
అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా సుకు పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శుక్ర’. రుజల ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఛోరా చకోరా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు.
‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మైండ్ గేమ్స్ నేపథ్యంలో ఉంటుంది. ‘ఛోరా చకోర’ పాటలో చాందినీ భతిజ డ్యాన్సులు, ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఆడియన్స్‌కు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూషన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్‌ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్, కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి.
Comments
Please login to add a commentAdd a comment