దిలీప్‌కుమార్ సల్వాది, చాందినీ
‘‘దిక్సూచి’ చిత్రాన్ని దిలీప్ అన్నీ తానై బాగా తీశాడు. తనకు అన్ని క్రాఫ్ట్స్‌మీద అవగాహన ఉంది. నిర్మాత రాజుగారి ప్రోత్సాహంతో చక్కని సినిమా చేశాడనిపించింది. కళ అంటే గౌరవం ఉంటేనే ఈ తరహా సినిమాలు వస్తాయి. ట్రైలర్‌లో ఆ విషయం కన్పించింది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ క్రాంతి మాధవ్ అన్నారు. దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. 1970 నేపథ్యంలో కథ ఉంటుంది. సెమీ పీరియాడిక్ ఫిల్మ్. కుటుంబమంతా చూసేలా ఉంటుంది. నటీనటులు నాకు బాగా సపోర్ట్ చేయడంతో పాటు చక్కగా నటించారు. సినిమా బాగుంటే థియేటర్స్ సమస్య ఉండదని నమ్ముతాను. 2019లో ది బెస్ట్ మూవీగా ‘దిక్సూచి’ ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన రాజుగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దిక్సూచి’ లో అవకాశం రావటం నా అదృష్టం’’ అన్నారు హీరోయిన్ చాందినీ. ఈ కార్యక్రమంలో నటీనటులు సుమన్, అరుణ్ భరత్, నిహారిక, బిత్తిరి సత్తి, సమ్మెట గాంధీ, ‘ఛత్రపతి’ శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్.
Comments
Please login to add a commentAdd a comment