టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డబుల్ ఇస్మార్ట్ అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్ర పోషించారు. బిగ్‌బుల్‌గా అభిమానులను అలరించారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
కథేంటంటే..
ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.
దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్‌గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment