రౌడీ ఫ్యాన్స్‌కు లవ్‌ సాంగ్‌ గిఫ్ట్‌ | Vijay Devarakonda World Famous Lover Movie First Lyrical Song Out | Sakshi
Sakshi News home page

‘మై లవ్‌ మనసును మీటే’

Published Mon, Jan 20 2020 6:33 PM | Last Updated on Mon, Jan 20 2020 6:55 PM

Vijay Devarakonda World Famous Lover Movie First Lyrical Song Out - Sakshi

టాలీవుడ్‌ రౌడీ, క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై పాజిటీవ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా చిత్ర పోస్టర్లు, టీజర్‌లు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. టీజర్‌ చూసిన ప్రతీ ఒక్కరు ‘అర్జున్‌రెడ్డి ఈజ్‌ బ్యాక్‌’అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక మూవీ ఆరంభం నుంచే ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ కొత్త స్ట్రాటజీని అవలింభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి మరో అస్త్రాన్ని అభిమానులపై వదిలింది. ఈ సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పాటకు రహ్మాన్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రీక్రిష్ణ, రమ్య బెహరా ఆలపించారు. గోపీ సుందర్‌ డిఫరెంట్‌గా కంపోజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కేయస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

చదవండి:
బాలయ్య న్యూలుక్‌ అదిరింది!!
అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement