Prasanth Varma Zombie Reddy Sequel: మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి! - Sakshi
Sakshi News home page

Zombie Reddy: మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి!

Published Wed, May 12 2021 11:23 AM | Last Updated on Wed, May 12 2021 4:13 PM

Prasanth Varma Planning For Zombie Reddy Sequel - Sakshi

Zombie Reddy: తెలుగు ప్రేక్షకులకు తొలిసారి జాంబీలను పరిచయం చేసిన సినిమా జాంబీ రెడ్డి.  హాలీవుడ్‌కు మాత్రమే ప‌రిమిత‌మైన ఇలాంటి కొత్త జోన‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేశాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఓటీటీ‘ఆహా’లో విడుదలై 9.7 టీఆర్‌పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రానుందట. తాజాగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ జాంబీరెడ్డికి సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే ఈ సీక్వెల్ ప‌నులు మొద‌లు పెట్టాడ‌ని, దీనిపై హీరో తేజ‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. . ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం జాంబీరెడ్డి 2 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడట. మ‌రి జాంబీ రెడ్డి సీక్వెల్‌పై వ‌స్తోన్న‌వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
చదవండి:
 ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి?
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రెండు భాగాలుగా ‘పుష్ప’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement