
నందితా శ్వేత, రామ్ జంటగా కల్యాణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓటీపీ’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రాన్ని యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి చిత్రనిర్మాత కుమార్తె బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీ రామచంద్ర క్లాప్ ఇచ్చారు.
నటుడు అలీ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ కుమార్. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శివరాత్రికి మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు గురు ప్రసాద్ రెడ్డి. ‘‘ఈ సినిమాలోని ఎమోషన్స్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి’’ అన్నారు రామ్ మిట్టకంటి.
Comments
Please login to add a commentAdd a comment