కమెడియన్గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్ను ఫైనల్ చేశారు.
సునీల్ కొత్త సినిమాకు కామెడీ టైటిల్
Published Sat, Jul 2 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement
Advertisement