చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు.
కాగా ఈనెల 19న విజయ్‌కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అప్పటినుంచి విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు.
చదవండి : Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment