hospitalisation
-
విజయకాంత్ ఫోటోను విడుదల చేసిన సతీమణి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ నటుడు విజయకాంత్ కోలుకుంటున్నారని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆయన ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తర్వాత ఆయన కోలుకుంటున్నారని మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన నెలకొంది. దీంతో ఆయన సతీమణి ప్రేమలత ఒక వీడియో ద్వారా విజయకాంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు రేకెత్తాయి. వాటిని ఖండించిన ప్రేమలత... విజయకాంత్‌తో ఉన్న పోటోలను విడుదల చేసింది. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి మనందరినీ చూస్తాడు. వదంతులను ఎవరూ నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు! అని దయతో మనవి చేస్తున్నానని తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కృత్రిమ శ్వాసక్రియతో చికిత్సపొందుతున్నారని పలు యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం భాదగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికైన ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ప్రేమలత కోరింది. கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார். வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார். யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன். - திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/u6tvBGtCdD — Vijayakant (@iVijayakant) December 2, 2023 -
Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు! 30 కోట్లు దాటిన కేసులు!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం నాటికి 300 మిలియన్ల (30 కోట్లు)కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు నివేదికలు తెల్పుతున్నాయి. మరోవైపు డజన్ల కొద్ది దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది. హాస్పిటల్లో పెరిగిన ఐదేళ్లలోపు పిల్లల చేరికలు వాక్సిన్‌కు అర్హత వయసులేని వారికి సంబంధించిన డేటాను అమెరికా శుక్రవారం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత కొద్దివారాలుగా కోవిడ్ మహమ్మారి బారినపడ్డ ఐదేళ్లలోపు పిల్లలు ఆసుపత్రుల్లో చేరడం పెరిగిందని తెల్పింది. అందోళనకరమైన ఈ తాజా పరిణామం దృష్ట్యా పిల్లలకు టీకాల అవసరం ఎంతైన ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. గత నెల (డిసెంబర్) మధ్యకాలం నుంచి దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల రేటు ప్రతి లక్ష పిల్లల్లో 2.5 నుంచి 4 కంటే ఎక్కువ నమోదవుతుంది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో ఈ రేటు లక్షమందికి గాను 1గా నమోదవుతుందని మొత్తం 14 రాష్ట్రాల్లో 250 ఆసుపత్రుల్లో సీడీసీ సేకరించిన సమాచారం ప్రకారం తయారు చేసిన డేటా తెల్పుతోంది. నాలుగో డోస్ అవసరం లేదు: యూకే మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి నాలుగో డోస్ వ్యాక్సిన్ తీసుకోవల్సిన అవసరం లేదని బ్రిటీష్ ఆరోగ్య అధికారులు (యూకే) శుక్రవారం తెలిపారు. మూడో డోస్ తీసుకున్న 3 నెల్ల తర్వాత 65 అంతకంటే ఎక్కవ వయసున్న వృద్ధులు ఆసుపత్రుల్లో చేరడం దాదాపు 90 శాతం తగ్గిందని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ తెల్పింది. కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు దాటాయి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 300 మిలియన్లను దాటింది. కాగా గత వారం రోజుల్లో డజన్ల కొద్దీ దేశాలలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికారిక ఏఎఫ్‌పీ గణాంకాల ప్రకారం గడచిన ఏడు రోజుల్లో మొత్తం 34 దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యూరప్‌కు చెందినవి 18 దేశాలుకాగా, ఆఫ్రికాలో ఏడు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్కవారంలోనే 13.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవ్వడాన్నిబట్టి కోవిడ్ ఉధృతి ఎంత వేగంగా ఉందో తెలుస్తోంది. మరణాల సగటు రేటు మాత్రం మూడు శాతం పడిపోయింది. యుఎస్, యుకె, కెనడా, ఇజ్రాయెల్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం 70 శాతం కంటే తక్కువగా ఉందని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ అథారిటీ శుక్రవారం తెలిపింది. ఐతే గతంలో వచ్చిన వేరియంట్లకంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, తక్కువ ప్రమాదకారి అని తెలియజేసింది. చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు -
మీకు ‘క్రిటికల్’ కవచం ఉందా?
ఉదయ్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు. దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.. కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్ పడొచ్చు. శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్ ఇల్నెస్) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ఆర్థిక భారం ఎంతో.. తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్రైటింట్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా తెలిపారు. కేన్సర్ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు. ‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ముఖ్య పంపిణీ అధికారి అనూప్శేత్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్–2, టైర్ 3 పట్టణాలతో పోలిస్తే టైర్–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రణాళిక ప్రకారం.. ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి. కానీ, ఇండెమ్నిటీ ప్లాన్లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్లనే ఇండెమ్నిటీ ప్లాన్లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా బేసిక్ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు లివర్ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్మాల్డే వివరించారు. టైర్–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్ ప్లాన్ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. బేసిక్ హెల్త్ ప్లాన్‌లో కవర్ కాని ఖర్చులను ఈ ప్లాన్ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్ ఇల్నెస్ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్ ఇల్నెస్లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్ఇల్నెస్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్ సమస్యల్లో అయితే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు రైడర్ రూపంలో వచ్చే క్రిటికల్ ఇన్లెస్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు. తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు కేన్సర్ ► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు ► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు ► రేడియోథెరపీ రూ.2–20లక్షలు గుండె జబ్బులు ► యాంజియోగ్రఫీ రూ.20,000 ► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు ► వాల్వ్ సర్జరీ రూ.2.5–6లక్షలు ► బైపాస్ సర్జరీ రూ.2–5లక్షలు మూత్రపిండాల వైఫల్యం ► డయాలసిస్ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు) ► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు ► బ్రెయిన్‌స్ట్రోక్ రూ.5–10 లక్షలు నోట్: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి. హెల్త్ ప్లాన్ ప్రీమియం ప్లాన్ కవరేజీ ప్రీమియం (రూ.లలో) (రూ.లలో) బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ 10 లక్షలు 8,265 క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ 30 లక్షలు 4,551 నోట్: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు -
ప్రిన్స్ ఫిలిప్ ఆఖరి చూపుకైనా వస్తారా..?
జీసస్! ప్రిన్స్ ఫిలిప్ (99) ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవన్ హాస్పిటల్ నుంచి అత్యవసరంగా లండన్ లోనే ఉన్న సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి తరలించారు. ‘తాత గారికి గుడ్ బై చెప్పడం కోసం స్టార్ట్ ఇమీడియట్లీ‘ అని యూఎస్‌లో ఉంటున్న ప్రిన్స్ హ్యారీకి కబురు వెళ్లింది. అయ్యో దేవుడా.. బ్రిటన్ రాచకుటుంబం కోసం పొంచి ఉన్న విపత్తు ఇదొక్కటే కాదు. ఈ నెల 7 న ప్రిన్స్ హ్యారీ (36), మేఘన్ (39) దంపతుల తొంభై నిముషాల ఓప్రా విన్ ఫ్రే ‘టెల్–ఆల్’ ఇంటర్వ్యూ అమెరికన్ టీవీ ఛానెల్ సి.బి.ఎస్.లో ప్రసారం కాబోతోంది! ఆ ప్రసారాన్ని రద్దు చేయించమని, కనీసం వాయిదా వేయించమని రాయల్ ఫ్యామిలీ హ్యారిస్ ను కోరుతోంది. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ అని ఏడాది క్రితం రాణిప్రాసాదం వీడి వెళ్లిన హ్యారీ.. తాతగారిని చూడ్డానికి భార్య సహా వస్తారా? ఓప్రా ఇంటర్వ్యూ ఆగిపోతుందా? అందులో ఈ దంపతులు ఏం చెప్పి ఉంటారు? తన భార్యను సరిగా ట్రీట్ చేయనందుకే హ్యారీ తనకా రాచరికం, రాజసౌధం వద్దనుకున్నారా? పెద్దాయన ప్రిన్స్ ఫిలిప్ పరిస్థితి ఏమీ బాగోలేదు! 99 ఏళ్ల వయసులో ఇంకేం బాగుంటుంది అనుకోడానికి మనసు రానంతగా బ్రిటన్ ప్రజలు వారసత్వంగా ఆ కుటుంబంతో బలమైన ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పచురచుకుని ఉన్నారు కనక ఆసుపత్రి నుంచి ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అంతర్లయగా మరొక ప్రార్థన కూడా కలిసి ఉంది! కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాజ ప్రాసాదాన్ని శాశ్వతంగా వీడి వదిలిపోయిన ప్రిన్స్ హ్యారీ.. దాదాపుగా మరణశయ్యపై ఉన్న తన తాతగారు ప్రిన్స్ ఫిలిప్‌ను ఆఖరి చూపైనా చూసేందుకు వచ్చేవిధంగా ఆయన మనసు మార్చాలని రాజసౌధంతోపాటు, దేశ ప్రజలూ దేవుణ్ని కోరుకుంటున్నారు. వస్తే ఆయన ఒక్కరే రారు. తన భార్య మేఘన్ మార్కెల్‌ను వెంటపెట్టుకుని రావలసిందే. ఆమె రాక కనుక క్వీన్ ఎలిజబెత్‌కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిస్తే కనుక ప్రిన్స్ హ్యారీ బ్రిటన్‌కు రాకపోవచ్చు. అయితే ఆయన భార్య పేరెత్తకుండా బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆంతరంగిక కార్యదర్శులు ‘వెంటనే వచ్చి తాతగారిని చూసి వెళ్లండి’ అని ప్రిన్స్ హ్యారీకి వర్తమానం పంపించారు. అది ఏమాత్రం అస్పష్టంగా లేని వర్తమానం! ‘లండన్ వచ్చి ప్రిన్స్ ఫిలిప్‌కి ‘గుడ్‌బై’ చెప్పవలసిందిగా సూచిస్తున్నాం’ అని వారు తెలియజేశారు. ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్ (94) భర్త. ఫిబ్రవరి 16న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆసుపత్రికి మార్చారు. ఆరోగ్యంలో కనీసస్థాయి మెరుగుదల కూడా కనిపించకపోవడంతో మార్చి 1న లండన్‌లోనే మరొకటైన సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయనలోని ఇన్ఫెక్షన్లకు చికిత్స జరుగుతోంది. అక్కడే ఆయన్ని వైద్య నిపుణుల పరిశీలనలో ఉంచారు. ఈలోపే ప్రిన్స్ హ్యారీ రమ్మని కబురు వెళ్లడంతో.. ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై అనుమానాలు బ్రిటన్‌ని కమ్మేశాయి. మొన్నటి వరకు ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన రాజకుటుంబం ఇప్పుడు.. తాతగారిని చూడ్డానికి ప్రిన్స్ హ్యారీ వస్తారా రారా అని ఆందోళ చెందుతోందని బ్రిటన్ టాబ్లాయిడ్లు అదే పనిగా ముఖచిత్ర కథనాలను రాస్తున్నాయి. ఆ టాబ్లాయిడ్లే తమను బ్రిటన్ నుంచి తరిమికొట్టాయిని అమెరికాకు మారిన కొత్తలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆరోపించినప్పటికీ.. రాణిగారి కుటుంబంలో తన సతీమణికి గౌరవ మర్యాదలు లభించడం లేదన్న ఆవేదనతోనే ప్రిన్స్ హ్యారీ తన వంశవృక్షంతో తెగతెంపులు చేసుకున్నారని ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరి నోటి ద్వారా ఏనాడో బహిర్గతం అయింది. క్వీన్ ఎలిజబెత్, మనవడు ప్రిన్స్ హ్యారీ ముఖాముఖి మాట్లాడుకుని కూడా నెలలు అవుతోంది. గతంలో క్రిస్మస్లకు కలుసుకున్న సందర్భంలోనూ ఒకరితో ఒకరు ముభావంగానే ఉండిపోయినట్లు పత్రికలు రాశాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ తన తాతగారిని చూసేందుకు బ్రిటన్‌కు వస్తారా రారా అనే ఆలోచన కంటే కూడా.. మార్చి 7న అమెరికన్ టీవీ ఛానెల్ సీబీఎస్ ప్రసారం చేయబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా చేయడం ఎలాగన్న దాని గురించే రాణిగారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై ఇప్పటికే రాణిగారి ప్రత్యేక ప్రతినిధి ఒకరు హ్యారీతో మాట్లాడి, ఇంటర్వ్యూను అసలే ప్రసారం కాకుండా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగిన కారణమే ఉంది. సీబీఎస్ ఛానల్ కోసం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్లను ఇంటర్వ్యూ చేసినవారు ఓప్రా విన్ ఫ్రే. ఆమె ఇంటర్వ్యూ చేయడం మామూలుగా ఉండదు. అంతరంగాల్లోకి వెళతారు. ఒకలాటి హృదయోద్వేగ స్థితిని కల్పించి లోపలిదంతా బయటికి లాగేస్తారు. అసలే ఇప్పుడు హ్యారీ, మార్కెల్ తమకు ఏ మాత్రం అలవాటు లేని ఒంటరి జీవితాన్ని కలిసికట్టుగా గడుపుతున్నారు. పైగా మార్కెల్ ఇప్పుడు గర్భిణి. రెండో బిడ్డ కోసం ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 14న వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ఈ స్థితిలో ఓప్రా ఇంటర్వ్యూలో రాజసౌధ అహంకార రహస్యాలు ఏవైనా బయట పెడితే కనుక ఆ వృద్ధ ప్రాణం.. ప్రిన్స్ ఫిలిప్.. ఆవేదన చెందే ప్రమాదం ఉందని క్వీన్ ఆందోళన పడుతున్నారు. అందుకోసమే ఇంటర్వ్యూను ఆపించమని విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఆ విజ్ఞప్తిని సీబీఎస్ టీవీ మన్నిస్తుందా, ఒకవేళ సీబీఎస్ మన్నించినా.. ప్రిన్స్ హ్యారీ.. గో ఎహెడ్ అంటారా అన్నది మరొక సందేహం. బ్రిటన్‌లో ప్రిన్స్ హ్యారీపై కోపగిస్తున్నవారూ ఉన్నారు. పరదేశీ పిల్లను (అమెరికా) చేసుకోవడమే కాకుండా, రాజకుటుంబ నియమాలను గౌరవించని భార్యను ఆయన వెనకేసుకొస్తున్నారని వారి విమర్శ. మరోవైపు బకింగ్‌హామ్ ప్యాలెస్, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ‘ది రాయల్ అబ్జర్వర్’ పత్రిక రాసింది. మంచిని ఆలోచిస్తున్న పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. తాతగారి ఆఖరిశ్వాసకు ముందరే వచ్చి ప్రిన్స్ హ్యారీ ఆయన్ని సంతోషపరుస్తారనీ, ఓప్రా విన్ఫ్రే కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే మనిషి కనుక తాత్కాలికంగానే అయినా ఇంటర్వ్యూను ఆపేస్తారని ఆ పత్రికలు ఆశిస్తున్నాయి. ఎవరైనా కోరుకునేది మంచే జరగాలని, ఆ కుటుంబానికి కాస్త ఎక్కువ మంచి జరగాలని. బకింగ్‌హామ్ ప్యాలెస్ నిర్మాణమై ఉన్నది లండన్‌లోనే అయినా, మూడు వందల ఏళ్లకు పైగా ఆ భవంతిలో ఉంటున్న రాజ కుటుంబాలు ఉంటూ వస్తున్నది మాత్రం బ్రిటన్ ప్రజల గుండెల్లోనే. ప్రిన్స్ ఫిలిప్ ఎవరీయన?! ప్రస్తుత బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ భర్తే ప్రిన్స్ ఫిలిప్ అన్న సంగతి తెలిసిందే. అదొక్కటే ఆయన గుర్తింపు కాదు. ఎడిన్‌బరో సామంత రాజు (డ్యూక్). యూకె అధీనంలో ఉన్న స్కాట్లాండ్ దేశపు రాజధానే ఎడిన్‌బరో. క్వీన్ ఎలిజబెత్‌తో ఆయనకు 1947లో వివాహం అయింది. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ యాన్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ వీరి సంతానం. ఈ నలుగురిలోకీ పెద్దవారైన ప్రిన్స్ చార్ల్స్ కొడుకే ప్రిన్స్ హ్యారీ. ప్రిన్స్ ఫిలిప్ గ్రీసు, డెన్మార్క్‌ల రాచకుటుంబీకుడు. క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ దేశస్థురాలు. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ రాయల్ నేవీలో చేరేనాటికే ఉమ్మడి బంధుత్వాల ద్వారా ఒకరికొకరు పరిచయం. క్వీన్‌కి 13 ఏళ్ల వయసులో ఆయనపై ప్రేమ అంకురించినట్లు, ఆ ప్రేమ.. వివాహానికి దారి తీసినట్లు ఈ దంపతులపై వచ్చిన అనేక డాక్యుమెంటరీ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత రాణి గారు కూడా ప్రిన్స్ ఫిలిప్పై తన ప్రేమ విషయాన్ని నిర్థారించారు. -
పబ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఆ కేసులు..
లండన్ : పబ్‌లు, క్లబ్‌లు, బార్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆల్కహాల్ సంబంధిత ఎమర్జెన్సీ కేర్, తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తాజా అథ్యయనం వెల్లడించింది. జర్నల్ అడిక్షన్లో ప్రచురితమైన అథ్యయనం ప్రకారం మద్యం విక్రయించే రెస్టారెంట్లు ఇతర అవుట్లెట్లు అధికంగా ఉండటానికి, ఆస్పత్రుల్లో అడ్మిషన్ కేసులకు సంబంధం ఉందని తేలింది. పన్నెండేళ్ల వ్యవధిలో దాదాపు పది లక్షల ఆస్పత్రి అడ్మిషన్ల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షెఫిల్డ్ ఈ వివరాలు వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పబ్‌లు, బార్లు, నైట్ క్లబ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవించడంతో వచ్చే కాలేయ వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఇతర ప్రాంతాలతో పోలిస్తే 22 శాతం అధికంగా ఉంది. మద్యం దుకాణాలను అనుమతించే అధికారులు ఈ అంశాలను తాము నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆల్కహాల్ రీసెర్చి యూకేకు చెందిన డాక్టర్ జేమ్స్ నికోలస్ సూచించారు. -
ఈ ఆస్పత్రి వీడనంటే వీడను!
మనం ఎవరిమైనా ఏ కారణంగానైనా ఆస్పత్రిలో చేరితే వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయేందుకు తాపత్రయ పడతాం. తహతహలాడుతాం. అందుకు త్వరగా కోలుకోవాలని కనిపించని దేవుళ్లందరిని పేరుపేరునా వేడుకుంటాం. ఈ ఆస్పత్రి వాతావరణం నుంచి బయటకు తీసుకెళ్లండి మహా ప్రభూ! అంటూ పరామర్శించేందుకు వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రాధేయపడతాం. కానీ చైనాకు చెందిన చెన్ (పూర్తి పేరు వెల్లడించలేదు) మాత్రం ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేసినా తాను మాత్రం ఆస్పత్రి వీడేది లేదంటూ మంకుపట్టు పట్టి దాదాపు మూడేళ్లపాటు ఆస్పత్రి మంచానికే అతుక్కుపోయాడు. ఆస్పత్రి వర్గాలు ఆతన్ని బలవంతంగా బయటికి పంపేంచేందుకు ప్రయత్నించగా తనను తాను మంచం రాడ్లకు ఇనుప గొలుసులతో తాళం వేసుకొని కూర్చున్నాడు. చివరకు చేసేది లేక ఆ ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకెళ్లి చెన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించేలా ఉత్తర్వులు తీసుకొచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు 2015, ఫిబ్రవరి 11వ తేదీన రంగప్రవేశం చేసి బలవంతంగా చెన్ను ఇంటికి చేర్చారు. ఆస్పత్రిని వీడేందుకు ఇష్టపడక భోరుభోరున ఏడుస్తూ వెళ్లిన చెన్ విచిత్ర కథనం ఇదీ.. 55 ఏళ్ల చెన్ బీజింగ్ జిల్లాలోని మెంటావ్గౌ గ్రామానికి చెందినవాడు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చెన్ 2011, ఆగస్టులో బీజింగ్ జింగ్మీ గ్రూప్ ఆస్పత్రిలో చేరాడు. నెల రోజుల తర్వాత గాయాలు పూర్తిగా తగ్గాయని తేల్చిన వైద్యులు అతన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. రెండు నెలల తర్వాత ఎడమ కాలులో నొప్పి వస్తోందంటూ మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతని ఎడమకాలి రక్తనాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించారు. వైద్యులు చికిత్సచేసి మూడు నెలల్లో ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. అయినా చెన్ మాత్రం తాను పూర్తిగా కోలుకోలేదంటూ ఆస్పత్రి వీడేందుకు ససేమిరా అన్నాడు. ఆ తర్వాత ఆస్పత్రి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో 2012 , జూలై నుంచి ఆతనికి వైద్య సేవలను కూడా నిలిపేశారు. అప్పటికీ ఆస్పత్రి వదిలేందుకు చెన్ ఒప్పుకోలేదు. చివరకు అదే సమయంలో జరిగిన కుమారుడి పెళ్లికి కూడా వెళ్లలేదు. ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో చెన్ ఏమైనా మానసిన వ్యాధితో బాధ పడుతున్నారా అన్న కోణంలో కూడా కోర్టు వైద్య పరీక్షలు జరిపించి ఏమీ లేదని తేల్చింది. ఇంతకు చెన్కు ఆస్పత్రంటే అమిత ప్రేమా, ఇల్లంటే భయమా?