
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ వచ్చేసింది. చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు.. రజినీకి ఏమైందనే విషయాన్ని బయటపెట్టారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని చెప్పారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అయిపోతారని క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)
ఏం జరిగింది?
తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రజినీకాంత్‌ని సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం కాత్ ల్యాబ్‌లో ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్ జరిగింది. భయపడాల్సింది ఏం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి ఏంటనేది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సినిమా రిలీజ్
రజినీకాంత్ లీడ్ రోల్ చేసిన 'వేట్టయాన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబరు 10న థియేటర్లలోకి రానుంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. మరోవైపు 'కూలీ' సినిమా చేస్తున్నారు. దీని షెడ్యూల్ ముగించుకుని రీసెంట్‌గా చెన్నై వచ్చారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

Comments
Please login to add a commentAdd a comment