తమిళ సినీ రంగంలో ప్రముఖ నటుడిగా, రాజకీయ నేతగా రాణించిన డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్. ఈయన్ని సినీ పరిశ్రమకు చెందినవారు కెప్టెన్ అని పిలుస్తుంటారు. విజయకాంత్ పెద్ద కొడుకు విజయ ప్రభాకరన్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాంటిది తాజాగా ఆయన సంగీత రంగంలో హద్దులను మార్చడానికి వీజేపీ, ప్రాక్టికల్ కాన్సర్ట్స్ సంస్థలతో భాగస్వామి అయ్యారు. వీరంతా నవంబర్ 25వ తేదీన ముంబైలో భారీ సంగీత విభావరిని నిర్వహించనున్నారు.
ఇందులో ప్రఖ్యాత సంగీత కళాకారుడు 50 సెంట్ (కర్టిస్ జేమ్స్ జాక్సన్) పాల్గొననున్నారు. అంతర్జాతీయ అవార్డులు అయిన గ్రామీ, ఎమ్మీ అవార్డులను గెలుచుకున్న ఈయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అనేక సంగీత కచేరీలను నిర్వహించి ప్రాచుర్యం పొందిన 50 సెంట్ ఇండియా, ముంబైలో నవంబర్ 25వ తేదీన ది ఫైనల్ ల్యాప్ టూర్ –2023 పేరుతో జరగనున్న ర్యాప్ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు.
ఈమేరకు విజయ ప్రభాకరన్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ ఇతర కళారంగాల్లో కెప్టెన్‌గా పిలవబడే తన తండ్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ సంగీత కచేరి నిర్వహణ అని చెప్పారు. ఈ ప్రయత్నం కొత్తగానూ, కళారంగంలో సరికొత్త ఆరంభానికి నాందిగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చదవండి: ప్చ్.. పిలవగానే వెళ్లాల్సింది.. సల్మాన్ పక్కన హీరోయిన్ అయ్యేదాన్ని
Comments
Please login to add a commentAdd a comment