'మీరు మారిపోయారు సర్'.. పూరీ జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే పూరీ జగన్నాథ్‌కి ప్రస్తుత పరిస్థితులకు సరిగా యాప్ట్ అవుతుందేమో? ఎందుకంటే ఒకప్పటి పూరీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి వేరు. మరీ ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ 'డబుల్ ఇస్మార్ట్' చూస్తుంటే అసలీ సినిమా తీసింది ఈయనేనా అనే సందేహం.
(ఇదీ చదవండి: నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్)
'బద్రి'లో పవన్ కల్యాణ్ 'నువ్వు నంద అయితే ఏంటి? నేను బద్రీ, బద్రీనాథ్' అన్నప్పుడు... 'ఇడియట్'లో రవితేజ 'కమీషనర్ల కూతుళ్లకి మొగుళ్లు రారా' అన్నప్పుడు గానీ... 'శివమణి'లో నాగార్జున 'నాక్కొంచెం మెంటల్' అన్నప్పుడు.. 'పోకిరి'లో మహేశ్ 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే ఆడే పండుగాడు' అన్నప్పుడు.. 'బిజినెస్‌మేన్'లో మహేశ్ 'ముంబైలో బతకడానికి రాలేదు, ఉ* పోయించడానికి వచ్చాను' అన‍్నప్పుడు.. 'నేనింతే'లో రవితేజ.. సినిమా కోసం డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ మూవీ లవర్స్, మాస్ ఆడియెన్స్ ఉర్రూతలూగారు. పూరీపై ఇష్టం పెంచుకున్నారు.
కానీ రీసెంట్ టైంలో పూరీ జగన్నాథ్ అంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ గుర్తురాదు. ఎందుకంటే ఆయన మార్క్ ఎప్పుడో మిస్ అయిపోయింది. 'బిజినెస్‌మేన్' వరకు పూరీ పెన్ను పవర్ వేరు.. ఆ తర్వాత వేరు. దాదాపు గత పదేళ్లుగా పూరీ జగన్నాథ్‌లోని అసలు సిసలు డైరెక్టర్ ఎక్కడో మిస్సయిపోయిన ఫీలింగ్!
(ఇదీ చదవండి: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ)
లైగర్, పైసా వసూల్, రోగ్, మోహబూబా.. తాజాగా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాలన్నీ బాగున్నాయా బాగోలేవా అనే సంగతి పక్కనబెడితే పూరీ అభిమానుల బాధ వర్ణనాతీతం. మాకు ఇప్పుడు కనిపిస్తున్న పూరీ వద్దు.. ఒకప్పటి డైరెక్టర్ పూరీ జగన్నాథే కావాలని మారం చేసేంత ఇష్టం. మరోవైపు పూరీ జగన్నాథ్ ట్రెండ్‌కి తగ్గట్లు మారలేక ఒకే తరహా సినిమాలు తీస్తున్నాడో బాధ.
ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చాలామంది డైరెక్టర్స్‌కి పూరీ జగన్నాథ్ టెక్స్ట్ బుక్ లాంటోడు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నోడు. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి సగటు టాలీవుడ్ అభిమాని తట్టుకోలేకపోతున్నాడు. పూరీ సర్ మీరు మారాలేమో?
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment