప్రాక్టికల్ కాన్సర్ట్స్ సంస్థలతో భాగస్వామి అయ్యారు. వీరంతా నవంబర్ 25వ తేదీన ముంబైలో భారీ సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ఇందులో ప్రఖ్యాత సంగీత కళాకారుడు 50 సెంట్ (కర్టిస్ జేమ్స్ జాక్సన్) పాల్గొననున్నారు. అంతర్జాతీయ అవార్డులు అయిన గ్రామీ, ఎమ్మీ అవార్డులను గెలుచుకున్న ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అనేక సంగీత కచేరీలను నిర్వహించి ప్రాచుర్యం పొందిన 50 సెంట్ ఇండియా, ముంబైలో నవంబర్ 25వ తేదీన ది ఫైనల్ ల్యాప్ టూర్ –2023 పేరుతో జరగనున్న ర్యాప్ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. ఈమేరకు విజయ ప్రభాకరన్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ ఇతర కళారంగాల్లో కెప్టెన్‌గా పిలవబడే తన తండ్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ సంగీత కచేరి నిర్వహణ అని చెప్పారు. ఈ ప్రయత్నం కొత్తగానూ, కళారంగంలో సరికొత్త ఆరంభానికి నాందిగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: ప్చ్.. పిలవగానే వెళ్లాల్సింది.. సల్మాన్ పక్కన హీరోయిన్ అయ్యేదాన్ని -
హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు. என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன். — Rajinikanth (@rajinikanth) June 21, 2022 -
ఆసుపత్రి నుంచి కెప్టెన్ విజయకాంత్ డిశ్చార్జ్
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు. కాగా ఈనెల 19న విజయ్‌కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అప్పటినుంచి విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. చదవండి : Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత -
Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యం మరోసారి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను బుధవారం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. అడపదడపా చెన్నై రామాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన హెల్త్చెకప్ చేయించుకుంటున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో విపరీత జాప్యం చోటుచేసుకుంది. విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం కూడా అనుమానంగా మారింది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో చేరిన డీఎండీకే అభ్యర్థుల కోసం విజయకాంత్ తిరుచ్చిరాపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించినా ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. ‘అలవాటుగా జరుపుకునే హెల్త్చెకప్ కోసం విజయకాంత్‌ను ఆసుపత్రిలో చేర్చాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇంటికి చేరుతారు. వదంతులను నమ్మవద్ద’ని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
‘కమలం ఇక్కడ కాలు మోపడం కష్టమే’
► జనంలోకి కెప్టెన్ ►డీఎండీకే వర్గాల్లో ఆనందం ►కమలం పాదం మోపడం కష్టమేనని వ్యాఖ్య ►ఒక ఓటు.. ముగ్గురు సీఎంలు చెన్నై: రెండు నెలల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ జనంలోకి వచ్చారు. ఆయన రాకతో డీఎండీకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం విజయకాంత్ శివగంగైలో పర్యటించారు. తనదైన శైలిలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఓటుతో ముగ్గురు సీఎంలను పదవిలో కూర్చోబెట్టిన ఘనత తమిళ ప్రజలకే దక్కిందని ఛలోక్తులు విసిరారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కొంత కాలంగా తరచూ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో సైతం ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు వార్తలు వచ్చాయి. మార్చి నెల ఆయన ఆస్పత్రిలో చేరిన సమాచారం డీఎండీకే వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. పోరూర్ సమీపంలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారనే సమాచారంతో పార్టీ వర్గాలు పరుగులు తీశాయి. ప్రతి ఏడాది ఆయన వైద్య పరీక్షలు, చికిత్సల్లో బాగమేనని ఆ పార్టీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా కెప్టెన్‌ను సింగపూర్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం కార్యకర్తలను మరింత ఆందోళనలో పడేసింది. ఒక్కసారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం, మరీ వేంటనే ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాలనతో విజయ్‌కాంత్ కిడ్నీ మార్పు శస్త్రచికిత్స అనివార్యం అవుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. గత నెలలో డిశ్చార్జ్ అయి ఇంటికే పరిమితం కావడంతో తమ నాయకుడు జనంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూశారు. అదే సమయంలో రకరకాల ప్రచారాలు, పుకార్లు, షికారలు చేశాయి. అయితే విజయ్‌కాంత్ పేరు మీద తరచూ డీఎండీకే కార్యాలయం ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద తరచూ ప్రకటల్ని విడుదల చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులో శనివారం కెప్టెన్ ప్రజలోలకి రావడం డీఎండీకే వర్గాలకు ఆనందమేనని చెప్పాలి. జనంలోకి విజయకాంత్- ఆరోగ్యవంతుడిగా తాను ఉన్నానని చాటుకునే విధంగా శనివారం విజయకాంత్ హఠాత్తుగా శివగంగైలో పర్యటించారు. సతీమణి ప్రేమలతతో కలిసి కేడర్ ముందుకు వచ్చారు. తనదైన శైలిలో స్పందిస్తూ పర్యటనలో ముందుకు సాగారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు తనదైన హావాభావాలు, డైలాగులతో స్పందించారు. అన్నాడీఎంకే ముక్కలు కావడం, ఆ పార్టీ గొడవల గురించి తనకు తెలియదంటూ సమాధానాలు దాట వేశారు. అయితే తమిళనాడు ప్రజలు ఎంతో ఘనతను సాధించారని చమత్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఓటు వేసి ముగ్గురు సీఎంలను ఆ పదవిలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించడం, పన్నీరు సీఎంగా దించడం, ఇప్పుడు పళని ఉన్నారని, తదుపరి ఎవరో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ముందుకు సాగుతున్నాయా..? వారి మధ్య ఒప్పందాలు కుదిరాయా..? అన్న విషయాలు తనకు తెలియనే తెలియదంటూ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. తానొస్తున్నానన్న విషయం తెలుసుకుని, ఇక్కడ రాజకీయంగా అనేక ఎత్తుగడలు వేసి ఉన్నారని ధ్వజమెత్తారు. అనేక పథకాలను తుంగలో తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు రచించినా, తమిళనాడులో పాదం మోపడం మాత్రం కష్టమేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తు ఎవరితో అన్నది ఇక అప్పుడే అంటూ ముందుకు సాగారు. -
ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్‌బై
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి డీఎండీకే నేత విజయ్ కాంత్ గుడ్‌బై చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన సోమవారమిక్కడ ప్రకటించారు. కాగా గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' చివరకు కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయ్ కాంత్ తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయిన విషయం తెలిసిందే. -
ఓటు వేయకుంటే చంపేస్తాడు: కెప్టెన్
కేకేనగర్: ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ విచిత్ర ప్రచారానికి దిగారు. దేవుడి పేరు చెప్పి ఓటర్ల ను భయపెడుతున్న కెప్టెన్ తీరుకు ప్రజలు, రాజకీయ పార్టీల వారు విస్తుపోతున్నారు. ఓటర్లను బుజ్జగించడం, లేకపోతే భయపెట్టి ఎలాగైనా ఓట్లు సాధించడమే ధ్యేయం గా కెప్టెన్ ప్రచారం సాగిస్తున్నారు. విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో విజయకాంత్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరునావలూర్ నియోజకవర్గంలో రాత్రి వరకు భారీగా ప్రచారం చేశారు. మడపట్టు గ్రామంలో విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మడపట్టు ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇక్కడ నగదు బట్వా డా జరుగుతోందా? అని కెప్టెన్ ప్రశ్నించారు. తాను పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయనని ప్రమా ణం చేసినట్లు తెలిపారు. ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయమని ప్రమాణం చేయగలరా’? అని విజయకాంత్ ప్రశ్నించారు. -
కెప్టెనే సీఎం
► మంత్రిగా తిరుమావళవన్ ► ‘రమణ’ బాణిలో అవినీతి అంతం ► ఆ ఇద్దరికీ విశ్రాంతి ఇద్దాం ► ఓటర్లకు ప్రేమలత పిలుపు సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన సతీమణి, పార్టీ మహిళా విభాగం నేత ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపడతారని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రమణ’(ఠాగూర్) సినీ బాణిలో రాష్ట్రంలో అవినీతి అంతం సాగుతుందని స్పష్టం చేశారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న వారిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత కూడా ఉన్నారు.ఆ కూటమిలోని నేతలు బహిరంగ సభలు, అప్పుడుప్పుడు రోడ్‌షోలతో ప్రజల్లోకి వస్తుంటే, ప్రేమలత మాత్రం నిర్విరామంగా రోడ్‌షోలతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లు అత్యధికంగా ఉండే రోడ్లు, చిన్న చిన్న వీధుల్లోనూ మైక్ అందుకుని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. నివ్వెరపోయి వినేంతగా ఆమె వాగ్ధాటి సాగుతూ ఉన్నది. డీఎంకే, అన్నాడీఎంకేలను కడిగి పారేస్తున్నారు. తాజాగా ఆమె పర్యటన సేలం, ఈరోడ్, నామక్కల్‌లలో సాగుతున్నది. ఈ రోడ్ షోలో భాగంగా మంగళవారం ఆమె ఓటర్లను ఉద్దేశించి పలు చోట్ల ప్రసంగిస్తూ, తన భర్త, పార్టీ అధినేత విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచుతూ, తదుపరి సీఎం ఆయనే అని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఓటర్లకు సూచించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి ఏమో సెల్‌ఫోన్ ఇస్తున్నానంటూ ప్రకటించారని, అయితే, ఇక్కడ ఎవరి చేతిలో చూసినా సెల్ఫోన్లే అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆమె ఇచ్చే సెల్ఫోన్లు అవసరమా...అవసరమా..? అంటూ ప్రశ్నిస్తూ, వద్దు..వద్దు అని ఓటర్ల చేత సమాధానం రాబట్టారు. రేషన్ షాపుల వద్ద మహిళలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో గంటల తరబడి నిలబడి ఉండడాన్ని చూసి ఆవేదన చెందిన కెప్టెన్ ఇంటి వద్దకే నిత్యవసర వస్తువులు అన్న అంశాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. ఇక, టాస్మాక్‌ల వద్ద మగరాయుళ్ల బారులు తీరి ఉండడాన్ని దృష్టిలో ఉంచుకునే సంపూర్ణ మద్యనిషేధం నినాదాన్ని అందుకున్నట్టు పేర్కొన్నారు. కెప్టెన్ అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకంగా మద్య నిషేధంకు అనుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వయస్సుపై బడ్డ వాళ్లు ఇక, సీఎం కూర్చీల్లో కూర్చునేందుకు అనర్హులుగా పేర్కొంటూ, జయలలిత, కరుణానిధిలకు ఇక శాశ్వత విశ్రాంతిని ఇద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. కెప్టె సీఎం కావడం తథ్యం అని, తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖను చేపడతారంటూ, కెప్టెన్ బ్లాక్ బస్టర్ రమణ సినీమా బాణిలో రాష్ర్టంలో అవినీతి అంతం సాగబోతోందన్నారు. -
రజనీకాంత్ వర్సెస్ విజయ్‌కాంత్!
వేడెక్కిన తమిళ రాజకీయాలు సినీ స్టార్ల చుట్టూ చక్కర్లు తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించి కెప్టెన్ విజయ్‌కాంత్ చేసిన వ్యాఖ్యలు.. రజనీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 'కెప్టెన్' తీరుపై 'తలైవా' ఫ్యాన్స్ త్రీవస్థాయిలో మండిపడుతున్నారు. డీఎండీకే అధినేత అయిన విజయ్‌కాంత్ గత శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రజనీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రత్యర్థి పార్టీలు బెదిరించినంతమాత్రాన రజనీకాంత్‌లాగా తాను రాజకీయాల నుంచి పారిపోబోనని పేర్కొన్నారు. రజనీ తమిళ మూలాలపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 'మీరు ఆయనను తమిళియన్ అంటారు. కానీ ఆయన సినిమాలను ఎవరు సెన్సార్ చేస్తారో తెలుసా?' అని విజయ్‌కాంత్ పేర్కొన్నారు. తమిళనాడు మదురైలోని తెలుగు కుటుంబంలో విజయ్‌కాంత్ జన్మించగా, బెంగళూరులో ఓ మరాఠి కుటుంబంలో రజనీ జన్మించారు. రజనీపై విజయ్‌కాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆదివారం చెన్నైలో విజయ్‌కాంత్ దిష్టిబొమ్మను రజనీ ఫ్యాన్స్ తగలబెట్టి నిరసన తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో అన్న నిర్ణయాన్ని రజనీ అభిమానులకే వదిలేశాడు. ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఆయన చెప్పలేదు. అయినప్పటికీ విజయ్‌కాంత్ ఆయనను రాజకీయ వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారని రజనీ అభిమాన సంఘం చెన్నై అధ్యక్షుడు ఎన్ రాందాస్ పేర్కొన్నారు. -
కెప్టెన్‌కు ఎసరు!
►నేడు తిరుగుబాటుదారుల సమావేశం ► డీఎండీకే అత్యవసర సమావేశం ► పోటాపోటీగా బలనిరూపణ ► డీఎండీకేలో ముదురుతున్న ముసలం చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకేలో ఇటీవల పుట్టిన ముసలం రోజురోజుకూ ముదురుతోంది. ఏకంగా పార్టీ అధ్యక్షులు విజయకాంత్ పదవికే ఎసరు పెట్టేందుకు తిరుగుబాటు అభ్యర్థులు, తన పరువును, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కెప్టెన్ వేర్వేరుగా ఆదివారం సమావేశం అవుతున్నారు. పొత్తులతో బలపడాల్సిన డీఎండీకే అనూహ్యరీతిలో బలహీనపడిపోయింది. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడం ఆ పార్టీలో చిచ్చురేపింది. అంతే ఎన్నికల వేళ ఏకతాటిపై నిలవాల్సిన నేతలు చిన్నాభిన్నమైనారు. అన్నాడీఎంకే ప్రభుత్వంతో విభేదించి ఎక్కువ నష్టపోయినదని తమ పార్టీనేనని, ఇటువంటి దుస్థితిలో డీఎంకేతో పొత్తుపెట్టుకోకుండా ప్రజా సంక్షేమ కూటమిలో చేరిపోవడాన్ని తాము సహించలేమంటూ నలుగురు ఎమ్మెల్యేలు, కొందరు ప్రధాన నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పొత్తు నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా విజయకాంత్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వీరి సూచనను విజయకాంత్ వినిపించుకోలేదు. పార్టీపై విజయకాంత్ పెత్తనానికి ఏనాడో కాలం చెల్లింది, ఆయన సతీమణి ప్రేమలత నేడు అంతాతానై నడిపించడం సహించలేమని అసంతృప్తివాదులు మీడియాకు ఎక్కారు. ఈ పరిణామంతో ఉగ్రుడైన విజయకాంత్ వారందరినీ సస్పెండ్ చేశారు. అయితే తిరుగుబాటు దార్లు సైతం సస్పెన్షన్ కోసమే ఎదురుచూసినట్లుగా వ్యవహరించి కెప్టెన్ తీరుపై మరింత రెచ్చిపోయారు. అయితే వీరిలో కొందరు తాము విజయకాంత్ తీరును విభేదించినా పార్టీలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. అంటే మరో వర్గంగా మారేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. డీఎండీకేలో కుమ్ములాటలు మిన్నంటిన నేపధ్యంలో అస్మతీయులు, తస్మదీయులు ఆదివారం వేర్వేరుగా బలనిరూపణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు చెన్నైలో తిరుగుబాటుదారుల సమావేశం డీఎండీకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్ ఆదివారం భారీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చెన్నై టీన గర్ లోని త్యాగరాజ కల్యాణమండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి అసంతృప్తివాదులు హాజరవుతున్నట్లు సమాచారం. విజయకాంత్ నిర్ణయాలను పార్టీలోని 90శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తిరుగుబాటుదారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో విజయకాంత్ పనితీరు కార్యకర్తల మనోభావాలకు విరుద్దంగా సాగుతోందని విమర్శిస్తున్నారు. డీఎండీకేలో విజయకాంత్ కంటే తనకే ఆదరణ ఎక్కువ ఉందని, ఎక్కువశాతం కార్యకర్తలు తన మాటకే కట్టుబడి ఉన్నారనే వాదనతో చంద్రకుమార్ బలనిరూపణకు సిద్దం అవుతున్నారు. అంతేగాక ఆదివారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తామని తిరుగుబాటుదారులు తెలిపారు. చంద్రకుమార్ వాదనకు ఆదివారం నాటి సమావేశంలో బలం చేకూరిన పక్షంలో ప్రజాస్వామ్యతీరులో డీఎండీకే అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు చంద్రకుమార్ ప్రయత్నించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే కెప్టెన్ అధ్యక్ష పదవికే ముప్పువాటిల్ల వచ్చు. నేడు కెప్టెన్ సర్వసభ్య సమావేశం ఇదిలా ఉండగా, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ సైతం ఆదివారం ఉదయం కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. సర్వసభ్య సమావేశం, కార్యవర్గ సమావేశాన్ని వరుసగా నిర్వహించడం ద్వారా తనవారెవరు, చంద్రకుమార్ వైపు ఎవరో తేల్చుకోనున్నారు. ఆదివారం ఉదయం చెన్నై నగరంలో ఒకేసారి ఒకవైపు విజయకాంత్, మరోవైపు తిరుగుబాటుదారుల సమావేశం ఏర్పాటు కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.