Nandita Shweta
-
మంచి కామెడీ దెయ్యం
నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్‌గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్‌లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని. -
వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం!
‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తోందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’(ఓ మంచి ఘోస్ట్) సినిమా ట్రైలర్ ఆరంభమైంది. నందితా శ్వేత, ‘వెన్నెల’ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా. అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’, ‘ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘హారర్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సూపర్ నేచురల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్ కానుంది. మా సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రఘుబాబు, ‘షకలక’ శంకర్, నాగినీడు, ‘బాహుబలి’ ప్రభాకర్, నవమి గాయక్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. -
కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
సోలో క్యారెక్టర్‌తో వస్తున్న హలో బేబీ
ఎస్ కే ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రూపొందించబడిన చిత్రం హలో బేబీ. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ప్రముఖ నటి నందితా శ్వేత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డ్స్ ఇంకా చాలా ఈ చిత్రానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని కొనియాడారు. చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో చేసిన చిత్రమిది. ఈ చిత్రం చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం కుదిరింది. మా దర్శకుడు రామ్ గోపాల్ రత్నం చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మంచి సంగీతాన్ని అందించారు. చిత్ర కెమెరామెన్ రమణ కె నాయుడు అద్భుతంగా చిత్రాన్ని తీశారు. ఎడిటర్ సాయిరాం తాటిపల్లి అద్భుతమైనటువంటి ఎడిటింగ్ ఎఫెక్ట్ తో, సింగిల్ క్యారెక్టర్ నటించినటువంటి కావ్యకీర్తి అద్భుతమైన నటన తో అతిత్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అని అన్నారు. -
అనుకున్నవన్నీ జరిగాయి
అశ్విన్‌బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్ మీట్లో అశ్విన్ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే కథే ‘హిడింబ’
‘‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రం ‘హిడింబ’. స్క్రీన్‌ప్లే, విజువల్స్ రెగ్యులర్‌గా కాకుండా మా మూవీలో కొత్తగా ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అని హీరో అశ్విన్ బాబు అన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘హిడింబ’ రివర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ– ‘‘ఒక చరిత్ర వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిడింబ’. నాకు గొప్ప తృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు గంగపట్నం శ్రీధర్. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె పాల్గొన్నారు. -
హారర్ సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘హారర్ చిత్రాల్లో నటించకూడదనుకున్నాను. కానీ ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్ నందితా శ్వేత అన్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. అభినిక ఐనాభాతుని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాప నువ్వు తోపు..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సింహాచలం లిరిక్స్ అందించిన ఈ పాటను బాలసూరన్న పాడారు. ఈ పాట విడుదల వేడుకలో శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ–‘‘హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్ కథలకు మ్యూజిక్ చాలా ముఖ్యం.. అనూప్‌గారు ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ పాప నువ్వు తోపు..’ పాట ఆకట్టుకుంటుంది’’ అన్నారు అనూప్ రూబెన్స్. -
యాక్షన్ థ్రిల్లర్
అశ్విన్, నందితా శ్వేత జంటగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హిడింబ’. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ గంగపట్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఒక షాకింగ్ పాయింట్‌తో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిడింబ’. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన మా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. మకరంద్ దేశ్‌పాండే, సిజ్జు, రాజీవ్ కనకాల, శ్రీనివాస రెడ్డి, ‘శుభలేఖ’ సుధాకర్, రఘు కుంచె ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: వికాస్ బడిసా. -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో 'ఓటీపీ' చిత్రం
నందితా శ్వేత, రామ్ జంటగా కల్యాణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓటీపీ’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రాన్ని యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి చిత్రనిర్మాత కుమార్తె బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీ రామచంద్ర క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ కుమార్. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శివరాత్రికి మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు గురు ప్రసాద్ రెడ్డి. ‘‘ఈ సినిమాలోని ఎమోషన్స్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి’’ అన్నారు రామ్ మిట్టకంటి. -
క్యూట్‌గా ఉన్నానంటున్న సిమ్రత్, థ్యాంక్స్ చెప్పిన సామ్
♦ ఇదెంతో బాగుంది కదూ అంటోన్న అవికా గోర్ ♦ ముద్దు ముద్దు చూపులతో గుండెల్లో బాణాలు దింపుతున్న నందిత శ్వేత ♦ చీరలో మెరిసిపోతున్న వితికా షెరు ♦ విరాళాలిచ్చినవారికి థ్యాంక్స్ చెప్పిన సమంత ♦ వర్కవుట్లతో అదరగొడుతున్న నటి ప్రగతి ♦ నేను చాలా క్యూట్‌గా ఉన్నా కదూ అంటోన్న సిమ్రత్ కౌర్ View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sony Charishta (@sonycharishta) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Mangli Singer (@iammangli) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) -
ఎమర్జెన్సీ నేపథ్యంలో...
సుమంత్, నందితా శ్వేతా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. జి.ధనుంజయన్ సమర్పణలో లలితా ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. సోమవారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని టీమ్‌కు అభినందనలు తెలిపారు హీరో నాగచైతన్య. పోస్టర్‌పై ఆర్టికల్ 352 అని ప్రత్యేకంగా రాసి ఉంది. అంటే.. ఈ సినిమా ఎమర్జెన్సీ నేపథ్యంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
నేరస్తులు తప్పించుకోలేరు
శివ కంఠమనేని హీరోగా తెరకెక్కు తోన్న చిత్రం ‘రాఘవరెడ్డి’. ‘క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నందితా శ్వేతా కథానాయిక. రాశీ, అజయ్‌ఘోష్, అజయ్, రఘుబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రధారులు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో జి. రాబాంబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కేఎస్ శంకర్రావు నిర్మిస్తున్నారు. ‘ఆ... చదివిందే నే టెన్త్ రో.. అయ్యిందే డాక్టర్..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో స్నేహా గుప్తా ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. సంజీవ్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ‘అఘోరా, పౌరుషం’ చిత్రాలు చేశా. తర్వాత కన్నడంలో కొన్ని సినిమాలు తీశాను. తెలుగులో ఇది నాకు మంచి కమ్‌బ్యాక్ అవుతుందనుకుంటున్నా. క్రిమినాలజీలో నేరపరిశోధన చేసే పాత్రలో హీరో శివ బాగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీస్తున్నాం. మా సినిమా నిర్మాణ సారథిగా ఉన్న గంటా శ్రీనివాసరావుగారికి థ్యాంక్స్’’ అన్నారు శివ. ‘‘చిత్రీకరణ దాదాపు పూర్తయింది’’ అన్నారు రాంబాబు యాదవ్. ఈ చిత్రానికి యశస్విని, సుధాకర్ స్వరకర్తలు. -
నీ పేరు ప్రేమదేశమా...
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథా చిత్రమ్ 2’ ఫేమ్ నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనులను కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమదేశమా..’ అంటూ సాగే మెలోడీని విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. బాలాజీ రాసిన ‘కనులను కాపలాగా ఉంచా...’ పాటని అనుదీప్ దేవ్ చక్కగా పాడారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతం అందించారు. పాటకి చాలా మంచి స్పందన వస్తోంది. టీజర్ ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది’’ అన్నారు. సత్య, మధునందన్, ‘షకలక’ శంకర్, శ్రీతేజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నా ఈ చిత్రానికి లెన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్. -
అరుదైన అక్షర
నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన చిత్రమిది. వాణిజ్య అంశాలు తగ్గకుండానే మంచి సందేశంతో ఉంటుంది. నందితా శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన సినిమా విజయంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. అక్టోబర్ ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘అక్షర’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. మా ‘అక్షర’ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు బి. చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బెనల్, సంగీతం: సురేష్ బొబ్బిలి, లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్. -
సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర రావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్‌తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్ మరియో, మాటల రచయిత అంజన్ మాట్లాడారు. -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
అవన్నీ కథలో భాగమే
‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సెవెన్’ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా మారారు. హవీష్ హీరోగా రమేష్ వర్మ ప్రొడక్ష¯Œ లో రమేష్ వర్మ నిర్మించారు. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ 5న చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిజార్ షఫీ మాట్లాడుతూ – ‘‘ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజ¯Œ ట్రైనింగ్ ఇ¯Œ స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తీ శరవణన్‌గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ఒక రోజు హవీష్ ఫోన్ చేసి, ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని దర్శకుడిగా ఓకే చెప్పేశా. ఇదొక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాలో లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం ఆలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. దర్శకుడిగా రెండు స్టోరీ లైన్స్ అనుకున్నాను’’ అన్నారు. -
వాళ్లు చెప్పిందొకటి.. చేసిందొకటి
‘‘తెలుగు అమ్మాయి కావాలి అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ‘దర్శకుడు, రంగస్థలం, కల్కి’ సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి’’ అన్నారు పూజిత పొన్నాడ. కెమెరామెన్ నిజార్ షఫీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘7’. హవీష్ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, త్రిధాచౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ నెల 5న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పూజిత పొన్నాడ చెప్పిన విశేషాలు... ► నా తొలి ప్రాధాన్యం ప్రేమకథకే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘7’ చిత్రంలో నాది సస్పెన్స్ రోల్. అందుకే నా పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎవరి కథ వారిదే. క్లైమాక్స్‌లో మెర్జ్ అవుతాయి. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ లేని హీరోయిన్ని నేనే అనుకుంటాను. హావీష్ మంచి కో స్టార్. ‘రాజుగాడు’ సినిమాలో చేసినప్పుడే షఫీగారితో పరిచయం.ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ► ఎలాంటి టీమ్‌తో వర్క్ చేయకూడదో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను. స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్, రిలీజ్ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను. ► ప్రస్తుతం ‘కల్కి’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేయనున్న చిత్రంలో నటించనున్నా. అదేవిధంగా మరో తమిళ సినిమాకి కూడా సైన్ చేశాను. -
ఒక్కరా.. ఇద్దరా?
ఆ అబ్బాయి పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా? కృష్ణమూర్తా? వంటి సస్పెన్స్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సెవెన్’. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కింది. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది. శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపొద్దోయ్ నన్నే..., పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు...’ పాటలను ఇప్పటికే రిలీజ్ చేయగా, తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రమేష్ వర్మ మాట్లాడుతూ–‘‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. కథ నేనే అందించాను. అభిషేక్ పిక్చర్స్ సంస్థ మా సినిమాని విడుదల చేస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లా సినిమా కూడా కొత్తగా ఉంటుంది’’ అని హవీష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహనిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు... బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్లో ఒక్క డైలాగ్ లేకపోవడం విశేషం. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్‌గారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
గ్లామర్ రోల్స్ ఇవ్వటం లేదు
‘‘అవకాశాలు వస్తే గ్లామర్ రోల్స్ చెయ్యాలని ఉంది. కానీ, ఎవ్వరూ నన్ను అలాంటి పాత్రలు చేయమని అడగటం లేదు. ఎవరైనా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే.. ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటే కచ్చితంగా చేస్తాను. ఇటీవల ఓ తమిళ సినిమాలో ప్రత్యేక పాట చేశాను’’ అని నందితా శ్వేత అన్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. హరికిషన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా మొదటి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఆ సినిమాలో నేను చేసిన అమల పాత్ర ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో చేసిన దెయ్యం పాత్ర కంటే ‘ప్రేమకథా చిత్రమ్ 2’లో చేసిన దెయ్యం పాత్ర చాలా కష్టం. పది సంవత్సరాల క్రితం ఓ రోజు రాత్రి గుడికి వెళ్తున్న సమయంలో ఏదో ఒక ఆకారం కనబడటంతో చాలా భయం వేసింది. అప్పుడు నిజంగా దెయ్యం ఉందేమోననిపించింది. కానీ, దేవుడు ఉన్నాడని కూడా నేను బాగా నమ్ముతాను. ‘ప్రేమకథా చిత్రమ్’ ఎండింగ్ నుంచి ఈ సినిమా మొదలవుతుంది. ఇప్పటివరకూ చేసిన సినిమాలకన్నా ఇందులో నా యాక్టింగ్‌లో పూర్తి వేరియేషన్స్ చూడొచ్చు. సమంత్ ఆశ్విన్ మంచి కో ఆర్టిస్ట్. చాలా బాగా సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం కన్నడలో యశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో ‘సెవెన్, అక్షర’ వంటి చిత్రాలున్నాయి’’ అన్నారు. -
కారు సడన్‌గా ఆగింది!
‘‘ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ చాలా ముఖ్యమని భావిస్తాను. పాత్రల మధ్య వైవిధ్యం చూపేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్ సిద్ధీ ఇద్నాని అన్నారు. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధీ ఇద్నానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాకు ఇది సీక్వెల్. హరి కిషన్ దర్శకత్వం వహించారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధీ ఇద్నాని చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రంలో నా నిజజీవితానికి దగ్గరగా ఉండే బిందు అనే కాలేజీ అమ్మాయి పాత్రలో నటించాను. బిందుకి చాలా గర్వం. తను ఇష్టపడితే అవతలివారు ఇష్టపడాల్సిందే. ఈ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ మంచి కో–స్టార్. అతనికి ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నప్పటికీ నిగర్వంగా ఉంటాడు. సెట్లో ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి మేం ఎక్కువగా మాట్లాడుకున్నాం. నందితాశ్వేతాతో నాకు మూడు, నాలుగు సీన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె నటించిన హారర్ సినిమాలు చూశాను. దర్శకుడు హరి సెట్లో సీన్స్‌ను బాగా వివరించడంతో ఈజీ అయింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద విజయం సాధించింది. రెండో పార్ట్ పై అంచనాలు ఉంటాయి. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో దెయ్యం ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ► కోపం, సంతోషం వంటి ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగానే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవి రెగ్యులర్ లైఫ్‌లో భాగమే. కానీ పొసెస్డ్గా.. అంటే నాకే సొంతం అన్న ఫీలింగ్‌ను ఫేస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి కాస్త హోమ్‌వర్క్ చేశాను. ► అతీంద్రియ శక్తులను నమ్ముతాను. ఆత్మలు ఉన్నాయని నా నమ్మకం. ఓ సారి నేను కారులో వెళ్తుంటే సడన్‌గా ఆగింది. రెడ్ శారీలో ఓ లేడీ వచ్చి కారు ముందు నిలబడింది. ఈ అనుభవంతో భవిష్యత్‌లో నేను కచ్చితంగా సినిమా చేస్తాను. ► నేను తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘జంబలకిడిపంబ’(2018) ట్రైలర్ రిలీజైనప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ట్రైలర్లో నేను అబ్బాయిలా నటించడం చూసి నిర్మాత పిలిచి, ఆడిషన్ ఇవ్వమని అడగలేదు. ఇది కథ, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పారు. ‘జంబలకిడిపంబ’ చిత్రం మంచి హిట్ సాధించి ఉంటే నాకు మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవి. ► సమంతకు నేను అభిమానిని. ఆమె ఎంపిక చేసుకుంటున్న తరహా పాత్రలు చేయాలని ఉంది. రాజమౌళిగారి దర్శకత్వంలో నటించాలని ఆశ. ప్రస్తుతం నేను నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ యాభై శాతం పూర్తయింది. జూన్‌లో విడుదల కావొచ్చు. మరో సినిమా కమిట్ అయ్యాను. ఈ నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్తుంది. -
రావు రమేశ్ వాయిస్‌తో...
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు నవ్వుల్లో ముంచెత్తింది. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్, సిద్ధీ ఇద్నాని జంటగా నందితా శ్వేత మెయిన్ హీరోయిన్గా నటించారు. హరికిషన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సూపర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మొదటి భాగానికి దీటుగా ఉంటుంది. ఈ చిత్రం రావు రమేష్‌గారి వాయిస్ ఓవర్‌తో నడుస్తుంది. తాజాగా విడులైన మా సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. విద్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను మధ్య వచ్చే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. పూర్తి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, సంగీతం: జె.బి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, ఆర్పి అక్షిత్ రెడ్డి.