Chandini
-
కేవలం ఇంటి ఫుడ్‌తో 40 కిలోలు బరువు తగ్గి, అందాల రాశిగా!
స్లిమ్‌గా, అందంగా ఉండాలని అన్ని వయసుల వారు కోరుకుంటారు. అందుకు డైటింగ్ నుంచి జిమ్‌లో కసరత్తులు చేయడం వరకు రకరకాల పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా తల్లి అయిన స్త్రీలు ఎదుర్కొనే ఈ సమస్యను చాందినీ సాధించి చూపింది. 39 ఏళ్ల వయసులో ఏకంగా 40 కిలోల బరువు తగ్గి అందాల కిరీటమూ సొంతం చేసుకుంది. ఎవరీ చాందినీ.. ఏమా కథ అనేవారికి బరువు తగ్గించే ఉపాయాలను మూటగట్టి మరీ మనముందుంచుతోంది.అధిక బరువు తగ్గడం కంటే ఈ క్రమంలో చేసే ప్రయాణం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలను జయించేలా చేస్తుంది, ప్రసవానంతర ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇందుకోసం చేసిన కృషి పట్టుదలను, అంతులేని స్ఫూర్తిని కలిగిస్తుంది. అమెరికాలో ఉంటున్న చాందినీ సింగ్‌కు 39 ఏళ్లు. పిల్లల పాదరక్షల కంపెనీకి కో ఫౌండర్. అంతేకాదు భార్య, తల్లి అయిన చాందినీ ఇటీవలే మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యుఎస్ఎ– 2024 అందాల ΄ోటీని గెలుచుకుంది. 5 అడుగుల 8 అంగుళాల పొడవుండే చాందినీ 118 కిలోల బరువుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు ప్రసవానంతరమూ అలాగే ఉండిపోయింది. డబుల్ ఎక్సెల్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ దుస్తులు ధరించడం వరకు శరీరం పరిమాణం పెరిగింది. ఇంట్లో వండిన ఆహారం, రోజూ చేసే వాకింగ్ అందాల కిరీటం దక్కేలా చేశాయని చాందినీ చెప్పిన విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.భయాన్ని జయిస్తూ...‘‘విపరీతమైన బరువుతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఆరోగ్య భయాన్ని ఎదుర్కొన్నాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు వైద్యుల సలహా మేరకు బెడ్‌రెస్ట్‌లో ఉండక తప్పలేదు. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. ఫలితంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో పాటు ప్రీ–డయాబెటిక్ నిర్ధారణ అయ్యింది. దీంతో నియంత్రణ చర్యలు తీసుకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాను. ఈ వ్యాధి నిర్ధారణ నా ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేసింది.బరువుతో పాటు అందానికీ ప్రాధాన్యతబరువు తగ్గడమే కాదు, అందంగానూ కనిపించాలి. దీంతో నా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించడం మొదలపెట్టాను. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడింది. ఆరోగ్యంగా ఉండటం నా కుటుంబంపై కూడా మంచి ప్రభావం చూపింది. ముఖ్యంగా నా కూతురిని ఆరోగ్యంగా పెంచాలనుకున్నాను. అందుకు నన్ను నేను సెట్ చేసుకోవాలనుకున్నాను. నా కూతురిని జాగ్రత్తగా చూసుకుంటూ, నా ప్రాముఖ్యతను ఆమెకు చూపించాలని కోరుకున్నాను. నా ఆరోగ్యంలో ప్రతి చిన్న మెరుగుదల ఫిట్‌గా, చురుకుగా ఉండాలనే నా అభిరుచిని పెంచింది. పోషకాహారంపై విస్తృతమైన పరిశోధన చేశాక, నా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో స్థిరమైన, దీర్ఘకాలిక మార్పులు చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.ఫలితంపై కన్నా ప్రక్రియపైనే దృష్టి పొత్తికడుపు కొవ్వును తగ్గించడానికి వ్యాయామాన్ని దినచర్యగా చేసుకున్నాను. ఇందుకు తక్కువ–తీవ్రత, అధిక తీవ్రత గల వ్యాయామాల మిశ్రమాన్ని పాటించాను. వ్యాయామానికి వారంలో 3–4 సార్లు కేటాయించాను. కార్డియో కోసం వాకింగ్, జాగింగ్‌ని కలిపి వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. సెలవులు, గాయం, అనారోగ్యం కారణాలతో ఒక వారం, రెండు వారాల పాటు వర్కవుట్లకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కానీ అది నా కృషిపై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. వీలైనంత త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాను. ఫలితాల కంటే ప్రక్రియపై ఎక్కువ దృష్టి పెట్టాను, ఇది నాకు స్ఫూర్తిగా మారింది. స్థిరంగా ఉండటానికి సహాయపడింది. మొదటి రెండు నెలలు బరువు తగ్గక పోయినప్పటికీ, నా పనిని ఎప్పుడూ వదులుకోలేదు. వెయిటింగ్ స్కేల్లోని నంబర్లు నన్ను డిమోటివేట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫలితం మీద కాకుండా రెగ్యులర్‌గా చేసే నా పనిపైనే దృష్టిపెట్టాను. సవాళ్లను ఎంచుకున్నానుబరువు తగ్గిన తర్వాత శారీరకంగా, బలంగా, మరింత శక్తిమంతంగా బలోపేతమైనట్లు భావించాను. రక్త΄ోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ స్థాయులు బ్యాలెన్స్‌లో ఉన్నాయి. మిసెస్ గ్రాండ్ ఇండియా యుఎస్ఎ– 2024 గురించి తెలిసి, అప్లై చేసుకున్నాను. ఈ అందాల ΄ోటీలో ΄ాల్గొనడం, గెలవడం వంటి కొత్త సవాళ్లను స్వీకరించేలా నన్ను నేను మార్చుకున్నాను. బరువు తగ్గడం నా జీవితంలోని ప్రతి అంశాన్ని – నా ఆరోగ్యం, విశ్వాసం, మనస్తత్వాన్ని మార్చింది. బరువు తగ్గడంలో చేసే ప్రక్రియలు, ఫలితాలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా కృషి మొదలుపెట్టాలి. ఫలితం రాలేదని ఎక్కడా వెనకడుగు వేయద్దు. ప్రయత్నాన్ని వదలద్దు’ అని చాందినీ సింగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా తన వెయిట్‌లాస్ జర్నీ విశేషాలు పంచుకున్నారు.ఇంటి భోజనమే ఔషధంక్రాష్ డైట్లను అనుసరించడం ద్వారా వేగంగా బరువు తగ్గగలనని తెలుసు. కానీ, దానిని ఎంచుకోలేదు. ఎందుకంటే ఈ డైట్ ద్వారా ఎంత వేగంగా బరువు తగ్గుతున్నానో, అంత త్వరగా తిరిగి బరువు పెరుగుతున్నాను. ఆ అనుభవం నాకు పెద్ద పాఠం. అందుకే క్రాష్ డైటింగ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన, ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాను, అన్నం, రోటీ, పనీర్, చికెన్ కర్రీ వంటి నాకు ఇష్టమైన భారతీయ వంటకాలన్నీ తినడం కొనసాగించాను. ఆహార నియంత్రణ పాటించాను. నా భోజనంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్‌ని చేర్చడం ద్వారా క్యాలరీ లోటును కొనసాగించాను. రెస్టారెంట్లలో ప్రత్యేక సందర్భాలలో తినడానికి మాత్రమే పరిమితం చేశాను. వీలైనంత వరకు జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కట్ చేశాను. దీని వల్ల ఆహార ఎంపికల గురించి. బ్యాలెచేసుకోవడం.. బాగా అబ్బింది. (చదవండి: కంటి ఉప్పెనను నవ్వుతో కప్పేసి...) -
టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. సుమ తనయుడు రోషన్, హర్ష చెముడు సందడి
-
నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!
టాలీవుడ్లో మరో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావ్ అనే అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!)షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడు అయిపోయాడు. ఇతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయమే. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయినట్లున్నారు.నవంబర్ 11న విశాఖపట్నంలో సందీప్ రాజ్-చాందిని నిశ్చితార్థం జరుగనుందని, డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. సందీప్ రాజ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఇన్నేళ్లు అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: హీరోయిన్
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఆ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని (41) హీరోయిన్గా నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో కూడా ఇప్పటికీ ఈ సినిమాకు గుర్తింపు ఉంది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తాజాగా తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది. ఈ నేపంథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.ఉపేంద్రతో నటించిన 'ఏ' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చాందిని తెలిపింది. తాను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ దక్కినట్లు గుర్తుచేసుకుంది. ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారని ఆమె తెలిపింది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారని చెప్పింది. కానీ తెలిసిన వారి నుంచి తన ఫోటోలు 'ఏ' సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయని, ఆ సమయంలో తనను చూడకుండానే వారు సెలక్ట్ చేశారని తెలిపింది. ఇదే సమయంలో తన పెళ్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది. 'వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. అది మన చేతుల్లో లేదు. దానిని దేవుడు నిర్ణయించాలి. పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను. నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్లు బాగుంటాయి.' అని చాందిని తెలిపింది. -
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!) -
గ్లామర్ రోల్స్ రావడం లేదంటున్న 'కిరాక్' హీరోయిన్
నటిగా నిలదొక్కుకోవాలంటే గ్లామర్ రూట్ ఎంచుకోక తప్పదని చాలా మంది కథానాయికలు భావిస్తున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లగా రాణిస్తున్న వారంతా గ్లామరస్‌గా నటించిన వారే అని చెప్పక తప్పదు. తాజాగా నటి చాందిని తమిళరసన్ కూడా గ్లామర్‌నే కోరుకుంటోంది. 2010లో శాంతనుకు జంటగా సిద్ధూ ప్లస్–2 చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది చాందిని. ఆ తరువాత విల్ అన్భు, నైయప్పుడై, కవన్, మన్నన్ వగైయారా, బిల్లా పాండీ, వంజకర్ ఉలగం వంటి చిత్రాల్లో నటించింది. 14 ఏళ్ల జర్నీ.. కథానాయికగా 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతూనే ఉంది. మంచి అవకాశాలు రాకపోవడంతో వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కథ వింటున్నప్పుడే అందులోని పాత్రలోకి మారిపోతానన్నారు. తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆశగా ఉందన్నారు. అలాంటి ఛాన్సులు రావట్లే రొమాన్స్‌తో కూడిన కామెడీ కథల్లో నటించాలన్నది ఆశ అని, అయితే అలాంటి అవకాశాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా గ్లామరస్ పాత్రలూ రావడం లేదని చెప్పింది. కుటుంబకథా చిత్రాల నటిగా కాకుండా, కాస్త గ్లామరస్తో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్‌లో నటిస్తున్నానని చాందినీ చెప్పింది. చదవండి: కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
స్టార్ హీరో ఫ్లాట్ కొనుక్కున్న మిమిక్రీ క్వీన్, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
బాలీవుడ్ స్టార్హీరోయిన్ అలియాభట్‌ను అనుకరించి పాపులర్ ముద్దుగుమ్మ చాందినీ భబ్దా గుర్తుందా? ఇపుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే...! కంటెంట్ క్రియేటర్, చాందినీ భాబ్దా తన మిమిక్రీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షల కంటే ఎక్కువే. తాజాగా తన లైఫ్‌లో ఒకముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. చాందినీ ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. అదీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందట. ఈఎంఐ అయినా.. 25ఏళ్ల లోపే సొంత ఇల్లు అంటూ ఆనందంలో మునిగి తేలుతూ సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ పూజాకార్యాక్రమాలను నిర్వహించింది. అంతేకాదు తనదైన స్టయిల్లో రెన్నోవేషన్ కూడా చేయనుందట త్వరలోనే. యాక్టింగ్‌పై కూడా అభిరుచి ఉన్న ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ గిరాప్డే’ అనే కామెడీ టీవీషోలో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశకాశాల కోసం ఎదురు చూస్తోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన చాందినీ భబ్దా అలియాతో పాటు హీరోయిన్లు అనన్య పాండే, కంగనా రనౌత్ వాయిస్‌లను కూడా బాగా అనుకరిస్తుంది. అయితే తన వాయస్‌ను అనుకరించడంపై స్పందించిన అలియా చాందినినీ ప్రశంసల్లో ముచెత్తడం,దీనికి చాందినీ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవడం తెలిసిందే. View this post on Instagram A post shared by Chandni Bhabhda 🧿 (@chandnimimic) -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
మనోజ్, చాందిని హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "14 డేస్ లవ్". ఈ చిత్రాన్ని నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కించారు. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాసరి హరిబాబు నిర్మించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అన్న కోణంలో దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంప్రదాయ విలువలతో రూపొందించినఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్, అంజలి, ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు. -
ప్రేమ తగ్గిపోతుందా?
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘విడిపోవాలనుకున్న భార్యాభర్తలు తమ ప్రేమను బలపర్చుకొని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించారు? ఆ భార్యాభర్తల నడుమ ఎలాంటి సంఘర్షణ జరిగింది? అనేది ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ‘పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా..?’ అనేది కాన్సెప్ట్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘రణస్థలి' మూవీ రివ్యూ
టైటిల్: రణస్థలి నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని, సమ్మెట గాంధీ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు నిర్మాణ సంస్థ: ఏ.జె ప్రొడక్షన్ నిర్మాత: అనుపమ సురెడ్డి దర్శకుడు: పరశురామ్ శ్రీనివాస్ సంగీతం: కేశవ్ కిరణ్ సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ విడుదల తేది: నవంబర్ 26, 2022 కరోనా తర్వాత సీనీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లు ఉంటే చాలు.. ఆ సినిమాను ఆదరించేవారు. కాని ఇప్పుడు హీరో హీరోయిన్లను కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే చాలు.. చిన్న పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. నేడు(నవంబర్ 26) మరో చిన్న చిత్రం ‘రణస్థలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. బసవ( ధర్మ) అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. బసవ తండ్రి(సమ్మెట గాంధీ) వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు హత్యకు గురవుతుంది. చక్రవర్తి తోటలో పని చేయడానికి వచ్చిన కూలీలు..అతనితో పాటు అమ్ములును కూడా చంపేస్తారు. అసలు చక్రవర్తి ఎవరు? వీరిద్దరిని కూలీలుగా వచ్చిన కిరాయి గుండాలు ఎందుకు హత్య చేశారు? వారిని పంపించిదెవరు? భార్య హత్యకు కారణమైన వారిని బసవ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'రణస్థలి'.. ఒక రివేంజ్ డ్రామా సినిమా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేసిన ముఠాని ఒక సాదాసీదా వ్యక్తి ఎలా మట్టుబెట్టాడు అన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా నడిపించాడు. చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో కొంతవరకు విజయం సాధించారు. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసుకున్నాడు. అయితే సినిమాలో హింస ఎక్కువగా ఉండడం ఓ వర్గం ఆడియన్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది. సస్పెన్స్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... బసవ పాత్రకి ధర్మ న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు ఒదిగిపోయింది. ఈశ్వరిగా అమ్ము తనదైన నటనతో మెప్పించింది. హీరో తండ్రి పాత్రలో సమ్మెట గాంధీ జీవించేశాడు. . విలన్ గా చేసిన శివతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. కేశవ్ కిరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
వైవిధ్యమైన రణస్థలి
‘‘రణస్థలి’ టీజర్, ట్రైలర్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తుకు వస్తోంది. ఇందులోని కొన్ని సీన్స్ చూసిన తర్వాత సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అని నిర్మాత సి. అశ్వినీదత్ అన్నారు. ధర్మ, అమ్ము అభిరామి, చాందినీ రావు హీరో హీరోయిన్లుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలి’. సూరెడ్డి విష్ణు సమర్పణలో అనుపమ సూరెడ్డి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘విజయా పిక్చర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా 50 ఏళ్లు నడిపిన వెంకటరత్నంగారి అబ్బాయి విష్ణు సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటీనటులు కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు’’ అన్నారు సూరెడ్డి విష్ణు, సహనిర్మాత లక్ష్మీజ్యోతి శ్రీనివాస్. ‘‘పూరి జగన్నాథ్‌గారు నా గురువు. రొటీన్‌గా వచ్చే కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు పరశురాం శ్రీనివాస్. ఈ వేడుకలో హీరోలు ఆకాష్ పూరి, నందు, గౌతమ్, నటుడు సమ్మెట గాంధీ, కెమెరామేన్ బాలాజీ, చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేశవ్ కిరణ్. -
మల్టీకలర్ డ్రెస్‌లో చాందిని తమిళరసన్ (ఫొటోలు)
-
మా సినిమా చూడండి అంటూ బస్టాండ్లలో తిరిగిన హీరోహీరోయిన్లు
Ram Asur Movie Promotions: సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేసుకోవడం తప్పనిసరి! అయితే సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు భారీ ఏర్పాట్లతో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఇంకొందరు స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. "రామ్ అసుర్" హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని మాత్రం తమ సినిమా చూడండి అంటూ జనంలోకి వెళ్లి ప్రచారం చేశారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న "పీనట్ డైమండ్" మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని చిత్ర టైటిల్‌ను `రామ్ అసుర్`గా మార్చారు. నవంబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చుతున్నారు. -
మాజీ మంత్రికి నటి షాక్.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ
తమిళసినిమా: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్ ఇచ్చారు. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన నటి చాందిని. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది. -
అప్పటికింకా మాకు పెళ్లి కాలేదు.. అందుకే అలా: ఐఏఎస్
అగర్తలా: సాధారణంగా పరీక్షలు రాయడం పూర్తి కాగానే విద్యార్థులు ఉపశమనం దొరికినట్లు ఫీలవుతారు. అదే విధంగా.. ఫలితాలు ఎప్పుడు వస్తాయో, పాస్ అవుతామో లేదో అన్న భయాలతో ఒత్తిడికి కూడా గురిఅవుతారు. అటువంటి సమయాల్లో నచ్చిన పని చేస్తూ సేద దీరడం లేదంటే, సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఐఏఎస్ అధికారిణి చాందినీ చంద్రణ్ కూడా ఇందుకు అతీతం కాదు. 2015లో ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒత్తిడికి లోనైన చాందినీ.. తన ప్రియ మిత్రుడు అరుణ్ సుదర్శన్‌తో కలిసి సరాదాగా ఔటింగ్‌కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్ సుదర్శన్ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ‘‘వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది’’ అంటూ చాందినీ చంద్రణ్, అరుణ్ సుదర్శన్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్ చేశారు. అయితే, కాకతాళీయంగా అదే రోజు సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆ యేడు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఫొటోలతో పాటు మరో పేజీలో చాందినీ చంద్రణ్(ఆమె అప్పుడు ఉత్తీర్ణురాలు కాలేదు) ఫొటో కూడా పబ్లిష్ కావడం గమనార్హం. దీంతో.. అరుణ్ సుదర్శన్... సదరు పత్రికా సంస్థకు ఫోన్ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్ చేయవద్దని హితవు పలికారు. ఈ విషయాన్ని మంగళవారం ట్విటర్ వేదికగా పంచుకున్న ఐఏఎస్ చాందినీ చంద్రణ్ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు. అప్పటికి మాకింకా పెళ్లికాలేదు ‘‘ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదు!! కానీ అలాంటి ఫొటోలు ఇంట్లో వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి కదా. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. అయితే, ప్రస్తుతం మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్ సుదర్శన్ సదరు ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించగా... ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్ అనే మాటతో సరిపెట్టలేను!!’’ అని ఈ స్టోరీని రివీల్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘అత్తుత్తమ ఫొటోల్లో ఇది ఒకటి!! మధుర జ్ఞాపకాలు. ఏంటో.. ఊహించనవి అలా అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటాయి. పాత ఫొటో అయినా ఇది మీకెంతో ప్రత్యేకం కదా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐఐటీ మద్రాస్‌లో విద్యనభ్యసించిన చాందినీ చంద్రణ్ 2017లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె.. ఉత్తర త్రిపురలోని కాంచన్‌పూర్‌లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. as we weren't married then 😅.I took it as a sign that my photo was destined to be there in the paper filled with UPSC toppers and that I can happily walk towards any destination with someone holding an umbrella and looking out for me with love unbound when I take each step.(2/3) — Chandni Chandran (@chandni_ias) June 29, 2021 -
నటి చాందినీని మోసం చేసిన కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ మంత్రి (అన్నాడీఎంకే) మణికంఠన్ సౌకర్యవంతమైన జైలు జీవితం భగ్నమైంది. జైళ్లశాఖకు చెందిన విజిలెన్స్ అధికారుల సాక్షిగా బండారం బట్టబయలు కావడంతో చెన్నై సైదాపేట సబ్ జైలు నుంచి చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు ఆయన్ని తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయాంలో సమాచార శాఖా మంత్రిగా పనిచేసిన మణికంఠన్‌ను.. పర్యాటకాభివృద్ధి పనుల నిమిత్తం నటి చాందినీ అనేకసార్లు కలిశారు. ఈ రకంగా వాద్దరి మధ్య ఏర్పడిన పరిచయం బలపడింది. తన భార్యతో సరిపడటం లేదని, వైవాహిక జీవితం విఫలమైందని పేర్కొంటూ అతడు చాందినీకి చేరువయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చెన్నై అడయారులో ఇల్లుతీసుకుని భార్యభర్తల్లా మెలిగేవారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చినపుడల్లా అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడిపోయిన చాందినీ చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాలీని స్వయంగా కలిసి మణికంఠన్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగానే మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ముందస్తు జామీనుకు దరఖాస్తు చేసుకోగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. బెంగళూరులోని ఒక రిసార్టులో దాక్కుని ఉన్న మణికంఠన్‌ను వారం రోజుల క్రితం చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి సైదాపేట సబ్ జైల్లో పెట్టారు. అయితే అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు జైళ్లశాఖ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో జైళ్లశాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా సైదాపేట సబ్జైలుకెళ్లి తనిఖీలు చేపట్టారు. మాజీ మంత్రి మణికంఠన్ రూంలో ఎయిర్‌కూలర్, మెత్తని పరుపు, దిళ్లు, సువాసన వెదజల్లే బాటిళ్లు గుర్తించారు. అంతేగాక చార్జర్ సౌకర్యంతో సెల్‌ఫోన్‌ను ఉండటాన్ని గమనించారు. ఈమొత్తం సామగ్రిని స్వాధీనం చేసు కున్న విజిలెన్స్ అధికారులు మణికంఠన్‌ను వెంటనే చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మణికంఠన్‌కు సకల సౌకర్యాలు కల్పించిన జైలు అధికారులపై విచారణకు ఆదేశించారు. చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని -
అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్
సాక్షి, చెన్నై: మాజీ మంత్రి మణికంఠన్ చిక్కారు. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్న చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం చెన్నై తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. మాజీ మంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, మూడుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఆరు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఆయన్ను విచారించేందుకు చెన్నై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే మరో వైపు ఆధారాల కోసం ఆయనకు పీఏగా, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారిని విచారించారు. ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. అలాగే బలవంతంగా మూడుసార్లు చాందినికి అబార్షన్ చేసిన డాక్టరును విచారించేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అందిన రహస్య సమాచారం మేరకు ఒక బృందం శనివారం బెంగళూరు వెళ్లింది. అక్కడి శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుంది. రాత్రికి రాత్రే చెన్నై తరలించిన పోలీసులు ఉదయాన్నే అడయార్ స్టేషన్లో ఉంచి తీవ్రంగా విచారణ చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి -
భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని
సాక్షి, చెన్నై: నటి చాందిని వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు నాగపట్టినం, రామానాథపురం జిల్లాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన చాందినీ ఇటీవల చెన్నై వెప్పేరీ పోలీస్‌స్టేషన్‌లో మణికంఠన్‌పై ఇటీవల ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలు.. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదానిని. పర్యాటకాభివృద్ధి సంబంధించి మాట్లాడాల్సి ఉందని అప్పట్లో రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉండిన మణికంఠన్.. భరణి అనే వ్యక్తిద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో 2017 మే 3వ తేదీన మంత్రి హోదాలో మణికంఠన్‌ను ఆయన ఇంటి వద్ద కలిశాను. అదే సమయంలో నా సెల్‌ఫోన్ నెంబరు తీసుకున్న మణికంఠన్ పెళ్లిపేరుతో నమ్మబలికాడు. చెన్నై బిసెంట్‌నగర్‌లోని ఒక అపార్టుమెంటులో భార్యాభర్తల తరహాలో జీవితం సాగించాం. ఈ సమయంలో మూడుసార్లు నాకు తన స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడు. వేధింపులతో నా కళ్లు దెబ్బతిన్నాయి. పెళ్లి చేసుకుందామని కోరడంతో.. రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడు.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ అదేశాల మేరకు అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పలుసెక్షన్లపై మణికంఠన్, భరణిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
నటితో సహజీవనం: రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
చెన్నై: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికంఠన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మణికంఠన్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేసినట్లు తెలిపారు. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేసినట్లు చెప్పారు. అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నట్లు తెలిపారు. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తన కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికంఠన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఎవరో నాకు తెలియదు– మాజీ మంత్రి నటి చాందిని ఫిర్యాదుపై మాజీ మంత్రి మణికంఠన్ స్పందించారు. చాందిని ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తనను కలిశారన్నారు. అదే విధంగా నటి చాందిని కూడా తనను కలిసి ఉండొచ్చని తెలిపారు. అప్పుడు తనతో తీసుకున్న ఫొటోలు చూపించి తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులే చాందినిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనిచేయిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చాందినితో కలిసున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. చదవండి: గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ -
పెళ్లి పేరుతో మోసం చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ
ప్రేమ-పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన ఓ మాజీ మంత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన చాందినీ.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డాక్టర్ మణికందన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో సహజీవనం చేసి గర్భవతిని చేసిన మణికందన్.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. చెన్నై: కోలీవుడ్ నటి చాందినీ అన్నాడీఎంకే నేత మణికందన్ మీద ఛీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, తాను గర్భవతిని అని తెలిశాక అబార్షన్ చేయించాడని ఆమె మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకోమంటే కుదరదని అన్నాడని, గట్టిగా మాట్లాడితే తన గుండాలతో చంపిస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మణికందన్‌తో జరిగినట్లుగా వాట్సాప్ ఛాటింగ్‌లను ఆమె మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది. కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్, వాగి సూడా వా’ సినిమా లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు. కాగా చాందినీ ఆరోపణలపై మణికందన్ స్పందన తెలియాల్సి ఉంది. -
‘ఛోరా చకోర’మాస్ సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్
అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా సుకు పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శుక్ర’. రుజల ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఛోరా చకోరా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మైండ్ గేమ్స్ నేపథ్యంలో ఉంటుంది. ‘ఛోరా చకోర’ పాటలో చాందినీ భతిజ డ్యాన్సులు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఆడియన్స్‌కు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా మధుర ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్లో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్, కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి. -
ఓ మై గాడు.. బొంభాట్ పోరడు..
'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్సుగా నటించిన చిత్రం "బొంభాట్". సైన్స్ ఫిక్షనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది నవంబర్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి స్వామి నాథ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. "బుద్ధిగా కలగన్నా.. బుజ్జిగా ఎదపైనా.. సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిగా.." అంటూ ప్రియురాలి కోసం హీరో పాట పాడుతుంటే "ఓ మై గాడు.. బొంభాట్ పోరడు.. అంటూ ప్రేయసి కూడా రాగమెత్తుకుంది. (సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క) క్లాసికల్, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిని ఆలపించారు. జోష్.బి సంగీతం సమకూర్చాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బొంభాట్' సినిమాను గతేడాది చివర్లో విడుదల చేయాలనుకున్నప్పటికీ పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఇంతలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దీని విడుదల మరింత ఆలస్యం కానుంది. (నా బర్త్‌డే కేక్ నేనే తయారు చేసుకున్నా) -
వీడిన 'చాందిని' మృతి మిస్టరీ
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: మహిళ మృతి మిస్టరీ వీడింది. గత నెల 21న కడప–తిరుపతి బైపాస్‌రోడ్డులో చిల్లీస్‌డాబా వెనుక గల బీడు పొలంలో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పట్టణ సీఐ శుభకుమార్ సంఘటన స్థలంలో లభ్యమైన పర్సుతో కేసును చేధించారు. మృతురాలు ఒంటిమిట్ట మండలంలోని నడింపల్లె గ్రామానికి చెందిన బిల్లా సంపూర్ణ ఉరఫ్ చాందిని అని, ఆమెను హత్య చేసిన వ్యక్తి వేముల మండలం కొత్తపల్లెకు చెందిన నల్లబల్లె సాంబశివ అని తేల్చారు. ఈ మేరకు సోమవారం పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, సీఐ శుభకుమార్ విలేకరులతో మాట్లాడారు. నిందితుడు సాంబను హాజరుపెట్టారు. వివరాల్లోకి వెళితే. నెల్లూరు జిల్లా సాతుపల్లెకు చెందిన బిల్లా సంపూర్ణ (36)కు, ఒంటిమిట్ట మండలంలోని నడింపల్లెకు చెందిన లక్ష్మీనరసయ్యతో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. చెన్నైలో చీనీకాయల వ్యాపారం చేస్తూ 2009లో భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత రాజంపేటకు చెందిన హుసేన్బాషతో సంపూర్ణ కొద్దిరోజులు సహజీవనం చేసింది. (ఈమె.. ఆమేనా..? ) పులివెందుల, వేంపల్లె, కదిరిలో కొద్దిరోజులు కాపురం కొనసాగించారు. కదిరి నుంచి వేంపల్లెకు ఇల్లు మారే సమయంలో సాంబ ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో సంపూర్ణతో సాంబ«కు వివాహేతర సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని ఆమె డబ్బుతో ఐదు ఎకరాలు పొలం తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాగా కొంత కాలానికి ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. లేకుంటే తన డబ్బుతో కొనుగోలు చేసిన పొలంను ఇచ్చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత నెల 20న రాజంపేట పట్ణణంలోని జాఫర్ అనే వ్యక్తి వద్ద డబ్బు తీసుకోవడానికి సాంబ, సంపూర్ణలు బైకుమీద వచ్చారు. అప్పటికే ఆమెను వదలించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్న సాంబ చిల్లీస్ డాబా వెనుక వైపు ఉన్న బీడు స్థలంలోకి సంపూర్ణను తీసుకెళ్లాడు. కలిసి భోజనం చేసేందుకు ఉపక్రమించిన పరిస్థితిలో ఇద్దరి మధ్య పెళ్లి, ఆస్తి గొడవలు తలెత్తాయి. దీంతో రాయి తీసుకొని ఆమె తలపై కొట్టాడు. కిందపడిన ఆమెను చీరకొంగుతో మెడకు బిగించి చంపేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు చైను తీసుకొని బైకు లో తిరుపతి వైపు పారిపోయాడు. కాగా సంఘటన స్థలంలో మృతురాలి వద్ద పర్సు ఉంది. అది బంగారు దుకాణం వారు ఇచ్చినది. ఆ పర్సు ఆధారంగా బంగారు దుకాణం నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఇదిలా ఉండగా సంపూర్ణ రాజంపేటకు వచ్చేటపుడు తన సోదరికి ఫోన్ ద్వారా రాజంపేటకు వస్తున్నానని తెలిపింది. ఆ ఫోన్‌కాల్స్ నుంచి సాంకేతికంగా దర్యాప్తు చేసి, హత్యకు పాల్పడిన సాంబను కడప–తిరుపతి బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కోర్టుకు హాజరుపరిచి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. (టీవీ నటి ఆత్మహత్య ) -
డిగ్రీ పాసవలేదన్న మనస్తాపంతో..
విశాఖ,గాజువాక : డిగ్రీలో పాసవలేదన్న మనస్తాపంతో ఒక యువతి ఇంటి నుంచి అదృశ్యమైట్టు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన చాందిని (20) డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీలోని చివరి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో గాజువాక హైస్కూల్ రోడ్లో నివాసముంటున్న తన అక్క ఇంటికి ఇటీవల వచ్చింది. సప్లిమెంటరీలో పాస్ కావచ్చని భావించిన ఆమె సమయం వృథా కాకుండా కాంపిటేటివ్ పరీక్షలకు కూడా సిద్ధమవుతోంది. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆమె ఇంట్లో కనిపించలేదు. డిగ్రీ పాస్ కాకపోవడం వల్ల తనకు ఉద్యోగం రాదనే విషయం ఆందోళన కలిగిస్తోందని, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, తనకోసం వెతకవద్దని ఒక పేపర్‌పై రాసి వెళ్లిపోయినట్టు చాందిని బావ మోహనరావు గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు గాజువాక ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.