gopi ganesh
-
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్
‘‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు గోపీ గణేష్ విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. ⇔ ‘గాడ్సే’ సినిమా ఫ్లాష్‌బ్యాక్ సీన్లో ఓ డ్రామా ఉంటుంది. అదేంటంటే.. గాంధీ పాత్రధారిని గాడ్సే కాల్చాలి. కానీ గాడ్సే పాత్రధారి అయిన చిన్నపిల్లవాడు బొమ్మ తుపాకీతో కూడా గాంధీ పాత్రధారిని కాల్చి చంపడానికి అంగీకరించకుండా తుపాకీని కిందకు దించుతాడు. అలాంటి పిల్లవాడు పెద్దవాడు అయ్యాక రియల్ గన్స్‌తో ఎందుకు సహవాసం చేయాల్సి వస్తుంది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల అతని వ్యక్తిత్వం, ఆలోచనా తీరు మారింది? అన్నదే కథాంశం. ⇔ ఈ కథను చెప్పేందుకు ఓ బ్యాచ్ రీ యూనియన్ అవుతున్నట్లుగా బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాను. ఓ సర్వే ప్రకారం చదువుకున్న అర్హతకు తగ్గ ఉద్యోగం చేస్తున్నవారు కేవలం 6.37 శాతం మంది మాత్రమే అని, మిగిలినవారు చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని కాస్త సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. ఎవర్నీ టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు. ఆలోచించాల్సిన అంశంగా తీసిన చిత్రం మాత్రమే. ⇔నిజానికి ‘గాడ్సే’ కథను పవన్ కల్యాణ్‌గారికి అనుకున్నాను. కానీ ఆయనతో చేయలేకపోయాను. ఈ కథను సత్యదేవ్గారికి చెప్పినప్పుడు సీరియస్ సబ్జెక్ట్ అన్నారు. కానీ ఓకే చేశారు. ఓ కామన్‌మేన్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ప్రతి కామన్ మేన్ కనెక్ట్ అవుతాడనే నమ్మకం ఉంది. -
ఏదో సరదాగా...
‘‘లాక్డౌన్లో మా బాస్ ఏజ్ డౌన్ అయిపోయింది’’ అంటూ చిరంజీవి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దానికి కారణం రెండు రోజుల క్రితం బయటికొచ్చిన ఫొటో. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి, ‘బాగుంది’ అంటూ ఆ చిత్రదర్శకుడు గోపీ గణేష్‌ను ఇంటికి పిలిపించి, అభినందించారు చిరంజీవి. అప్పుడు చిరు, గోపీ గణేష్ దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మీసాలు లేకుండా మెగాస్టార్ క్లీన్ షేవ్‌తో కనిపించారు. లాక్డౌన్లో చిరంజీవి మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూసినవాళ్లు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో ఒక గెటప్ ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం గురించి చిరంజీవిని ‘సాక్షి’ అడిగితే – ‘‘ఆ సినిమాకి, ఈ లుక్‌కి సంబంధం లేదు. ఏదో సరదాగా’’ అంటూ, బుధవారం దిగిన లేటెస్ట్ ఫొటోను కూడా షేర్ చేశారు. మామూలుగా షూటింగ్స్ ఉన్నప్పుడు స్టార్స్ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారు. షూటింగ్స్ లేని సమయంలో.. ముఖ్యంగా ఇలా నెలల తరబడి షూటింగ్స్ లేకపోతే మాత్రం కొందరు వర్కవుట్స్‌కి కాస్త బ్రేక్ ఇస్తారు. బట్.. ఈ లాక్డౌన్ బ్రేక్‌లోనూ ‘వర్కవుట్స్‌కి నో బ్రేక్’ అంటున్నారు చిరంజీవి. -
అందుకే బ్రేక్ తీసుకున్నా
‘‘స్టార్ అవ్వడం కన్నా ప్రేక్షకుల దగ్గర నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా తపన. నాలో యాక్టర్‌ని గుర్తించి నాకు విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తున్న దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నందితా శ్వేత. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందితా శ్వేత చెప్పిన విశేషాలు. నేను మైసూర్లో పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం బెంగళూరులోనే. నా స్కూల్ టైమ్‌లో ‘నంద లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం చేశాను. సినిమా విజయం సాధించింది. కానీ నటనలో నా నైపుణ్యత ఇంకా పెరగాలని నాకు అనిపించింది. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని యాక్టింగ్ కోర్స్ చేశాను. అలాగే నా స్టడీస్‌పై దృష్టి పెట్టి ఎమ్బీఏ కూడా పూర్తి చేశాను. నెక్ట్స్ పీహెచ్డీ చేయాలనే ఆలోచన ఉంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాను. తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ చేశాను. ‘బ్లఫ్ మాస్టర్’ నా మూడో సినిమా. ఇందులో అవని అనే క్యారెక్టర్ చేశాను. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చూడకుండానే గోపీగారు నన్ను ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. సత్యదేవ్ మంచి నటుడు. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. తమిళ చిత్రంతో పోలిస్తే చాలా మార్పులు చేశాం.ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. సినిమాను సినిమాగానే చూస్తున్నారు. కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎంతైనా కష్టపడతాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఇప్పటివరకు 22 సినిమాలు చేశాను. ఒక్క ఈ ఏడాదే తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 11 సినిమాల్లో భాగమవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ 3 రిలీజయ్యాయి. మరో ఎనిమిది సినిమాలు వరుసగా రిలీజవుతాయి.తెలుగు, కన్నడ, తమిళంలలో దేనికి ప్రియారిటీ అంటే చెప్పలేను. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను. తెలుగులో ‘కల్కి’ చిత్రంలో ముస్లిం యువతిగా కనిపిస్తాను. ‘అక్షర’ చిత్రంలో లెక్చరర్ పాత్ర చేస్తున్నాను. అలాగే ప్రేమకథా చిత్రమ్ 2, అభినేత్రి 2, 7’ చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక తమిళంలో ‘నర్మద’ అనే చిత్రంలో తల్లి పాత్ర పోషిస్తున్నాను. సెల్వ దరక్శత్వంలో అరవిందస్వామి హీరోగా రూపొందుతున్న ‘వణంగాముడి’ చిత్రంలో నాది పోలీస్ పాత్ర. కన్నడంలో ‘కేజీఎఫ్’ హీరో యశ్‌తో ‘కిరాతక’ అనే సినిమా చేస్తున్నా. ఇంకా చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎగై్జటింగ్‌గా ఉంటేనే ఓకే చెబుతున్నాను. -
పూరీగారు విజిల్స్ పడతాయన్నారు
‘‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనబడరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇది తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కు రీమేక్ అయినా కూడా అందులో నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితా శ్వేతా జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ చెప్పిన విశేషాలు. ► కెమెరామేన్ అవ్వాలని ఇండస్ట్రీకు వచ్చాను. నాకో యాడ్ ఏజెన్సీ ఉంది. యాడ్స్ రూపొందిస్తూ సినిమా కథలు తయారు చేసుకుంటుంటాను. సాయిరామ్ శంకర్ ‘రోమియో’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘చతురంగ వేటై్ట’ సినిమాకు ప్రేరణ మా గురువుగారు పూరి జగన్నాథ్ తీసిన ‘బిజినెస్‌మేన్’ చిత్రమే. అందులో మహేశ్‌బాబు, నాజర్‌గారు బ్యాంక్ ఓపెనింగ్ సన్నివేశంలో మాట్లాడే సందర్భం ఆధారంగా ‘చతురంగ వైటై్ట’ను రూపొందించారట వినోద్. గురువుగారి సినిమా ప్రేరణతో తీశారు కాబట్టి ఈ సినిమా రీమేక్ చేసే అర్హత నాకే ఉందని ఫీల్ అయ్యాను. ► ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఒరిజినల్ చూసి, ఆ దర్శకుడినీ కలిశాను. కొన్ని మార్పులు చేశాను. హీరో పాత్ర, డైలాగ్స్ సొంతంగా రాసుకున్నాను. అడిషనల్ డైలాగ్స్ పులగం చిన్నారాయణగారు అందించారు. సత్యదేవ్ కంటే ముందే ఇద్దరు ముగ్గురు హీరోలు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. వేరే హీరోలు కథ మార్చమన్నారు. నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ఈ సినిమాకు సత్యదేవ్ కరెక్ట్‌గా సూట్ అవుతాడని ఫస్ట్ నుంచి అనుకున్నాను. టెస్ట్ షూట్లో కృష్ణప్రసాద్‌గారు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా టీమ్ అందరూ నా డైలాగ్స్‌కు ఫ్యాన్ అయ్యారు. పూరీగారు కూడా నా డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయన్నారు. సునీల్ కశ్యప్ సినిమాను తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు మాత్రం మా సినిమా చూసి మోసపోడు. -
సమాజానికి దగ్గరగా బ్లఫ్‌మాస్టర్
‘‘సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా మంది ఉన్నారు. వారి వల్ల పలువురు మోసపోతున్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ గోపీ గణేష్ ఈ సినిమా బాగా తీశారు. ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉన్న సినిమా ‘బ్లఫ్‌మాస్టర్’. ప్రజల్లో చైతన్యం ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వీ ముఖ్య తారలుగా గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌మాస్టర్’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీ గణేశ్ పట్టాభి మాట్లాడుతూ– ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం పృథ్వీ చాలా కష్టపడ్డారు. సునీల్ కశ్యప్ సంగీతం వింటే రెహమాన్ సంగీతం చేశారా? అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మోసపోయే వాళ్లల్లో నేనూ ఒకడిని. దో నంబర్ అనే బిజినెస్‌లో మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తుంటారు’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు), కెమెరా: దాశరథి శివేంద్ర. -
రోమియో మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
రోమియో మూవీ ఆడియో లాంచ్