
నటిగా నిలదొక్కుకోవాలంటే గ్లామర్ రూట్ ఎంచుకోక తప్పదని చాలా మంది కథానాయికలు భావిస్తున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లగా రాణిస్తున్న వారంతా గ్లామరస్‌గా నటించిన వారే అని చెప్పక తప్పదు. తాజాగా నటి చాందిని తమిళరసన్ కూడా గ్లామర్‌నే కోరుకుంటోంది. 2010లో శాంతనుకు జంటగా సిద్ధూ ప్లస్–2 చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది చాందిని. ఆ తరువాత విల్ అన్భు, నైయప్పుడై, కవన్, మన్నన్ వగైయారా, బిల్లా పాండీ, వంజకర్ ఉలగం వంటి చిత్రాల్లో నటించింది.
14 ఏళ్ల జర్నీ..
కథానాయికగా 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతూనే ఉంది. మంచి అవకాశాలు రాకపోవడంతో వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కథ వింటున్నప్పుడే అందులోని పాత్రలోకి మారిపోతానన్నారు. తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆశగా ఉందన్నారు.
అలాంటి ఛాన్సులు రావట్లే
రొమాన్స్‌తో కూడిన కామెడీ కథల్లో నటించాలన్నది ఆశ అని, అయితే అలాంటి అవకాశాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా గ్లామరస్ పాత్రలూ రావడం లేదని చెప్పింది. కుటుంబకథా చిత్రాల నటిగా కాకుండా, కాస్త గ్లామరస్‌తో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్‌లో నటిస్తున్నానని చాందినీ చెప్పింది.
చదవండి: కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని
Comments
Please login to add a commentAdd a comment