తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది.
చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు.
என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன்.
— Rajinikanth (@rajinikanth) June 21, 2022
Comments
Please login to add a commentAdd a comment