గోపీ గణేష్ పట్టాభి
‘‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనబడరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇది తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కు రీమేక్ అయినా కూడా అందులో నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సత్యదేవ్, నందితా శ్వేతా జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ చెప్పిన విశేషాలు.
► కెమెరామేన్ అవ్వాలని ఇండస్ట్రీకు వచ్చాను. నాకో యాడ్ ఏజెన్సీ ఉంది. యాడ్స్ రూపొందిస్తూ సినిమా కథలు తయారు చేసుకుంటుంటాను. సాయిరామ్ శంకర్ ‘రోమియో’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘చతురంగ వేటై్ట’ సినిమాకు ప్రేరణ మా గురువుగారు పూరి జగన్నాథ్ తీసిన ‘బిజినెస్‌మేన్’ చిత్రమే. అందులో మహేశ్‌బాబు, నాజర్‌గారు బ్యాంక్ ఓపెనింగ్ సన్నివేశంలో మాట్లాడే సందర్భం ఆధారంగా ‘చతురంగ వైటై్ట’ను రూపొందించారట వినోద్. గురువుగారి సినిమా ప్రేరణతో తీశారు కాబట్టి ఈ సినిమా రీమేక్ చేసే అర్హత నాకే ఉందని ఫీల్ అయ్యాను.
► ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఒరిజినల్ చూసి, ఆ దర్శకుడినీ కలిశాను. కొన్ని మార్పులు చేశాను. హీరో పాత్ర, డైలాగ్స్ సొంతంగా రాసుకున్నాను. అడిషనల్ డైలాగ్స్ పులగం చిన్నారాయణగారు అందించారు. సత్యదేవ్ కంటే ముందే ఇద్దరు ముగ్గురు హీరోలు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. వేరే హీరోలు కథ మార్చమన్నారు. నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ఈ సినిమాకు సత్యదేవ్ కరెక్ట్‌గా సూట్ అవుతాడని ఫస్ట్ నుంచి అనుకున్నాను. టెస్ట్ షూట్‌లో కృష్ణప్రసాద్‌గారు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా టీమ్ అందరూ నా డైలాగ్స్‌కు ఫ్యాన్ అయ్యారు. పూరీగారు కూడా నా డైలాగ్స్‌కు విజిల్స్ పడతాయన్నారు. సునీల్ కశ్యప్ సినిమాను తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు మాత్రం మా సినిమా చూసి మోసపోడు.
Comments
Please login to add a commentAdd a comment