Jr NTR Release Theatrical Trailer Of Kalyan Ram Bimbisara, See Inside - Sakshi
Sakshi News home page

Kalyan Ram Bimbisara Trailer: శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..

Published Wed, Jul 27 2022 7:30 PM | Last Updated on Wed, Jul 27 2022 7:55 PM

Jr NTR Release Theatrical Trailer Of Bimbisara - Sakshi

సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్‌ రామ్‌. దీంతో ఆయన ఈసారి రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో అన్న సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

'హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు, ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..' అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. 'నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని చెప్పే డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరో లెవల్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నందమూరి తారకరామారావు నూరవ జయంతి సంవత్సరం కాబట్టి బింబిసారను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు కల్యాణ్‌ రామ్‌.

చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా
అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement