మరో సూపర్ హిట్ రీమేక్లో సునీల్ | Sunil in Saduranga Vettai remake | Sakshi

మరో సూపర్ హిట్ రీమేక్లో సునీల్

Sep 14 2017 12:29 PM | Updated on Sep 19 2017 4:33 PM

మరో సూపర్ హిట్ రీమేక్లో సునీల్

మరో సూపర్ హిట్ రీమేక్లో సునీల్

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది.  తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు సునీల్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది.

వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను ఓ తమిళ నిర్మాతతో కలిసి శివలెంక శివప్రసాద్ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాను అడవి శేష్ హీరోగా రీమేక్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సునీల్ పేరు తెర మీదకు వచ్చింది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా... సెట్స్ మీద ఉన్న 2 కంట్రీస్ రీమేక్ పూర్తయిన వెంటనే ఈ రీమేక్ పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement