‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’టీజర్‌ ఎప్పుడంటే? | Vijay Deverakonda World Famous Lover Movie Teaser Date Announced | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’టీజర్‌ ఎప్పుడంటే?

Dec 13 2019 8:26 PM | Updated on Dec 13 2019 8:38 PM

Vijay Deverakonda World Famous Lover Movie Teaser Date Announced - Sakshi

విజయ్‌ దేవరకొండ అభిమానులకు తీపి కబురు తెలిపిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీం

సెన్సేషనల్ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్‌ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే విడుదలైన విజయ్‌ దేవరకొండ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్‌ కొత్త స్ట్రాటజీని అవలంభిస్తూ..  ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగేలా చేస్తోంది.  

ఈ సినిమాలోని నలుగురు హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ రోజుకో పోస్టర్‌ రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. గురువారం ఐశ్వర్యా రాజేశ్, విజయ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సువర్ణ అనే గృహిణి పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ అయిన ఇజబెల్లాతో కలిసి విజయ్‌ ఫ్రాన్స్‌ వీదుల్లో విహరిస్తున్న పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఇజ పాత్రలో ఇజ బెల్లా, గౌతమ్‌ పాత్రలో విజయ్‌లు ప్రేమికులుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన రెండో పో​స్టర్‌ విడుదలతో పాటు విజయ్‌ అభిమానులకు చిత్ర యూనిట్‌ మరో తీపి కబురు తెలిపింది. జనవరి 3న చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement