డీఎండీకే అధినేత, కోలీవుడ్ నటుడు విజయకాంత్ కోలుకుంటున్నారని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆయన ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తర్వాత ఆయన కోలుకుంటున్నారని మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన నెలకొంది.
దీంతో ఆయన సతీమణి ప్రేమలత ఒక వీడియో ద్వారా విజయకాంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు రేకెత్తాయి. వాటిని ఖండించిన ప్రేమలత... విజయకాంత్‌తో ఉన్న పోటోలను విడుదల చేసింది. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి మనందరినీ చూస్తాడు. వదంతులను ఎవరూ నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు! అని దయతో మనవి చేస్తున్నానని తెలిపింది.
ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కృత్రిమ శ్వాసక్రియతో చికిత్సపొందుతున్నారని పలు యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం భాదగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికైన ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ప్రేమలత కోరింది.
கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார்.
— Vijayakant (@iVijayakant) December 2, 2023
வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார்.
யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன்.
- திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/u6tvBGtCdD
Comments
Please login to add a commentAdd a comment