Kranthi Madhav
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
నాది ఓవర్ కాన్ఫిడెన్స్
‘‘నేను ప్రేమకథా చిత్రాలు చేయనంటే కేవలం వాణిజ్య అంశాలతో కూడుకున్న సినిమాలే చేస్తానని కాదు. ‘టాక్సీవాలా’ (2018) లాంటి ప్రేమకథ చిత్రం వస్తే చేస్తానేమో. ప్రేమే ప్రధానాంశంగా ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ (2017), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటివి చేయకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కెరీర్లో ఓ మార్పు కోరుకుంటున్నాను. పూరీగారితో సినిమా చేస్తున్నాను కాబట్టి నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కాదు. చిన్నతనం నుంచే నాది ఓవర్ కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నప్పుడు... ‘మీ నాన్నగారికి కుదర్లేదు కదా. సక్సెస్ ఉండదు. డబ్బులు రావు’ అన్నారు. సో.. మెంటల్‌గా భయంగానే ఉంటుంది. ఇప్పటికీ నాకు ఆ భయం ఉంటుంది. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని మనల్ని మనం నిరూపించుకోవాలి. లేకపోతే భయంలోనే కొట్టుకుంటూ పోతాం. కొత్త తరం మారాలి. అందుకు నా వంతు డ్యూటీ చేస్తాను. ► స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉన్నాయి. వీటిలో సీనయ్య, సువర్ణల ప్రేమకథ ఒకటి. ఒక చిన్న ఊర్లో పెద్దగా చదువు లేని భార్యాభర్తల మధ్య సాగే కథ. ఇందులో సీనయ్య పాత్రకు బాధ్యతలు ఎక్కువ. ఈ పాత్రకు రిఫరెన్స్‌గా మా నాన్నగారిని తీసుకున్నాను. మరోవైపు బాధ్యత అనేదే తెలియకుండా సౌకర్యంగా ప్యారిస్‌లో జీవితాన్ని గడిపే ఓ యువకుడి లవ్‌స్టోరీ. ఇంకోటి కొత్తగూడెంలోని ఓ కాలేజీ ప్రేమకథ. ఈ లవ్‌స్టోరీకి కాస్త ‘అర్జున్ రెడ్డి’ టచ్ ఉండొచ్చు. మూడు ప్రేమకథలకు సినిమాలో రిలేషన్ ఉంది. అదేంటో ప్రేక్షకులు వెండితెరపై చూడాలి. ►ఈ సినిమా కోసం మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. కొత్తగూడెం లవ్‌స్టోరీకి మీసాలు పెట్టి, చిన్న జుట్టు ఉన్న హెయిర్‌స్టైల్‌తో కనిపించాలి. ప్యారిస్ కథకు కొంచెం ఫ్యాషన్‌గా కనిపించాలి. కాలేజ్ కథకు ఆ స్పెషల్ టచ్ ఉండాలి. ఇలా క్యారెక్టర్స్ కోసం శ్రమించాల్సి వచ్చింది. క్రాంతి (చిత్రదర్శకుడు క్రాంతి మాధవ్) బలం రైటింగ్. నా నటనను పక్కనపెడితే మిగతా క్రెడిట్ ఆయనకు, కెమెరామేన్ జయకృష్ణ గుమ్మాడి, నిర్మాత కేఎస్ రామారావుగారికి దక్కుతుంది. ► నేను యాక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా, ఓ సైన్స్‌ఫిక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా ‘అర్జున్‌రెడ్డి’యే అంటారు. అది నాకు తప్పదు. ఒక ఫ్లాప్ సినిమాతో కంపేర్ చేస్తే అది నన్ను బాధపెడుతుంది. కానీ ‘అర్జున్‌రెడ్డి’ లాంటి క్రేజీ హిట్ మూవీతో పోల్చడం బాగానే ఉంది. ► ‘వరల్డ్ ఫేమస్...’ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినవారిని (ఫ్యాన్స్) చూసి ఆశ్చర్యపోయాను. వారితో నాకు ఏ అనుబంధం లేకపోయినా ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనుకున్నా! టికెట్ బుకింగ్స్ చూసి షాకయ్యాను. వారి ప్రేమ, అభిమానం గొప్పవి. అందుకే మా ఆడియన్స్‌కు నా బెస్ట్ వెర్షన్ సినిమాలను ఇవ్వాలనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా కష్టపడాలనుకుంటున్నాను. ► ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నా తొమ్మిదో సినిమా. వీటిలో ఆరు సినిమాలు కొత్త దర్శకులతో తెరకెక్కినవే. మొదట్లో సర్వైవల్ కోసం సినిమాలు చేశాను. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయే రెండేళ్లు యాక్టర్‌గా నా కెరీర్లో న్యూ ఫేజ్ అనుకుంటున్నాను. కొత్త రకం కథలను ప్రయత్నించాలనుకుంటున్నాను. ► నిజానికి ప్రేమ కాన్సెప్ట్ నాకు ఒకప్పుడు నాన్సెన్స్లా తోచింది. ప్రేమలో కూడా చాలా దశలు ఉంటాయి. ఒక అబ్బాయి ముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. నాది ట్రూ లవ్ అంటాడు. అనుకోని కారణాల వల్ల అది బ్రేకప్ అయినప్పుడు వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అది కూడా ట్రూ లవ్ అంటాడు. అసలు ఎవరితోనూ ప్రేమలో లేనప్పుడు... మొదట ప్రేమించిన అమ్మాయి, రెండోసారి ప్రేమించిన అమ్మాయి ఒకేసారి కనిపిస్తే, ఎవరితో ముందుగా ప్రేమలో పడతాడు? అనే అయోమయంలో ఉండేవాడిని. ఇప్పుడు అలా లేదు. జీవితంలో లవ్ అనే స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలనే ఆలోచన ఉన్న ఫేజ్‌లో ఉన్నాను. ట్రూ లవ్ ఉంటుందనే అనుకుంటున్నాను. ► పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది బాధ్యతతో కూడుకున్నది. ఆ బాధ్యత తీసుకోవడానికి ప్రస్తుతం నేను మానసికంగా సిద్ధంగా లేను. నాకు 30 ఏళ్లు వచ్చాయి. కొన్ని విషయాల్లో పెద్దవాణ్ని అయిపోయాననిపిస్తుంది. కానీ పెళ్లి అనగానే నేను ఇంకా పిల్లోణ్నే అనిపిస్తుంది. ► నా గురించి వ్యతిరేక వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారు ఉంటారు. వారు నా గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంటే వారికి నేనంటే ఎంతో ప్రేమ ఉండి ఉంటుంది. వారు నిద్రపోయేప్పుడు కూడా నేనే గుర్తుకు వస్తానేమో. విమర్శలను ఇష్టపడతాను. కానీ విలువైన విమర్శలనే తీసు కుంటాను. -
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా స్టిల్స్
-
రౌడీ ఫ్యాన్స్‌కు లవ్ సాంగ్ గిఫ్ట్
టాలీవుడ్ రౌడీ, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా చిత్ర పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు ‘అర్జున్‌రెడ్డి ఈజ్ బ్యాక్’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూవీ ఆరంభం నుంచే ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ కొత్త స్ట్రాటజీని అవలింభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి మరో అస్త్రాన్ని అభిమానులపై వదిలింది. ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పాటకు రహ్మాన్ లిరిక్స్ అందించగా.. శ్రీక్రిష్ణ, రమ్య బెహరా ఆలపించారు. గోపీ సుందర్ డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’ -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ వచ్చేశాడు
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’... ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కాదు’ అన్న హీరోయిన్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించాడు. మిడిల్ క్లాస్ భర్తగా, లవర్‌గా, బైక్ రైడర్‌గా, పైలట్‌గా, భగ్న ప్రేమికుడిగా విజయ్ను విభిన్నమైన వెరియేషన్స్‌లో చూపిస్తూ టీజర్ సాగింది. ఇందులో రాశీకన్నా, క్యాథరిన్, ఇజాబెల్లా లీటే, ఐశ్వర్యా రాజేశ్‌లతో లవ్, రొమాన్స్‌తోపాటు ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించారు. ఇక, విజయ్ ఏ సినిమా తీసినా ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం సహజమే. ఈ సినిమా టీజర్లో భగ్న ప్రేమికుడిగా విజయ్ ఇంటెన్స్ ఎమోషన్స్, యామిని అంటూ చివర్లో చెప్పిన డైలాగులు ‘అర్జున్‌రెడ్డి’ని తలపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి-2’నా అని కామెంట్ చేయడం కనిపిస్తోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్లు సాధించి టాలీవుడ్లో సెన్సెషన్ అండ్ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే డియర్ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. -
న్యూఇయర్ కానుక.. ‘రౌడీ’ టీజర్ రేపే!
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్లు సాధించి టాలీవుడ్లో సెన్సెషన్ అండ్ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే డియర్ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచి వెనుకబడ్డాడు. అయితే ఆ లోటును భర్తీ చేయడానికి ఈ క్రేజీ స్టార్ ఏకంగా ప్రపంచ ప్రేమికుడి అవతారమెత్తిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఈ అంచనాలకు తోడు హీరోతో నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో చెప్పిన ప్రకారమే ‘వరల్డ్ ఫేమస్ లవర్’చిత్ర టీజర్ న్యూఇయర్ కానుకగా రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే సినిమా నాడిగా పేర్కొనే టీజర్, ట్రైలర్లతో దాదాపు చిత్ర భవిత్యం తెలిసిపోతుందంటారు. దీంతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌పై టాలీవుడ్ ఆసక్తిగా అంతకుమించి ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల మందుకు రానుంది. Tomorrow, 4:05 PM. Teaser.#WorldFamousLover pic.twitter.com/UisSfpbvEo — Vijay Deverakonda (@TheDeverakonda) January 2, 2020 -
‘వరల్డ్ ఫేమస్ లవర్’టీజర్ ఎప్పుడంటే?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ చిత్ర ఫస్ట్ లుక్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర యూనిట్ కొత్త స్ట్రాటజీని అవలంభిస్తూ.. ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగేలా చేస్తోంది. ఈ సినిమాలోని నలుగురు హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. గురువారం ఐశ్వర్యా రాజేశ్, విజయ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సువర్ణ అనే గృహిణి పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ అయిన ఇజబెల్లాతో కలిసి విజయ్ ఫ్రాన్స్ వీదుల్లో విహరిస్తున్న పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఇజ పాత్రలో ఇజ బెల్లా, గౌతమ్ పాత్రలో విజయ్‌లు ప్రేమికులుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన రెండో పోస్టర్ విడుదలతో పాటు విజయ్ అభిమానులకు చిత్ర యూనిట్ మరో తీపి కబురు తెలిపింది. జనవరి 3న చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. Iza ma chérie ❤️ https://t.co/nFXXJ1hzmx — Vijay Deverakonda (@TheDeverakonda) December 13, 2019 -
ప్రేమికుల రోజున..
ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒకటికి మించి లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్. -
స్టన్నింగ్ లుక్‌లో విజయ్ దేవరకొండ
డియర్ కామ్రేడ్ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కేఎస్ రామారావు సమర్పణలో విజయ్ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్రేజీగా ఉన్న చిత్ర టైటిల్ సినీ వర్గాలతో పాటు అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. తాజాగా చిత్ర బృందం విజయ్ ఫ్యాన్స్‌కు మరో కానుకను అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లో విజయ్ యాంగ్రీగా, గాయాలతో కనిపిస్తాడు. దీంతో విజయ్ దేవరకొండ మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది. అయితే సినిమా టైటిల్ ఫిక్స్ చేశాక విజయ్ మరోసారి లవర్‌బాయ్‌గా కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇలా రఫ్‌గా కనిపించడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. డియర్ కామ్రేడ్ సినిమా నిరాశపరచడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాపైనే కొండంత ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన విజయం లేని క్రాంతి మాధవ్.. విజయ్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. First Look.#WorldFamousLover#WFLFirstLook pic.twitter.com/41li0tdkzE — Vijay Deverakonda (@TheDeverakonda) September 20, 2019 -
‘వరల్డ్ ఫేమస్ లవర్’గా విజయ్ దేవరకొండ
డియర్ కామ్రేడ్ సినిమాతో నిరాశపరిచిన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న క్రాంతి మాధవ్ సినిమాకు చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాను ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇసాబెల్లెలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. -
విజయ్ దేవరకొండ మూవీ అప్డేట్!
‘డియర్ కామ్రేడ్’ అంటూ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశపడ్డ విజయ్ దేవరకొండకు భంగపాటే ఎదురైంది. ఫుల్ స్వింగ్‌లో ఉన్న విజయ్ ఆశలకు డియర్ కామ్రేడ్ గండికొట్టింది. ఈ చిత్రంలో ఏకంగా దక్షిణాది మొత్తానికి తన స్టామినాను చూపించాలని ఆశపడ్డాడు. అయితే ఆ హీరో ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమొకటి. ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇజబెల్లిలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ రాకపోయేసరికి సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఈ చిత్ర నిర్మాత తాజాగా ఓ అప్డేట్ను ప్రకటించాడు. ఈ మూవీ టైటిల్‌ను రేపు (సెప్టెంబర్ 17) ఉదయం 11గంటలకు రివీల్ చేయనున్నుట్లు తెలిపాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
రైటర్‌గా విజయ్ దేవరకొండ
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్, రచయితగా కనిపించనున్నాడట. తాను రాసిన కథల్లోని హీరో పాత్రల్లో తానే కనిపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేయస్ రామారావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ ‘బ్రేకప్’!
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తిచేసిన విజయ్, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో హీరో చిత్రాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న కాంత్రి మాధవ్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అనేకసార్లు ప్రేమ విఫలమైన బాధితుడిగా కనిపించనున్నాడట. అందుకే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బ్రేకప్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
కళ అంటే గౌరవం ఉంటేనే..
‘‘దిక్సూచి’ చిత్రాన్ని దిలీప్ అన్నీ తానై బాగా తీశాడు. తనకు అన్ని క్రాఫ్ట్స్‌మీద అవగాహన ఉంది. నిర్మాత రాజుగారి ప్రోత్సాహంతో చక్కని సినిమా చేశాడనిపించింది. కళ అంటే గౌరవం ఉంటేనే ఈ తరహా సినిమాలు వస్తాయి. ట్రైలర్లో ఆ విషయం కన్పించింది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ క్రాంతి మాధవ్ అన్నారు. దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. 1970 నేపథ్యంలో కథ ఉంటుంది. సెమీ పీరియాడిక్ ఫిల్మ్. కుటుంబమంతా చూసేలా ఉంటుంది. నటీనటులు నాకు బాగా సపోర్ట్ చేయడంతో పాటు చక్కగా నటించారు. సినిమా బాగుంటే థియేటర్స్ సమస్య ఉండదని నమ్ముతాను. 2019లో ది బెస్ట్ మూవీగా ‘దిక్సూచి’ ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన రాజుగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దిక్సూచి’ లో అవకాశం రావటం నా అదృష్టం’’ అన్నారు హీరోయిన్ చాందినీ. ఈ కార్యక్రమంలో నటీనటులు సుమన్, అరుణ్ భరత్, నిహారిక, బిత్తిరి సత్తి, సమ్మెట గాంధీ, ‘ఛత్రపతి’ శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
8 ఏళ్ల పిల్లాడికి తండ్రిగా ‘అర్జున్ రెడ్డి’
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ప్రతీ చిత్రలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపిస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలో తన వయసుకు మించిన పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఫేం కాంత్రి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ ఎనిమిదేళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించనున్నాడట. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
‘రౌడీ’తో జోడి..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది. గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జేకే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
ప్రేమ కథ పట్టాలెక్కింది
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ముహూర్తం జరుపుకుంది. ఈ సినిమాను క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు సమర్పణలో కేఎస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లె హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. హీరో, హీరోయిన్స్‌పై కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అశ్వినీదత్, బీవీఎస్ఎన్ ప్రసాద్, సి. కల్యాణ్, దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
ప్రేమకథ
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ చిత్రాల ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతిమాధవ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ‘ఓనమాలు, మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు, ఉంగరాల రాంబాబు’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు క్రాంతిమాధవ్. వీరి కాంబినేషన్లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ప్రొడక్షన్ నెం.46గా నిర్మించనున్న కొత్త సినిమా ఈనెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్ తెలియజేయనుంది. ప్రేమకథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జేకే. -
వేసవిలో ప్రేమ మొదలు
ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టేస్తున్నారు, సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ ఇచ్చిన సక్సెస్‌తో వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకెళ్తున్నారీ యంగ్ హీరో. విజయ్ కమిట్ అయిన వాటిలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో సినిమా ఒకటి. చక్కని లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు క్రాంతి మాధవ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో మొదలు కానుందట. ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శకుడు క్రాంతి మాధవ్. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, సావిత్రి బయోపిక్ ‘మహానటి’లోనూ విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ‘మహానటి’లో జర్నలిస్ట్‌గా, పరుశురామ్ సినిమాలో టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. -
'ఉంగరాల రాంబాబు' రివ్యూ
టైటిల్ : ఉంగరాల రాంబాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, మియా జార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రాజ్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : క్రాంతి మాధవ్ నిర్మాత : పరుచూరి కిరిటీ హాస్య నటుడిగా మంచి ఫాంలో ఉండగా హీరోగా మారిన సునీల్ చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు వచ్చినా.. ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. వరుస అపజయాలతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ కామెడీ స్టార్.. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఉంగరాల రాంబాబు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దర్శకుడిగా క్లీన్ ఇమేజ్ ఉన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సునీల్ కెరీర్ ను గాడిలో పెట్టిందా..? క్రాంతి మాధవ్ మరోసారి ఆకట్టుకున్నాడా...? కథ : కోటీశ్వరుడైన రాంబాబు (సునీల్) తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయిన రోడ్డున పాడతాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రాంబాబుకు జనాల్ని మోసం చేస్తూ బతికే దొంగ బాబా బాదం బాబా(పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. రాంబాబు ను చూసిన బాదం బాబా నేను చెప్పినట్టు చేస్తే నీ డబ్బు నీకు తిరిగొస్తుందని చెబుతాడు. అలా బాదం బాబా చెప్పిన పనికి వెళ్లిన రాంబాబు కు భారీగా బంగారం దొరుకుతుంది. దీంతో బాబా మీద నమ్మకం మరింత పెరుగుతుంది. జాతకాల మీద విపరీతమైన నమ్మకంతో రాంబాబు.. ఉంగరాల రాంబాబుగా మారిపోతాడు. అయితే తిరిగి కోటీశ్వరుడైన రాంబాబుకు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసే జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాబా చెప్తాడు. దీంతో బాబా చెప్పిన జాతకం కలిగిన సావిత్రి (మియా జార్జ్)ను ప్రేమిస్తాడు. అలా డబ్బు కోసం ప్రేమలో పడ్డ రాంబాబు అనుకున్నది సాధించాడా.? సావిత్రిది నిజంగా బాబా చెప్పిన జాతకమేనా..? వారి ప్రేమ గెలిచిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్రిస్తున్న సునీల్ రాంబాబు సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా మియాజార్జ్ పరవాలేదనిపించింది. స్టార్ కామెడియన్ గా ఎదుగుతున్న వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు : ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మనసుతాకే చిత్రాలను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో పాటు మంచి నటులు ఉన్నా.. వారి నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ రాబట్టలేకపోయారు. గిబ్రాన్ సంగీతం కూడా నిరాశపరిచింది. సినిమాటోగ్రఫి కాస్త ఊరట కలిగిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : పోసాని, వెన్నెల కిశోర్ ల కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం -
సమ్మర్లో సందడి
సమ్మర్లో థియేటర్‌కి వచ్చేవారికి నవ్వులు గ్యారంటీ అంటున్నారు సునీల్. ‘ఉంగరాల రాంబాబు’గా ఆయన టైటిల్ రోల్ చేసిన చిత్రం సమ్మర్లో రీలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మియా జార్జ్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ఇది. అలాగని కథకు పొంతన లేని కామెడీ పెట్టలేదు. కామెడీ కథలో భాగంగానే ఉంటుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ తనదైన మార్క్‌తో సునీల్ తరహా కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఉంగరాల రాంబాబుగా సునీల్ పర్ఫార్మెన్స్ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ఇందులో సునీల్ క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకూ ఆయన చేసిన లీడ్ రోల్స్ కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్ తదితరుల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. జిబ్రాన్ మంచి పాటలు ఇచ్చారు. త్వరలో టీజర్‌ను, పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
విజయ్ ఖాతాలో మరో క్రేజీ మూవీ
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, పెళ్లిచూపులు సక్సెస్‌తో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు లాంటి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ద్వారక సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్, ఆ సినిమా తరువాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో క్రాంతి మాధవ్ తెరకెక్కించే సినిమాలో హీరోగా నటిస్తాడు. -
సునీల్ కొత్త సినిమాకు కామెడీ టైటిల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
ఉంగరాల రాంబాబుగా సునీల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.