'డెవిల్' ట్రైలర్ ఇంట్రెస్టింగ్.. అంతా బాగానే ఉంది కానీ? | Nandamuri Kalyan Ram's Devil Movie Trailer Launched In Telugu | Sakshi
Sakshi News home page

Devil Trailer: మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్.. ట్రైలర్‌తో అంచనాలు

Published Tue, Dec 12 2023 7:31 PM | Last Updated on Tue, Dec 12 2023 7:52 PM

Kalyan Ram Devil Movie Trailer Telugu - Sakshi

కల్యాణ్ రామ్ కొత్త సినిమా 'డెవిల్'. ఇప్పటికే రిలీజై పోవాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 29న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలు పెంచేస్తున్న ఈ పెంచేస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?

(ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!)

అభిషేక్ నామా నిర్మిస్తూ-దర్శకత్వం వహిస్తున్న 'డెవిల్' సినిమాలో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. అదే విషయాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఓ అమ్మాయి చావుని ఎంక్వైరీ చేసే క్రమంలో ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో చూపించబోతున్నారు.

ట్రైలర్ బాగుంది, సినిమాపై హీరో కల్యాణ్ రామ్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. కానీ 'సలార్' రిలీజైన వారం రోజులకే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే.. మూవీ లవర్స్ అదే మాయలో ఉంటారు. ఇదే జరిగితే మాత్రం 'డెవిల్'కి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement