
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరి కాంబినేషన్‌లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment