ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ సినిమా చతురంగ వేట్టై. ఈ సినిమాతో తెలుగులో గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రీమేక్ చేశారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందితా శ్వేత హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . ప్రస్తుతం తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు , వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’ అని అన్నారు.
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘రోజూ ఏ పేపర్‌లో చదివినా , ఏ టీవీ ఛానల్లో చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment