
కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి తల్లికొడుకుగా నటించిన కొత్త సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie). ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
ట్రైలర్ విషయానికొస్తే.. స్టోరీ ఏంటనేది విడమరిచి చెప్పేశారు. వైజాగ్ లో అర్జున్ అనే రౌడీ. తల్లి వైజయంతి ఏమో ఐపీఎస్. పెంపకం విషయమై తల్లికొడుకు మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో మాటలు ఉండవు. మరోవైపు విలన్ కి అర్జున్ తో గొడవ. దీంతో ఇతడి తల్లిని ఇబ్బంది పెడతారు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
విజువల్స్, తల్లి కొడుకు ఎమోషన్స్, ఫైట్స్.. ఇవన్నీ ట్రైలర్ వరకు బాగానే ఉన్నాయి. మరి మూవీలో ఎమోషన్స్ ని ఎంతవరకు వర్కౌట్ చేస్తారు, ఏంటనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కల్యాణ్ రామ్ అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్)