విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌! | Vijay Devarakonda And Kranthi Madhav Movie Title Announced On 17th September | Sakshi
Sakshi News home page

రివీల్‌ కానున్న విజయ్‌ సినిమా టైటిల్‌

Published Mon, Sep 16 2019 6:44 PM | Last Updated on Mon, Sep 16 2019 6:44 PM

Vijay Devarakonda And Kranthi Madhav Movie Title Announced On 17th September - Sakshi

‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయాలని ఆశపడ్డ విజయ్‌ దేవరకొండకు భంగపాటే ఎదురైంది. ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న విజయ్‌ ఆశలకు డియర్‌ కామ్రేడ్‌ గండికొట్టింది. ఈ చిత్రంలో ఏకంగా దక్షిణాది మొత్తానికి తన స్టామినాను చూపించాలని ఆశపడ్డాడు. అయితే ఆ హీరో ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమొకటి. ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, క్యాథరిన్‌, ఇజబెల్లిలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. 

ఈ మూవీ గురించి ఎటువంటి అప్‌డేట్‌ రాకపోయేసరికి సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఈ చిత్ర నిర్మాత తాజాగా ఓ అప్‌డేట్‌ను ప్రకటించాడు. ఈ మూవీ టైటిల్‌ను రేపు (సెప్టెంబర్‌ 17) ఉదయం 11గంటలకు రివీల్‌ చేయనున్నుట్లు తెలిపాడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement