కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి | Prasanth Varma wrapped up shooting for his third film Zombie Reddy | Sakshi
Sakshi News home page

కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి

Published Thu, Nov 19 2020 5:45 AM | Last Updated on Fri, Feb 5 2021 12:20 PM

Prasanth Varma wrapped up shooting for his third film Zombie Reddy - Sakshi

‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్‌ వర్క్‌ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌శేఖర్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్‌డౌన్‌ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్‌ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్‌ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఆనంద్‌ పెనుమత్స, ప్రభ చింతలపాటి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement