‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు...
► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను.
► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను.
► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్‌మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం.
► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో?
► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ).
► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది.
► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్‌పీరియన్స్.
► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు.
నా స్టైల్ ఏంటో తెలియదు
Published Mon, Jul 1 2019 2:46 AM | Last Updated on Mon, Jul 1 2019 8:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment