Sathuranga Vettai
-
నా టీమ్‌కు సక్సెస్ రావాలి
ఆశ అత్యాశగా మారినప్పుడే అనర్థాలు ఏర్పడతాయి. అలాంటి అత్యాశపరులను టార్గెట్ చేసే వ్యక్తి కథే ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ సినిమాకు అఫీషియల్ రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో సత్య దేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు పూరి జగన్నాథ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘గణేశ్ దర్శకుడిగా నాకు ఇష్టం. నా ప్రొడక్షన్లో ఓ సినిమా చేశాడు. సత్య, సునీల్ కశ్యప్ ఇలా నా టీమ్ మెంబర్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కృష్ణప్రసాద్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘డబ్బింగ్ పూర్తయింది. ఈ నెలలోనే పాటలు, టీజర్‌ను రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘మా బాస్ పూరిగారి చేతుల మీదగా లోగో రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఆయన పుట్టిన రోజే ఈ సినిమా రిలీజ్ కావడం ఇంకా హ్యాపీ. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న సినిమాలో హీరోగా చేయడం నా అదృష్టం’’ అన్నారు సత్యదేవ్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. కెమెరా: దాశరధి శివేంద్ర, డైలాగ్స్: పులగం చిన్నారాయణ. -
తమిళ సూపర్ హిట్ రీమేక్ 'బ్లఫ్ మాస్టర్'
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ సినిమా చతురంగ వేట్టై. ఈ సినిమాతో తెలుగులో గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రీమేక్ చేశారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందితా శ్వేత హీరోయిన్గా నటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . ప్రస్తుతం తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు , వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’ అని అన్నారు. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘రోజూ ఏ పేపర్లో చదివినా , ఏ టీవీ ఛానల్లో చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది’ అన్నారు. -
చేతులు మారిన ఇంట్రస్టింగ్ రీమేక్
కోలీవుడ్ ఘనవిజయం సాధించిన శతురంగ వేట్టై సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను అడివి శేష్ హీరోగా రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే శేష్, గూఢచారి సినిమాతో బిజీగా కావటంతో ఈ రీమేక్ సునీల్ చేతికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమా సునీల్ నుంచి మరో నటుడి చేతికి వెళ్లింది. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా మారిన యువ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం 47 డేస్, గువ్వా గోరింక సినిమాల్లో నటిస్తున్నాడు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సత్యదేవ్ శతురంగ వేట్టై రీమేక్ లో నటించనున్నాడు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై గోపీ గణేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
మరో సూపర్ హిట్ రీమేక్‌లో సునీల్
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు సునీల్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను ఓ తమిళ నిర్మాతతో కలిసి శివలెంక శివప్రసాద్ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాను అడవి శేష్ హీరోగా రీమేక్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా సునీల్ పేరు తెర మీదకు వచ్చింది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా... సెట్స్ మీద ఉన్న 2 కంట్రీస్ రీమేక్ పూర్తయిన వెంటనే ఈ రీమేక్ పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. -
రీమేక్ సినిమాతో వస్తున్న హ్యాండ్సమ్ హీరో
క్షణం సినిమాతో సైలెంట్ హిట్ కొట్టిన అడవి శేష్.. మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన చిన్న సినిమా చతురంగ వేట్టైని తెలుగు రీమేక్ చేస్తున్నాడు శేష్. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యం హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. వినోద్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను గోపి గణేష్ దర్శకత్వంలో తెలుగులో రూపొందిస్తున్నారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్‌లో సినిమాను ప్రారంభించి జూలైలో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
రేపు ‘చ దురంగ వేట్టై’ మొదలు
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో చదురంగ వేట్టై మొదలవుతోంది. సీనియర్ హాస్యనటుడు దర్శకుడు మనోబాల నిర్మించిన చిత్రం చదురంగ వేట్టై. నటరాజ్, ఇషారా నాయక్ జంటగా నటించిన ఈ చిత్రానికి వినోద్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ అధినేతలు దర్శకుడు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ విడుదల చేస్తున్నారు. చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ఇటీవల తమ సంస్థ ద్వారా విడుదలైన గోలీసోడా, మంజాపై చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ప్రస్తుతం సూర్య, సమంత హీరో హీరోయిన్లుగా అంజాన్ చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నానని చెప్పారు. దీంతో ప్రస్తుతానికి ఇతర చిత్రాలను విడుదల చేయరాదని భావించానన్నారు. అయితే కొందరి ఒత్తిడి మేరకు చదురంగ వేట్టై చిత్రం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా అర్ధ నిద్రతోనే చూడటానికి సిద్ధమయ్యానని చెప్పారు. అయితే చిత్రం చూస్తుంటే నిద్రమత్తు వదలిపోయిందన్నారు. అంత ఆసక్తిగా చిత్రం సాగటంతో వెంటనే చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుంకి, వళక్కు ఎన్ 18/9 చిత్రం మాదిరిగా ఈ చిత్రం తిరుపతి బ్రదర్స్ సంస్థలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. నటీనటులందరూ చక్కగా నటించారని చదురంగ వేట్టై ఖచ్చితంగా జనరంజకంగా ఉంటుందని లింగుస్వామి పేర్కొన్నారు.