డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ పరిస్థితి మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. మరోసారి అస్వస్థకు గురి కావడంతో కాగా ఆయనకు వెంటి లేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా.. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. శనివారం విజయకాంత్ ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులలో తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస సమ స్య అధికంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
(ఇది చదవండి: క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు)
డీఎండీకే అధినేత విజయకాంత్ గత నెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.. ఓ దశలో ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ వచ్చాయి. ఆయన పరిస్థితి విషమించినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. దీంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. ఆ తర్వాత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విడుదల చేసిన వీడియోతో ఆందోళన సద్దుమణిగింది.
(ఇది చదవండి: మనలో ఎలాంటి జంతువులు ఉన్నాయో కనిపిస్తోంది: ఆర్జీవీ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment