Prashant Verma
-
కంగువాతో పోటీకి దిగుతున్న ప్రశాంత్ వర్మ
అశోక్ గల్లా హీరోగా నటించిన చిత్రం దేవకీనందన వాసుదేవ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అదే రోజు సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో వాటితో పోటీకి రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి! సినిమా మీద మంచి నమ్మకం తో కంగువా మీద వేస్తున్నారు 👍సినిమా కి #టాలీవుడ్ good రిపోర్ట్ ఉంది#DevakiNandanaVasudeva in cinemas from November 14th 🎥#DNVonNov14 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @lalithambikaoff pic.twitter.com/m4WwhMIfKn— Kakinada Talkies (@Kkdtalkies) October 25, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా కలి.. ట్రైలర్ చూశారా?
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కలి". ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా "కలి" మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ - "కలి" ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది. టీమ్ అంతా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. "కలి" మూవీ చూసేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా అన్నారు.కలి ట్రైలర్ విషయానికి వస్తే.. శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. 'నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ' ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు.ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓవర్ నవ్వించింది. 'మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే...' అనే డైలాగ్ "కలి" కథలోని సారాంశాన్ని చెప్పింది. -
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
అశోక్ గల్లా కొత్త మూవీ.. కెమెరా స్విచ్చాన్ చేసిన నమ్రత
యంగ్ హీరో అశోక్ గల్లా కొత్త చిత్రం షురూ అయింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నమ్రత కెమెరా స్విచ్చాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించగా, మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి స్క్రిప్ట్‌ని ప్రశాంత్ వర్మకు అందజేశారు. అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ప్రశాంత్ వర్మగారు చాలా మంచి వినోదాత్మక కథ అందించారు’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘నాలుగేళ్లుగా ఈ కథను రాసుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. హీరో మహేశ్ బాబు ఈ సినిమా పూజా కార్యక్రమాల ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎప్పటికీ అంతులేని విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు. Best of luck on your new one @AshokGalla_!! Wishing you endless success always!! 👍👍 pic.twitter.com/eZvyQbWpzZ— Mahesh Babu (@urstrulyMahesh) February 5, 2023 చదవండి: నయనతారను పొగిడిన షారుక్ ఖాన్ -
కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి. -
వాస్తవ ఘటనలతో జాంబీ రెడ్డి
‘అ!’, ‘కల్కి’ వంటి చిత్రాలతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘అ!’తో జాతీయ అవార్డు పొందిన ప్రశాంత్ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్‌శేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. నిర్మాత రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగులో తొలి జాంబీ మూవీ ‘జాంబీ రెడ్డి’తో మా సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రశాంత్ వర్మ విజ¯Œ , ఫిల్మ్‌మేకింగ్ స్టైల్‌పై ఒక నిర్మాతగా నాకు అమితమైన నమ్మకం ఉంది. కరోనాకీ, ‘జాంబీ రెడ్డి’కీ మధ్య కనెక్షన్ ఏంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.. థియేటర్లు తెరుచుకున్నాక తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు మా సినిమా రెడీ అవుతోంది’’ అన్నారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని కచ్చితంగా చెప్పగలను. త్వరలోనే మా చిత్రంలోని తారాగణం వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబి¯Œ , కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి. -
కరోనా మందు
‘అ!, కల్కి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన తదుపరి సినిమా కథాంశంగా కరోనా వైరస్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు ప్రశాంత్. ‘కరోనా వ్యాక్సిన్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. టైటిల్‌ని బట్టి చూస్తే కరోనా వైరస్‌కి మందు కనుగొన్నట్టు ఈ సినిమాలో చూపిస్తారని ఊహించవచ్చు. ఇందులో నటించబోయేది ఎవరు? ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు? వంటి విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. -
మళ్లీ అశ్చర్యపరుస్తారట
ఆశ్చర్య కదా.. ‘అశ్చర్య’ అని ఉందేంటి అనుకుంటున్నారా? అయితే చదవండి. గత ఏడాది ‘అ!’తో అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఇంకోసారి అశ్చర్యపరచడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమయ్యారని తెలిసింది. నాని నిర్మాణంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిసింది. ఇందులో కాజల్, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా నటీనటుల గురించి ఏమీ అనుకోలేదని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
ఈ ఇద్దరిలో నానీకి గెస్ట్ ఎవరు?
కంటిన్యూస్‌గా ఏడు హిట్స్‌తో నాని ఫుల్ జోరుగా ఉన్నారు. ఈ సక్సెస్ఫుల్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేస్తుంటే, నాని మాత్రం తనకు తానే డేట్స్ ఇచ్చుకున్నారట. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. నాని నిర్మాతగా మారుతున్నారని సమాచారం. నాలుగేళ్ల క్రితం ‘డి ఫర్ దోపిడి’ సినిమాకి నాని జస్ట్ భాగస్వామిగా వ్యవహరించిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నారని టాక్. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు, ఓ గెస్ట్ రోల్‌కు కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా. ఆల్రెడీ నాని సరసన ‘అలా మొదలైంది’, ‘సెగ’ చిత్రాల్లో నిత్య నటించారు. కాజల్ అగర్వాల్ మాత్రం నటించలేదు. మరి.. నాని హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రంలో ఈ ఇద్దరిలో ఎవరు గెస్ట్ రోల్ చేస్తారు? ఎవరు నాయికగా నటిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ల ప్లేస్‌లో వేరే తారలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.