ఏదో సరదాగా... | Chiranjeevi is all praises for Bluff Master director Gopi Ganesh | Sakshi
Sakshi News home page

ఏదో సరదాగా...

Published Thu, Jul 23 2020 12:54 AM | Last Updated on Thu, Jul 23 2020 1:48 AM

Chiranjeevi is all praises for Bluff Master director Gopi Ganesh - Sakshi

చిరంజీవి

‘‘లాక్‌డౌన్‌లో మా బాస్‌ ఏజ్‌ డౌన్‌ అయిపోయింది’’ అంటూ చిరంజీవి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దానికి కారణం రెండు రోజుల క్రితం బయటికొచ్చిన ఫొటో. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా చూసి, ‘బాగుంది’ అంటూ ఆ చిత్రదర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించి, అభినందించారు చిరంజీవి. అప్పుడు చిరు, గోపీ గణేష్‌ దిగిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

మీసాలు లేకుండా మెగాస్టార్‌ క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. లాక్‌డౌన్‌లో చిరంజీవి మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లుక్‌ చూసినవాళ్లు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో ఒక గెటప్‌ ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం గురించి చిరంజీవిని ‘సాక్షి’ అడిగితే – ‘‘ఆ సినిమాకి, ఈ లుక్‌కి సంబంధం లేదు. ఏదో సరదాగా’’ అంటూ, బుధవారం దిగిన లేటెస్ట్‌ ఫొటోను కూడా షేర్‌ చేశారు. మామూలుగా షూటింగ్స్‌ ఉన్నప్పుడు స్టార్స్‌ క్రమం తప్పకుండా వర్కవుట్స్‌ చేస్తారు. షూటింగ్స్‌ లేని సమయంలో.. ముఖ్యంగా ఇలా నెలల తరబడి షూటింగ్స్‌ లేకపోతే మాత్రం కొందరు వర్కవుట్స్‌కి కాస్త బ్రేక్‌ ఇస్తారు. బట్‌.. ఈ లాక్‌డౌన్‌ బ్రేక్‌లోనూ ‘వర్కవుట్స్‌కి నో బ్రేక్‌’ అంటున్నారు చిరంజీవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement