లండన్ : పబ్‌లు, క్లబ్‌లు, బార్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆల్కహాల్ సంబంధిత ఎమర్జెన్సీ కేర్, తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తాజా అథ్యయనం వెల్లడించింది. జర్నల్ అడిక్షన్‌లో ప్రచురితమైన అథ్యయనం ప్రకారం మద్యం విక్రయించే రెస్టారెంట్లు ఇతర అవుట్‌లెట్లు అధికంగా ఉండటానికి, ఆస్పత్రుల్లో అడ్మిషన్ కేసులకు సంబంధం ఉందని తేలింది.
పన్నెండేళ్ల వ్యవధిలో దాదాపు పది లక్షల ఆస్పత్రి అడ్మిషన్ల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షెఫిల్డ్ ఈ వివరాలు వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పబ్‌లు, బార్లు, నైట్ క్లబ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవించడంతో వచ్చే కాలేయ వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఇతర ప్రాంతాలతో పోలిస్తే 22 శాతం అధికంగా ఉంది.
మద్యం దుకాణాలను అనుమతించే అధికారులు ఈ అంశాలను తాము నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆల్కహాల్ రీసెర్చి యూకేకు చెందిన డాక్టర్ జేమ్స్ నికోలస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment