Ungarala rambabu
-
నిర్మాతలతో ఆ ఒప్పందం కుదుర్చుకుంటా!
‘హీరోగా నటిస్తూనే నచ్చిన కామెడీ పాత్రలు చేయడానికి నేనేప్పుడూ రెడీ’ అని చాలా సందర్భాల్లో చెప్పాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు కామెడీ రోల్స్ చేయమని అవకాశాలు వచ్చాయి. అవి చేస్తే నేను హీరోగా చేసే సినిమాల నిర్మాతలకు సమస్య అవుతుందని అంగీకరించలేదు. ఇకపై నిర్మాతలు ఎవరైనా హీరోగా నటించమంటే, ఇతర సినిమాల్లో కామెడీ రోల్స్‌లో నటించేలా ఒప్పందం కుదుర్చుకుంటా’’ అన్నారు సునీల్. ఆయన హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న సునీల్ చెప్పిన విశేషాలు. ► నేను వ్యక్తిగతంగా ఉంగరాలు, జాతకాలను నమ్ముతాను. అందుకని ఈ టైటిల్ పెట్టలేదు. కథకు యాప్ట్ అవుతుందనే ఫిక్స్ చేశాం. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి ఆనందం కలిగింది. కథను నమ్మినందుకు మంచి రిజల్ట్ వచ్చింది. అయినా అపజయం అనేది కథకు ఉంటుంది.. కథానాయకుడికి కాదు. ►నా కెరీర్లో ‘జక్కన్న’ కమర్షియల్‌గా పెద్ద హిట్ మూవీ. ఆ సినిమా తర్వాత ఆ రేంజ్లో డబ్బులు కలెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. నేను వ్యవసాయం చేశాను కాబట్టి రైతుల కష్టాలేంటో నాకు తెలుసు. అందుకే సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రైతు డైలాగ్ చెప్పగలిగాను. ►తెలుగులో హాస్యనటులు చలం, రాజబాబు, రాజేంద్రప్రసాద్, హిందీలో గోవింద, మొహమూద్ హీరోలుగానూ రాణించారు. వారి ప్రేరణతోనే హీరోనయ్యా. ∙ ►చిరంజీవిగారి ‘సైరా నరసింహారెడ్డి’లో మంచి పాత్ర చేయబోతున్నాను. ఎన్. శంకర్ దర్శకత్వంలో చేసిన ‘టూ కంట్రీస్’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే తమిళ హిట్ ‘చతురంగ వేటై్ట’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నా. -
'సై రా' సునీల్..?
ఉంగరాల రాంబాబు సినిమాతో మరోసారి నిరాశపరిచిన హీరో సునీల్, ఇక క్యారెక్టర్ రోల్స్ లో నటించేందుకు రెడీ అని ప్రకటించేశాడు. త్వరలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తానని తెలిపిన సునీల్ ఓ భారీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'లో నటించే అవకాశం మిస్ చేసుకున్న ఈ కామెడీ స్టార్ ఇప్పుడు చిరు 151వ సినిమా 'సై రా నరసింహారెడ్డి'లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే పూర్తిగా సీరియస్ మోడ్ లో సాగే ఈ సినిమాలో సునీల్ ఏ తరహా పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ముందే చెప్పినట్టుగా కమెడియన్ రోల్ లో నటిస్తాడా..? లేక సీరియస్ పాత్రలోనే కనిపిస్తాడా చూడాలి. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి హేమా హేమీలు నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. -
'ఉంగరాల రాంబాబు' రివ్యూ
టైటిల్ : ఉంగరాల రాంబాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, మియా జార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రాజ్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : క్రాంతి మాధవ్ నిర్మాత : పరుచూరి కిరిటీ హాస్య నటుడిగా మంచి ఫాంలో ఉండగా హీరోగా మారిన సునీల్ చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు వచ్చినా.. ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. వరుస అపజయాలతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ కామెడీ స్టార్.. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఉంగరాల రాంబాబు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దర్శకుడిగా క్లీన్ ఇమేజ్ ఉన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సునీల్ కెరీర్ ను గాడిలో పెట్టిందా..? క్రాంతి మాధవ్ మరోసారి ఆకట్టుకున్నాడా...? కథ : కోటీశ్వరుడైన రాంబాబు (సునీల్) తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయిన రోడ్డున పాడతాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రాంబాబుకు జనాల్ని మోసం చేస్తూ బతికే దొంగ బాబా బాదం బాబా(పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. రాంబాబు ను చూసిన బాదం బాబా నేను చెప్పినట్టు చేస్తే నీ డబ్బు నీకు తిరిగొస్తుందని చెబుతాడు. అలా బాదం బాబా చెప్పిన పనికి వెళ్లిన రాంబాబు కు భారీగా బంగారం దొరుకుతుంది. దీంతో బాబా మీద నమ్మకం మరింత పెరుగుతుంది. జాతకాల మీద విపరీతమైన నమ్మకంతో రాంబాబు.. ఉంగరాల రాంబాబుగా మారిపోతాడు. అయితే తిరిగి కోటీశ్వరుడైన రాంబాబుకు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసే జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాబా చెప్తాడు. దీంతో బాబా చెప్పిన జాతకం కలిగిన సావిత్రి (మియా జార్జ్)ను ప్రేమిస్తాడు. అలా డబ్బు కోసం ప్రేమలో పడ్డ రాంబాబు అనుకున్నది సాధించాడా.? సావిత్రిది నిజంగా బాబా చెప్పిన జాతకమేనా..? వారి ప్రేమ గెలిచిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్రిస్తున్న సునీల్ రాంబాబు సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా మియాజార్జ్ పరవాలేదనిపించింది. స్టార్ కామెడియన్ గా ఎదుగుతున్న వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు : ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మనసుతాకే చిత్రాలను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఏ మాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో పాటు మంచి నటులు ఉన్నా.. వారి నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ రాబట్టలేకపోయారు. గిబ్రాన్ సంగీతం కూడా నిరాశపరిచింది. సినిమాటోగ్రఫి కాస్త ఊరట కలిగిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : పోసాని, వెన్నెల కిశోర్ ల కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం -
మరో సూపర్ హిట్ రీమేక్‌లో సునీల్
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు సునీల్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను ఓ తమిళ నిర్మాతతో కలిసి శివలెంక శివప్రసాద్ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాను అడవి శేష్ హీరోగా రీమేక్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సునీల్ పేరు తెర మీదకు వచ్చింది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా... సెట్స్ మీద ఉన్న 2 కంట్రీస్ రీమేక్ పూర్తయిన వెంటనే ఈ రీమేక్ పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. -
ఉంగరాల రాంబాబు ప్రీరిలీజ్ ఫంక్షన్
-
డబ్బే ముఖ్యం కాదు
సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా క్రాంతిమాధవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో పిసినారి. డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తి.. మనిషికి డబ్బే ముఖ్యం కాదనుకునే స్థితికి ఎలా వచ్చాడన్నదే కథ. మనం అనుకునే స్వభావం మనలో తక్కువగా ఉంటుంది. నేను అనుకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. నేను నుంచి మనంగా మారడమే సినిమా. ‘ఓనమాలు’ చేశాక నేను వంద సినిమాలైతే చేయలేనని అర్థం అయ్యింది. పది సినిమాలైతే చేస్తాననే నమ్మకం ఉంది. ఆ పది సినిమాల్లో అన్ని జోనర్లలో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. నేను విద్యార్థిగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా సినిమాల గురించి మంచిగానో, చెడుగానో రాశారంటే అందులో నుంచి నేనూ కాస్త నేర్చుకోవాలి. సాధారణ జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ కథ రాయడానికో, సినిమా తీయడానికో కావాల్సినంత సామర్థ్యం ఉంటుంది. రెగ్యులర్ సినిమాను చూపించాలనుకున్నప్పుడు అది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలనేదే నా ఆలోచన. సునీల్ ఈ చిత్రంలో రాంబాబు పాత్రలో ఒదిగిపోయారు’’ అని చెప్పారు. తదుపరి విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా అని క్రాంతిమాధవ్ అన్నారు. -
ఉంగరాల’కి వాయిస్
ఒక హీరో సినిమాకి మరో హీరో మాట సాయం చేయడం కామన్‌గా జరుగుతుంటుంది. అయితే, ఓ హీరో సినిమాకి నిర్మాత మాట సాయం చేయడం విశేషం. సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిర్మాత ‘దిల్’ రాజు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. పరుచూరి కిరీటి మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే మా సినిమాకి మాట సాయం చేసేందుకు అంగీకరించిన రాజుగారికి ధన్యవాదాలు. ఆయనతోనే వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ప్రత్యేకత ఉంది. అది సినిమా రిలీజ్ రోజే తెలుస్తుంది. సినిమా విషయానికొస్తే.. కామెడీ అంటే ఏదో çసపరేట్గా వచ్చే ట్రాక్‌లు కాకుండా కథలో ఇమిడి ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్లో వచ్చే డైలాగ్ ఈ దేశాన్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత సునీల్ పాత్ర నవ్విస్తూ, ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, అలీ, ‘వెన్నెల’ కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: జిబ్రాన్, కెమెరా: సర్వేశ్ మురారి. -
సునీల్ డ్యాన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది
– వీవీ వినాయక్ ‘‘సునీల్ నాకు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ తెలుసు. తనలో మంచి డ్యాన్సర్ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తనలోని నృత్య ప్రతిభను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. తెరపై సునీల్ డ్యాన్సులు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా హిట్ అయి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అని దర ్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్‌ను వినాయక్ విడుదల చేశారు. సునీల్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఎప్పటికైనా సక్సెస్ అవుతామని నేను, వినాయక్‌గారు అనుకునేవాళ్లం. అలాగే అయ్యాం. నా చిత్రాల్లో కామెడీ ఉండటం కామన్. కానీ, ‘ఉంగరాల రాంబాబు’లో మరింత ఎక్కువ వినోదం ఉంటుంది. ఈ సినిమాతో క్రాంతిమాధవ్‌గారు గొప్ప దర్శకుల జాబితాలో చేరతారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రెండు, మూడు పాయింట్లను కలిపి ఈ సినిమా చేశా. వైవిధ్యమైన కామెడీ అలరిస్తుంది. పోసానిగారి పాత్ర హైలెట్. జిబ్రాన్ మంచి సంగీతం అందించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. పరుచూరి కిరీటి, మియాజార్జ్ పాల్గొన్నారు. -
భూగోళం ఊగేలా...
సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరిటీ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఇందులోని తొలి పాట ‘హూలాలా హూలాలా... భూగోళం ఊగేలా...’ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సునీల్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు నన్నెప్పుడూ ‘అందాల రాముడు’ అని పిలిచేవారు. ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి పది నిమిపాలు గడిపితే నాలో కొత్త ఉత్సాహం వచ్చేది. ఈ వేడుకకు దాసరిగారు వచ్చినట్లుగా భావిస్తున్నా. ఈ పాటను ఆయనకు అంకితం ఇస్తున్నాం. సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇకపై, ప్రతి మూడు రోజులకు ఒక్కో పాటను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘సునీల్‌గారి నటన, డ్యాన్స్ సూపర్. మంచి కథ, కథనంతో దర్శకుడు సినిమా తీశారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు పరుచూరి కిరీటి. ఈ సినిమాలో మియా జార్జ్ హీరోయిన్గా, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించారు. -
రాంబాబు రాత మారిందా?
తలరాత మారాలంటే చేతి గీతలు అరిగేలా కష్టపడాలంటారు. కానీ మనోడు గీతలు అరగకుండా చూసుకునే టైప్. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే చాలు అలిగి వెళ్ళిన అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని నమ్మే రకం. అంతే కాదండోయ్ అడ్రస్ పొరపాటున కూడా మిస్ అవ్వకూడదని వేలకు వేలు పెట్టి ప్రతి వేలికీ ఓ ఉంగరం పెట్టుకుంటాడు. మరి రాంబాబుని అదృష్టలక్ష్మి వరించిందా? అతని రాత మారిందా? ఉంగరాలు అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. మియాజార్జ్ కథానాయిక. యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై పరుచూరి కిరిటీ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే చివరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘మంచి వినోదాత్మక చిత్రమిది. సునీల్ కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకులు క్రాంతి మాధవ్ అద్భుతంగా తెరకెక్కించారు. మియాజార్జ్ నటన సినిమాకు ఫ్లస్ పాయింట్. జిబ్రాన్ మంచి పాటలిచ్చారు’’ అని అన్నారు. -
సమ్మర్లో సందడి
సమ్మర్లో థియేటర్‌కి వచ్చేవారికి నవ్వులు గ్యారంటీ అంటున్నారు సునీల్. ‘ఉంగరాల రాంబాబు’గా ఆయన టైటిల్ రోల్ చేసిన చిత్రం సమ్మర్లో రీలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మియా జార్జ్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ఇది. అలాగని కథకు పొంతన లేని కామెడీ పెట్టలేదు. కామెడీ కథలో భాగంగానే ఉంటుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ తనదైన మార్క్‌తో సునీల్ తరహా కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఉంగరాల రాంబాబుగా సునీల్ పర్ఫార్మెన్స్ అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ఇందులో సునీల్ క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకూ ఆయన చేసిన లీడ్ రోల్స్ కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్ తదితరుల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. జిబ్రాన్ మంచి పాటలు ఇచ్చారు. త్వరలో టీజర్‌ను, పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
'ఉంగరాల రాంబాబు' మూవీ స్టిల్స్
-
జీవితం అంటే ఆట!
పేరు ఉంగరాలు రాంబాబు. ఓహో.. ఉంగరాల వ్యాపారం చేస్తాడేమో అనుకుంటున్నారా? అబ్బే అలాంటిదేం లేదు. మనోడికి జాతకాలంటే మహా నమ్మకం. అందుకే ఆ రాయి.. ఈ రాయి.. అంటూ రాళ్ల ఉంగరాలతో వేళ్లను నింపేసుకున్నాడు. కామెడీ హీరో సునీల్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఉంగరాల రాంబాబు’. పేరుకే కామెడీ హీరో కానీ.. రెగ్యులర్ కమర్షియల్ హీరోలు చేసే రేంజ్లో సునీల్ డాన్సులు చేస్తారు. అందుకే ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సాంగ్‌ని భారీగానే ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ‘లైఫ్ అంటే ఆట..’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్ మాస్టర్ భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన చెప్పిన కొత్త స్టెప్పులను సునీల్ ట్రై చేస్తున్నారు. ‘‘ఇది పెప్పీ నంబర్. సినిమాలో మొదటి సాంగ్. చాలా సై్టల్‌గా ఉండటం కోసం సెపరేట్ లైటింగ్ స్కీమ్‌తో సెట్ వేసాం’’ అని ఆర్ట్ డైరక్టర్ ఏయస్ ప్రకాష్ చెప్పారు. అన్నట్లు రాంబాబుకి లవర్ లేదా? లేకేం. ఉందండి. ఇందులో మియా జార్జ్ కథానాయికగా నటిస్తున్నారు. రాంబాబు ఈవిడగారికి ఉంగరం తొడగటానికి చాలా ఫీట్లే చేస్తాడేమో. ఈ సమ్మర్లోనే రాంబాబు సందడి చేయడానికి రాబోతున్నాడు. -
'ఉంగరాల రాంబాబు' లోకేషన్ కవరేజ్
-
ఉంగరాల కథేంటి?
అతడి పేరు రాంబాబు. కానీ, జనాలందరూ ‘ఉంగరాల రాంబాబు’ అంటేనే గుర్తు పడతారు. అతడి చేతికి అన్ని ఉంగరాలుంటాయ్ మరి! ఆ ఉంగరాల కథేంటి? జాతకాలపై నమ్మకమా లేదా రాంబాబు హోదాకి చిహ్నమా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు సునీల్. ఆయన హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం రథ సప్తమి సందర్భంగా చిత్ర ప్రచార రథాన్ని సంస్థ కార్యాలయంలో ప్రారంభించి, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘వాణిజ్య హంగులతో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. సునీల్ నటన, ఆయన పాత్ర కొత్తగా ఉంటాయి. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రాల తర్వాత క్రాంతి మాధవ్ తీస్తున్న ఈ చిత్రంలో ఆయన శైలిలో సాగే హృదయా నికి హత్తుకునే భావోద్వేగా లుంటాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, వేసవికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. మియా జార్జ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: సర్వేశ్ మురారి, శ్యామ్ కె. నాయుడు, సంగీతం: జిబ్రాన్. -
సునీల్ కొత్త సినిమాకు కామెడీ టైటిల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
ఉంగరాల రాంబాబుగా సునీల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.