న్యూఇయర్‌ కానుక.. ‘రౌడీ’ టీజర్‌ రేపే! | Vijay Deverakonda World Famous Lover Movie Teaser Date Fix | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌ కానుక.. ‘రౌడీ’ టీజర్‌ రేపే!

Published Thu, Jan 2 2020 5:37 PM | Last Updated on Thu, Jan 2 2020 7:12 PM

Vijay Deverakonda World Famous Lover Movie Teaser Date Fix - Sakshi

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ భారీ హిట్లు సాధించి టాలీవుడ్‌లో సెన్సెషన్‌ అండ్‌ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. అయితే డియర్‌ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచి వెనుకబడ్డాడు. అయితే ఆ లోటును భర్తీ చేయడానికి  ఈ క్రేజీ స్టార్‌ ఏకంగా ప్రపంచ ప్రేమికుడి అవతారమెత్తిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచే ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌ లెవల్‌కు వెళ్లాయి. 

ఈ అంచనాలకు తోడు హీరోతో నలుగురు హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో చెప్పిన ప్రకారమే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’చిత్ర టీజర్‌ న్యూఇయర్‌ కానుకగా రేపు(శుక్రవారం) రిలీజ్‌ కానుంది. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించింది. 

అయితే సినిమా నాడిగా పేర్కొనే టీజర్‌, ట్రైలర్‌లతో దాదాపు చిత్ర భవిత్యం తెలిసిపోతుందంటారు. దీంతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌పై టాలీవుడ్‌ ఆసక్తిగా అంతకుమించి ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్‌ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల మందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement