
త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. వందకి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు.
తమిళ స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో విజయకాంత్ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.
కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు!
கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார்.
— Vijayakant (@iVijayakant) November 29, 2023
- திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG