స్టన్నింగ్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda World Famous Lover First Look Poster Released | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ

Published Fri, Sep 20 2019 7:23 PM | Last Updated on Fri, Sep 20 2019 7:34 PM

Vijay Devarakonda World Famous Lover First Look Poster Released - Sakshi

హీరో విజయ్‌ దేవరకొండ(ఫైల్‌ ఫోటో)

డియర్‌ కామ్రేడ్‌ తర్వాత సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. కేఎస్‌ రామారావు సమర్పణలో విజయ్‌ హీరోగా  రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్రేజీగా ఉన్న చిత్ర టైటిల్‌ సినీ వర్గాలతో పాటు అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. తాజాగా చిత్ర బృందం విజయ్‌ ఫ్యాన్స్‌కు మరో కానుకను అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

చిత్ర యూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్‌ యాంగ్రీగా, గాయాలతో కనిపిస్తాడు. దీంతో విజయ్‌ దేవరకొండ మరోసారి మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది. అయితే సినిమా టైటిల్‌ ఫిక్స్‌ చేశాక విజయ్‌ మరోసారి లవర్‌బాయ్‌గా కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇలా రఫ్‌గా కనిపించడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. డియర్‌ కామ్రేడ్‌ సినిమా నిరాశపరచడంతో విజయ్‌ దేవరకొండ ఈ సినిమాపైనే కొండంత ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా, మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన విజయం లేని క్రాంతి మాధవ్.. విజయ్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement