Bluffmaster
-
ఏదో సరదాగా...
‘‘లాక్డౌన్లో మా బాస్ ఏజ్ డౌన్ అయిపోయింది’’ అంటూ చిరంజీవి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దానికి కారణం రెండు రోజుల క్రితం బయటికొచ్చిన ఫొటో. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి, ‘బాగుంది’ అంటూ ఆ చిత్రదర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించి, అభినందించారు చిరంజీవి. అప్పుడు చిరు, గోపీ గణేష్ దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మీసాలు లేకుండా మెగాస్టార్ క్లీన్ షేవ్‌తో కనిపించారు. లాక్డౌన్లో చిరంజీవి మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూసినవాళ్లు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో ఒక గెటప్ ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం గురించి చిరంజీవిని ‘సాక్షి’ అడిగితే – ‘‘ఆ సినిమాకి, ఈ లుక్‌కి సంబంధం లేదు. ఏదో సరదాగా’’ అంటూ, బుధవారం దిగిన లేటెస్ట్ ఫొటోను కూడా షేర్ చేశారు. మామూలుగా షూటింగ్స్ ఉన్నప్పుడు స్టార్స్ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారు. షూటింగ్స్ లేని సమయంలో.. ముఖ్యంగా ఇలా నెలల తరబడి షూటింగ్స్ లేకపోతే మాత్రం కొందరు వర్కవుట్స్‌కి కాస్త బ్రేక్ ఇస్తారు. బట్.. ఈ లాక్డౌన్ బ్రేక్‌లోనూ ‘వర్కవుట్స్‌కి నో బ్రేక్’ అంటున్నారు చిరంజీవి. -
అప్పుడు పదహారు కేజీలు తగ్గాను
‘‘కథే హీరో అని ఫీల్ అవుతాను. అందుకే కేవలం హీరో పాత్రలే చేయాలని ఇండస్ట్రీకి రాలేదు నేను. ఆసక్తికరంగా ఉండే లీడ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉండాలనుకుని వచ్చాను. నా వల్ల కథకు ఓ ఇంపార్టెన్స్ ఉండాలనుకుంటాను. ఆ ప్రాసెస్‌లో నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తున్నాను. ఐడియాలజీ డిఫరెంట్‌గా ఉన్న నెగటీవ్ పాత్రలు చేయడానికి కూడా ఓకే’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన సంగతులు. ► పేదవాడికి, ధనవంతుడికి పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. మధ్యతరగతివారు అవకాశాల కోసం చూస్తుంటారు అందుకే వారిని టార్గెట్ చేసి మోసం చేయడానికి కొందరు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి అంశాల ఆధారంగానే మా ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం రూపొందింది. ఉత్తమ్ కుమార్, కెప్టెన్ సాగర్, కుభేర గోస్వామి, ఆకాష్ విహారి అని ఇలా డిఫరెంట్ పేర్లతో మోసం చేసే క్యారెక్టర్లో నేను నటించాను. డబ్బంటే ఇష్టం ఉన్న హీరో జీవితంలోకి డబ్బంటే విపరీతమైన ఇష్టం ఉన్న విలన్ వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? అనేవి సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. రెండు జీవితాలు ఉండే గొంగళిపురుగు లాంటి క్యారెక్టర్ హీరోది. ► దర్శకుడు గోపీ గణేశ్ అన్న ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఆయనకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు. నిర్మాత రమేష్ పిళ్లైగారు తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌గారు. కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో ధనశెట్టి పాత్రలో పృథ్వీరాజ్గారు బాగా నటించారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా ‘అర్జున్‌రెడ్డి’ రేంజ్లో ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని ఆయన అనడం హ్యాపీగా ఉంది. ఆ నమ్మకం మాకూ ఉంది. ఈ చిత్రంలో కోర్టు ఎపిసోడ్ బాగా వచ్చింది. సినిమా రిలీజయ్యాక నచ్చితే ఆడియన్స్ చిన్న క్లాప్ కొట్టాలని కోరుకుంటున్నాను. ► ‘అంతరిక్షం’, ‘మెంటల్‌మదిలో..’ లాంటి డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాను. డైరెక్టర్స్ ఎలా కావాలంటే ఆ లుక్‌లోకి మారిపోతా. పూరిగారి ‘జ్యోతిలక్ష్మి’ ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నాతో పాటు దాదాపు 500 మంది పోటీపడ్డారు. అప్పుడు నా వెయిట్ 90 కేజీలు. పూరిగారు నన్ను చూసి వెయిట్ తగ్గి రమ్మన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గి ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పుడు నువ్వే లీడ్ యాక్టర్ అన్నారు. అప్పట్నుంచి నా కెరీర్లో చేంజ్ వచ్చింది. ► నేను హీరోగా ‘మెంటల్‌మదిలో..’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా, ‘గువ్వా గోరింకా’, ‘47’ సినిమాలు చేస్తున్నాను. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఓ హిందీ చిత్రంలో లీడ్ యాక్టర్‌గా చేస్తున్నా. -
పూరీగారు విజిల్స్ పడతాయన్నారు
‘‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనబడరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇది తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కు రీమేక్ అయినా కూడా అందులో నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితా శ్వేతా జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ చెప్పిన విశేషాలు. ► కెమెరామేన్ అవ్వాలని ఇండస్ట్రీకు వచ్చాను. నాకో యాడ్ ఏజెన్సీ ఉంది. యాడ్స్ రూపొందిస్తూ సినిమా కథలు తయారు చేసుకుంటుంటాను. సాయిరామ్ శంకర్ ‘రోమియో’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘చతురంగ వేటై్ట’ సినిమాకు ప్రేరణ మా గురువుగారు పూరి జగన్నాథ్ తీసిన ‘బిజినెస్‌మేన్’ చిత్రమే. అందులో మహేశ్‌బాబు, నాజర్‌గారు బ్యాంక్ ఓపెనింగ్ సన్నివేశంలో మాట్లాడే సందర్భం ఆధారంగా ‘చతురంగ వైటై్ట’ను రూపొందించారట వినోద్. గురువుగారి సినిమా ప్రేరణతో తీశారు కాబట్టి ఈ సినిమా రీమేక్ చేసే అర్హత నాకే ఉందని ఫీల్ అయ్యాను. ► ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఒరిజినల్ చూసి, ఆ దర్శకుడినీ కలిశాను. కొన్ని మార్పులు చేశాను. హీరో పాత్ర, డైలాగ్స్ సొంతంగా రాసుకున్నాను. అడిషనల్ డైలాగ్స్ పులగం చిన్నారాయణగారు అందించారు. సత్యదేవ్ కంటే ముందే ఇద్దరు ముగ్గురు హీరోలు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. వేరే హీరోలు కథ మార్చమన్నారు. నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ఈ సినిమాకు సత్యదేవ్ కరెక్ట్‌గా సూట్ అవుతాడని ఫస్ట్ నుంచి అనుకున్నాను. టెస్ట్ షూట్లో కృష్ణప్రసాద్‌గారు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా టీమ్ అందరూ నా డైలాగ్స్‌కు ఫ్యాన్ అయ్యారు. పూరీగారు కూడా నా డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయన్నారు. సునీల్ కశ్యప్ సినిమాను తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు మాత్రం మా సినిమా చూసి మోసపోడు. -
సమాజానికి దగ్గరగా బ్లఫ్‌మాస్టర్
‘‘సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు. వారి వల్ల పలువురు మోసపోతున్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ గోపీ గణేష్ ఈ సినిమా బాగా తీశారు. ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉన్న సినిమా ‘బ్లఫ్‌మాస్టర్’. ప్రజల్లో చైతన్యం ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వీ ముఖ్య తారలుగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌మాస్టర్’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీ గణేశ్ పట్టాభి మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం పృథ్వీ చాలా కష్టపడ్డారు. సునీల్ కశ్యప్ సంగీతం వింటే రెహమాన్ సంగీతం చేశారా? అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. దో నంబర్ అనే బిజినెస్‌లో మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తుంటారు’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు), కెమెరా: దాశరథి శివేంద్ర. -
మంచి చేసే మాస్టర్
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్’ వంశీ, ‘దిల్’ రమేశ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రమేష్.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్ మాస్టర్’ కథకు సత్యదేవ్ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు). ∙ -
ఘరానా మోసగాడు
‘జ్యోతిలక్ష్మీ, ఘాజీ’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. నందితా శ్వేత కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించారు. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చితీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్ మాట్లాడుతూ– ‘‘ఎవరో నలుగరు రచయితలు నాలుగు గోడల మధ్య కూర్చుని రాసిన కథ కాదిది. వాస్తవాలను కథగా మలిచి సినిమా చేశాం. మాయ మాటలు చెప్పి మోసగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన తర్వాత అయ్యో మోసపోయాం అని బాధితులు బాధపడుతున్నారు. ఇలాంటి వాటికి ప్రతిరూపమే ఈ సినిమా. ఇందులో ఘరానా మోసగాడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. సత్య బాగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పాటలను రిలీజ్ చేస్తాం. నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అన్నారు రమేష్. ఫృథ్వీ, బ్రహ్మాజీ, ఆదిత్యామీనన్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్.డి. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
నా టీమ్‌కు సక్సెస్ రావాలి
ఆశ అత్యాశగా మారినప్పుడే అనర్థాలు ఏర్పడతాయి. అలాంటి అత్యాశపరులను టార్గెట్ చేసే వ్యక్తి కథే ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’ సినిమాకు అఫీషియల్ రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో సత్య దేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు పూరి జగన్నాథ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘గణేశ్ దర్శకుడిగా నాకు ఇష్టం. నా ప్రొడక్షన్లో ఓ సినిమా చేశాడు. సత్య, సునీల్ కశ్యప్ ఇలా నా టీమ్ మెంబర్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. కృష్ణప్రసాద్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘డబ్బింగ్ పూర్తయింది. ఈ నెలలోనే పాటలు, టీజర్‌ను రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘మా బాస్ పూరిగారి చేతుల మీదగా లోగో రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ఆయన పుట్టిన రోజే ఈ సినిమా రిలీజ్ కావడం ఇంకా హ్యాపీ. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న సినిమాలో హీరోగా చేయడం నా అదృష్టం’’ అన్నారు సత్యదేవ్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. కెమెరా: దాశరధి శివేంద్ర, డైలాగ్స్: పులగం చిన్నారాయణ. -
తమిళ సూపర్ హిట్ రీమేక్ 'బ్లఫ్ మాస్టర్'
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ సినిమా చతురంగ వేట్టై. ఈ సినిమాతో తెలుగులో గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రీమేక్ చేశారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందితా శ్వేత హీరోయిన్గా నటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రమేష్ పిళ్లై మాట్లాడుతూ ‘తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై లారెన్స్ నటించిన శివలింగ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము . ప్రస్తుతం తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగులో రీమేక్ చేశాం . చిత్రీకరణ పూర్తయింది. కొడైకెనాల్, కర్నూలు , వైజాగ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం . ఎక్కడా రాజీపడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . పాటలను జులై నెలాఖరున, చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’ అని అన్నారు. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘రోజూ ఏ పేపర్లో చదివినా , ఏ టీవీ ఛానల్లో చూసినా 90 శాతం మోసాల గురించే ఉంటాయి. మనిషికి ఆశ సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే నేరాలు జరుగుతాయి. అత్యాశ ఉన్న ప్రతి చోటా ఒక బ్లఫ్ మాస్టర్ ఉంటాడు. ఆ నేపథ్యం లోనే ఈ సినిమా ఉంటుంది. బ్లఫ్ మాస్టర్ గా సత్యదేవ్ అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా లైవ్లీ గా ఉంటుంది’ అన్నారు.