అంతకు మించి... | Double Ismart Movie Shooting Update | Sakshi
Sakshi News home page

అంతకు మించి...

Published Sun, May 5 2024 1:46 AM | Last Updated on Sun, May 5 2024 10:32 AM

Double Ismart Movie Shooting Update

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో హీరో రామ్‌ని ఫుల్‌ మాస్‌గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్‌... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ చిత్రం కోసం రామ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్‌గా కనిపించ డంతో పాటు స్టయిలిష్‌గానూ కనిపించనున్నారు.

‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్‌ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్‌ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్‌ దత్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement