యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది. గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జేకే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment